MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
కలలూ-కళలూ
ద్వారం దుర్గాప్రసాదరావు
కొన్ని కథలెలా ఉంటాయంటే -
"కలలోనే ఒక మెలఁకువలా, ఆ మెలఁకువలోనే ఒక కలగా" ఉంటాయి.
మాన్యుల జీవితాల్లో కొన్ని సామాన్య సంఘటనలు మననం చేసుకొనవలసినవైతే - కొందరు సామాన్యుల తలపులూ, చేతలూ తలకెత్తుకోవలసిన ఆదర్శాలుగా కూడా నిలుస్తాయి. మనుగడ బాగుండాలంటే మంచి కలలు కనాలి. మంచి కలలే రావాలంటే మంచి కథలు చదవాలి. కళకు మంచి నిర్వచనం "మెలఁకువలోనే ఒక కల - ఆ కలలో ఒక మెలకువ" అని చెప్పవచ్చునేమో.
విజయనగరం సంస్థానంలో ప్రభువులు, ప్రజలు, పండితులూ మంచి కలలు కన్నారు. చాలా వరకూ అవి నిజాలయ్యాయి. మనకు చెప్పుకోడానికి బోలెడు కథలు. అందులో కొన్ని...
గిడుగు రామమూర్తి పంతులు గారు
దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను ‘తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక భాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు.
గిడుగు వెంకట రామమూర్తి (1863-1940)
తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం” లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.
గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.
19వ శతాబ్దపు సాహిత్య స్పృహ
భట్లపెనుమర్తి హరిత
సాహిత్యకారులు సౌలభ్యం కోసం తెలుగు సాహిత్యాన్నంతటినీ యుగాలుగా విభజించారు.
కవుల పేర్లతో, కవిపోషకులైన రాజుల పేర్లతో, ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్య ప్రక్రియలపేర్లతో ఇలా రకరకాలుగా కాలాన్ని విభజించారు. అయితే ఈ విభజన అవగాహన కోసం చేయబడినదే కాని సాహిత్యంలో ఎప్పుడూ స్పష్టమైన విభజన రేఖలుండవు.
ఉదాహరణకు పురాణయుగంలో అన్నీ పురాణాలే వచ్చాయనో లేక ప్రబంధయుగంలో అన్నీ ప్రబంధాలే రచింపబడ్డాయనో భావించరాదు. ఏదైనా ఒక నిర్దిష్ట కాలపు సాహిత్యాన్ని పరిశీలించాలనుకుంటే ఆ కాలపు పూర్వాపరాలను కూడా విధిగా గమనించి ఒక అవగాహనకు రావలసిందే!
మృచ్ఛకటకం- నాటి సామాజిక పరిస్థితులు
కర్లపాలెం హనుమంతరావు
మృచ్ఛకటకం అంటే మట్టి బండి. సంస్కృత రూపకం. మహాకవి శూద్రకుడి గొప్ప నాటకం. గురజాడవారి 'కన్యాశుల్కం' తీరులో ఈ నాటకం కూడా నాటి సామాజికి పరిస్థితులకు అద్దం పడుతుంది.
మృచ్ఛకటకం నాటికి సమాజంలో వర్ణవ్యవస్థ ఉంది. కానీ మధ్యయుగాల నాటి దుష్ట రూపం ఇంకా తీసుకోలేదు. వర్ణాలను బట్టి కాక వెసులుబాటును బట్టి వృత్తులు నిర్వహించుకొనే స్వేఛ్చ ఉండేది. వర్గాల మధ్య మంచి సామరస్యం కనపించేది.
చారుదత్తుడు బ్రాహ్మణుడు. అయినా వ్యాపారాలు నిర్వహించేవాడు. నాటకంలో ఆ పాత్రకు గల గౌరవం ఈ నిజాన్ని నిరూపిస్తుంది.