MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
సాహిత్యం -మన ఆలోచనలూ పరిమితులూ
మెడికో శ్యాం
గజల్ నిర్వచనాలన్నిటిలోకీ గజలంటే 'ప్యార్ కా గుఫ్తగూ' అన్నది నాకిష్టం. గుఫ్తగూ అంటే సంభాషణ.
సాహిత్యరూపాలన్నీ సంభాషణలే.
అంటే- నాలో నేను, తనలో తను, ఇద్దరి మధ్యా , కొందరి మధ్యా సంభాషణలే.
వ్యాసాలు బహుశా మోనోలాగ్సేమో.
ఇవాళ ఇదీ మీకూ, నాకూ మధ్య సంభాషణ. మనం, మీరూ, నేనూ - సాహితీవేత్తలం. ఇపుడు రాసేవాడూ, చదివేవాడూ ఒకటే. నిజానికి రాసేవాళ్ళమున్నాము కానీ, చదివేవాళ్ళము ఎక్కువగా లేము.
తెలుగు సాహిత్యంలో హాస్యం - మహిళల రచనలు
వి. శాంతిప్రబోధ
నవ్వు నాలుగు విధాల చేటు అంటారు కానీ నవ్వు నలభయ్ విధాలా రైటనీ గ్రేటనీ చెప్పరు .
కానీ.. మనసు బాగోనప్పుడు, చికాకులో ఉన్నప్పుడు ధ్యాస మళ్లించుకునేందుకు, మనసారా నవ్వుకునేందుకు హాస్యాన్ని వెతుక్కుంటాం . నిజమే హాస్యాన్ని మించిన ఔషధం ఉందా?
నవరసాల్లో హాస్యం ప్రధానమైంది. అందుకేనేమో అసలు నవ్వని వాడు రోగి. నవ్వటం ఒక భోగం అంటాడు జంధ్యాల.
మన వాస్తవ జీవితంలో హాస్యంగా మాట్లాడడం , చెణుకులు, చతురోక్తులు విసరడం వాటికి పడీపడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడమో లేదా ముసిముసి నవ్వులు విసరడమో చేస్తుంటాం. చాలా సహజంగా జరిగిపోతుందది. ఆ నవ్వుల పంచాంగం విప్పడం లేదిక్కడ.
భలే మంచి రోజు
రమాకాంత్ రెడ్డి
ఈ సువిశాల వసుధైక కుటుంబంలో నేను ప్రప్రథమంగా, మౌలికాతిమౌలికంగా తెలుగువాణ్ణి. పదహారణాల అనను కానీ పది పన్నెండణాల తెలుగు వాణ్ని.
రాయలోరిసీమలో చిత్రావతి నది ఒడ్డున జన్మించిన వాణ్ని. ఒక మట్టిపలక మధ్యలో సుద్దబలపంతో మా తాత దిద్దించిన చిన్న 'అ'ని ఆ పలక నిండిపోయేలా దిద్దుకున్నవాణ్ణి.
అదే 'అ'తో నేర్చుకున్న మొదటి పదంతోనే 'అమ్మ' అనే అమృతభాండాన్ని రుచిచూసినవాణ్ని.
బుద్ధి, లోకజ్ఞానం ఇంకా ఏర్పడి ఏర్పడని దశలోనే
అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి అనీ
కని కల్ల నిజము తెలిసిన మనుజుడే నీతిపరుడనీ