MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
అభినందనలు
మధురవాణి.కాం
దసరా - దీపావళి రచనల పోటీ విజేతలు
మధురవాణి.కాం అంతర్జాల పత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దసరా-దీపావళి కథల పోటీకి వందల సంఖ్యలో రచనలని పంపిన రచయితలందరికీ పేరు పేరునా ధన్యవాదములు. తెలుగులో సృజనాత్మక రచనకు పట్టం కడుతున్న సాహిత్యాభిలాషులకి కొదువ లేదన్న సత్యాన్ని ఈ విశేష స్పందన నిరూపిస్తుంది. రచయితల, పాఠకుల ఆదరాభిమానాలు ఇలాంటి లాభాపేక్ష లేని పత్రికలకి ఇంధనంగా పనిచేసి మరిన్ని మంచి రచనలందించటానికి ప్రోత్సాహమవుతాయన్నది కాదనలేని వాస్తవం!
అన్ని రచనలనీ పరిశీలించి, ఉత్తమ కథలు, ఉత్తమ కవితలు, ఉత్తమ వ్యాసాలతో పాటు కొన్ని ఎన్నదగిన రచనలకి ప్రశంసా బహుమతులు ప్రకటిస్తున్నాము. న్యాయ నిర్ణేతల అభిప్రాయంలో కవితల స్ధాయి కొంత నిరాశాజనకంగా ఉన్న కారణాన కవితా వాణి విషయంలో ప్రశంసా బహుమతులుగా కేవలం 5 కవితలని మాత్రమే ఎంపిక చేశారు.
అన్ని రచనల ఎంపిక విషయంలోనూ నిర్వాహక బృందానిదే తుదినిర్ణయం. ఈ విషయంలో, ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, వాదోపవాదాలకి తావు లేదు.
ఇతర బహుమతి పొందిన రచనలని వీలు వెంబడి తదుపరి సంచికల్లో ప్రచురించగలము.
మరొక్కసారి, రచనలని పంపిన రచయితలందరికీ... పత్రికాముఖంగా ధన్యవాదాలు!
విజేతలు
కథా మధురాలు
ఉత్తమ కథ బహుమతులు
ప్రశంసా బహుమతులు
నిరాకారుడు -రమణారావు (ఎలక్ట్రాన్)
ప్రేమించే మనసు - హితేష్ కొల్లిపర
నిర్ణయం - పి.వి.వి. సత్యనారాయణ (తిరుమలశ్రీ)
జ్యోత్స్న - సత్యవతి దినవహి
ఎపిసోడ్ నంబర్ 876- రాజేష్ యాళ్ళ
ఏకాకి - శర్మ దంతుర్తి
నో రిటైర్మెంట్ ప్లీజ్- జయంతి ప్రకాశ శర్మ
ఇక్కడ లేనిది...అక్కడ ఉన్నదీ... - పి.వి.శేషారత్నం
అలా మొదలయ్యింది -ప్రసూన రవీంద్రన్
కవితా వాణి
ఉత్తమ కవిత బహుమతులు
ప్రాకృతిక కిటికీ - ర్యాలి ప్రసాద్
ప్రశంసా బహుమతులు
దేహ వ్యాప్తంగా - ఎం.వీ. రామిరెడ్డి
అవ్యయం - రవి చంద్ర
సహజవాక్యం - అశోక్ అవారి
వ్యాస మధురాలు
ఉత్తమ బహుమతులు
ప్రాచీన కావ్యాలు – వ్యాఖ్యానాలు – విశేషాలు. -జడా సుబ్బారావు
తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ – ఆవశ్యకత - డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
ప్రశంసా బహుమతులు
నారన సూరన ఉదయనోదయము – సవిమర్శక పరిశీలన - పావని
నన్నయ కవిత్వంలో సామాజిక సందేశము - హరిత భట్లపెనుమర్తి
విజేతలకి అభినందనలు!
ప్రచురణ, ఇతర విషయాలలో మధురవాణి నిర్వాహకులదే తుది నిర్ణయం.
అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఇ-మెయిల్ sahityam@madhuravani.com.
భవదీయులు
చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుదేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల | వంగూరి చిట్టెన్ రాజు
****