top of page

మధురవాణి.కాం 

దసరా - దీపావళి రచనల పోటీ విజేతలు

మధురవాణి.కాం [madhuravani.com] అంతర్జాల పత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దసరా-దీపావళి-2017  రచనల పోటీకి వందల సంఖ్యలో రచనలని పంపిన రచయితలందరికీ పేరు పేరునా ధన్యవాదములు. తెలుగులో సృజనాత్మక రచనకు పట్టం కడుతున్న సాహిత్యాభిలాషులకి కొదువ లేదన్న సత్యాన్ని ఈ విశేష స్పందన నిరూపిస్తుంది. రచయితల, పాఠకుల ఆదరాభిమానాలు, ఇలాంటి లాభాపేక్ష లేని పత్రికలకి ఇంధనంగా పనిచేసి మరిన్ని మంచి రచనలందించటానికి ప్రోత్సాహమవుతాయన్నది కాదనలేని వాస్తవం! 

 

న్యాయనిర్ణేతలు అన్ని రచనలనీ పరిశీలించిన మీదట, అన్ని విభాగాలలో ఉత్తమ రచనలతో పాటుగా, 5 కవితలు, 9 కథలని ప్రశంసా బహుమతులకి అర్హమైనవిగా సూచించారు. విజేతలకి అభినందనలు!

 

అన్ని రచనల ఎంపిక విషయంలోనూ నిర్వాహక బృందానిదే తుదినిర్ణయం. ఈ విషయంలో, ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, వాదోపవాదాలకి తావు లేదు.

 

ఇతర బహుమతి పొందిన రచనలని వీలు వెంబడి తదుపరి సంచికల్లో ప్రచురించగలము. మరొక్కసారి, రచనలని పంపిన రచయితలందరికీ... పత్రికాముఖంగా ధన్యవాదాలు!

విజేతలు

కథా మధురాలు

ఉత్తమ కథ బహుమతులు:

అమ్మ దొంగా!  - ఓలేటి శశికళ

టంగ్... టంగ్... టంగ్... -కొల్లిపర హితేష్

 

ప్రశంసా బహుమతులు:

నిర్ణేత -కన్నెగంటి అనసూయ

దెయ్యాల వేళ- భవానీ ఫణి

లెక్క సరిపోయింది - గోవింద చింతాడ

మేలుకో నేస్తం -ప్రసూన రవీందర్

 విధ్వంస రచన- మధుకర్ వైద్యుల

భలే మలుపు - రాజేష్ యాళ్ళ

కల కానిది - పి.బి. రాజు

బోధ వృక్షం - ఎమ్వీ రామిరెడ్డి

కనకాలు-హైమావతి ఆదూరి

 

కవితా వాణి

ఉత్తమ కవిత బహుమతులు

మరో మొదటి కథ-       లక్ష్మీ నారాయణ తుట్టగుంట 

నేనంటే నేనే కాదు-     మానస చామర్తి 

ప్రశంసా బహుమతులు

చిరునవ్వు -      ఫణీంద్రరావు కొనకళ్ళ

ధ్యాన ముద్ర-   శైలజామిత్ర

అందమైన అట్టపెట్టెలో- వారణాసి నాగలక్ష్మి

వర్షించే కళ్ళు...- డా. జడా సుబ్బారావు

కొత్త బొమ్మ - పూండ్ల మహేష్

వ్యాస మధురాలు

ఉత్తమ వ్యాస బహుమతులు: మూడు సమాన బహుమతులు

నవరసమేళనం - భక్తిరసోన్మీలనం - ప్రహ్లాదోపాఖ్యానం      - తంత్రవహి శ్రీరామమూర్తి

జీవమున్న నవల -ఒక్క వాన చాలు - శివుని రాజేశ్వరి

ఆధునిక కవిత్వంలో 'మా ఊరు" భావన - జడ సుబ్బారావు

విజేతలకి అభినందనలు!

ప్రచురణ, ఇతర విషయాలలో మధురవాణి నిర్వాహకులదే తుది నిర్ణయం.

అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఇ-మెయిల్  sahityam@madhuravani.com

భవదీయులు
 శ్రీనివాస్ పెండ్యాల| చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | విన్నకోట రవి శంకర్  | దీప్తి పెండ్యాల |  వంగూరి చిట్టెన్ రాజు

****

bottom of page