MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-4]
గిరిజా శంకర్ చింతపల్లి
ఒకానొక అర్థరాత్రి.
ఒక తాగుబోతు ఇంటికెళ్ళి తలుపు గొట్టాడు.
"ఎవడ్రా అదీ?" లోపల్నించి ఒక బొంగురు కంఠం.
"నేనే నాన్నా. తలుపు తియ్యి! వాన పడుతోంది"
ఆ మీసాల ముసలాయన తలుపు తీసీ తీయగానే "నేను నీ తండ్రినీ గాదు, నువ్వు నా కొడుకువీ గాదు. ఫో" అని గర్జించాయి మీసాలు.
జ్ఞాపకాలు మరోమారు
డా|| వాడపల్లి శ్రీనాథ్
ఎనభై తొమ్మిదిలో -
ఏ చదువుల కోసం ఎటు వెళ్లాలో తెలీక సతమత మవుతున్న రోజులు.
అప్పారావు మాస్టారి ఆర్ట్ ఎగ్జిబిషన్ లో (లైబ్రరీ హాల్లో) నా బొమ్మలు కూడా ఒక టేబుల్ మీద పెట్టించేరు.
అందులో నా వొచ్ఛీ రాని డ్రాయింగ్ Mother & Child శర్మగారికి బాగా నచ్చి, మీ బొమ్మలో/ల్లో loneliness ఎందుకు కనిపిస్తోంది అన్నారు... అదిగో అక్కడే సరిగ్గా ఆయనతో పరిచయం.
ఆరోజు నాలో శర్మగారు ఏంచూసారో, తన చేతిలో లైబ్రరీ పుస్తకాల్లో "Letters to Theo" చూపిస్తూ "ఈ పుస్తకం చదివేక మీకు అప్పిస్తాను, మా ఇల్లు కొత్తకోవెల పక్కన - వీలున్నప్పుడు రండి" అంటుంటే - నాకు - పుస్తకం అప్పేమిటా? అంత విలువా? అన్నదే ధ్యాస.
మరో రెండ్రోజుల తర్వాత వారింటికి వెళ్ళేక పుస్తకం విలువ తెలిసింది.