MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-9]
గిరిజా శంకర్ చింతపల్లి
ఒక జబ్బు విషయం మాట్లాడి, "దానికి ఏదో కొత్త మందు వచ్చిందిటకదా మార్కెట్ లోకి, నీకేమయినా తెలుసా?" అని నన్ను అడిగాడు నాతో పనిచేసే సైకోలజిస్ట్.
"తెలుసు" నా సమాధానం.
"అయితే మా చెల్లి ఆర్జెంటీనాలో ఉంటుంది, విజిట్ కి వచ్చింది టెక్సాస్. రేపు చూడగలవా? మళ్ళీ తను రెండు వారాల్లో వెళ్ళిపోతుంది?"
"తప్పకుండా" అని నా సెక్రటరీ కి ఫోన్ చేసి మర్నాడు 9 గంటలకి అప్పాయింట్మెంట్ ఇచ్చాను.
మర్నాడు సరిగ్గా 9 గంటలకి వచ్చింది. దేవలోకం నించి దిగి వచ్చిన దేవత లాగా ఉన్నది. ఆమె అందం చెప్పడానికి వీల్లేదు. నా ఫ్రెండ్ చెప్పిన జబ్బుకి ఈమెకీ అసలు సంబంధం కనబళ్ళేదు. పొరపాటున ఇంకెవరయినా వచ్చారేమోనని నేను కంగారు పడటం చూసి, నవ్వుతూ, "డాక్టర్. నేనే. మీ ఫ్రెండ్ సిస్టర్ ని. భయపడకండి." అని చెప్పి మొదలు పెట్టింది -
తెలుగు - సాంకేతికీకరణ
డా. కె.గీత
ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ మారుతున్న సాంకేతిక అవసరాలకు సరిపడా భాషలని మనం సాంకేతీకరించుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచ భాషల్లో కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని సాధించిన భాషల దిశగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా ప్రయాణం సాగించడం చెప్పుకోదగిన విషయం.
ప్రపంచంలోని ఇతరభాషలతో పోలిస్తే తెలుగుభాష సాంకేతికీకరణలో వెనుకంజలో ఉంది. అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని తెలుగులో కమ్యూనికేషను అందరికీ అవసరమైనందువల్ల తెలుగు భాషా సాంకేతీకరణ రోజురోజుకీ ముందంజ వేస్తూంది.
వాయిస్ అసిస్టెంట్లు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతని సంతరించుకుంటున్న నేపథ్యంలో ఈ దిశలోనూ తెలుగుభాషకి సంబంధించిన సాంకేతిక అభివృద్ధి కోసం కృషి అక్కడక్కడా జరుగుతూ ఉంది. అటువంటి ప్రాజెక్టుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో గత అయిదేళ్లుగా పనిచేస్తూ ఉండడం నాకు లభించిన అరుదైన అవకాశం.
ఆ అనుభవాలతో మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను.
అసలు తెలుగుభాష సాంకేతికీకరణ అంటే ఏవిటి అని ఆలోచిస్తే ఇప్పుడు మనం కంప్యూటర్లలో సాధారణంగా ఇంగ్లీషుని ఎక్కడెక్కడ వాడుతున్నామో అదంతా తెలుగులోకి మార్చుకోవడం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు.
విమర్శ - సమీక్ష
కర్లపాలెం హనుమంతరావు
విమర్శ అంటే విచారణ అని బ్రౌణ్యం. పక్షపాతం లేని సహృదయపూర్వక సానుకూల తుల్యమానం చక్కని పరిశీలన విమర్శ అవుతుంది.
యయావరీయుడు విమర్శకులను ఆరోచకి, సతృణాభ్యవహారి, మత్సరి, తత్వాభినివేశి- అని నాలుగురకాలుగా విభజించాడు.
ఎంత మంచి కృతి అయినా సరే ఆరోచకుడికి రుచించదు.
మంచివీ, చెడ్డవీ కూడా శభాష్ అంటాడు సతృణాభ్యవహారి.
మత్సరి అసూయతో తప్పులు వెతికితే, పక్షపాతం లేకుండా, పాలూనీళ్ళూ వేరుచేసే రాజహంసలాగ, కావ్య విమర్శ చేసేవాడు తత్త్వాభినివేశి.
కావ్యపరిశ్రమ తెలిసి చక్కని వివరణలతో శబ్దాల కూర్పును రసామృతంగా అందించే తత్త్వాభినివేశులు అరుదని ' కావ్య మీమాంస ' అభిప్రాయపడుతుంది.
అమృత కథలు
భావరాజు శ్రీనివాసు
ఎవరి మాటైనా వినాలంటే వారి మీద విశ్వాసం ఉండాలి.
అంతరాత్మ ప్రబోధం వినాలంటే దాని మీద విశ్వాసం ఉండాలి. ఇదే ఆత్మవిశ్వాసం.
ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు. ఆత్మవంచనకు పాల్పడతాడు. అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును -అర్ధకామాలను, పేరు ప్రఖ్యాతుల్ని , ఇతరుల సానుభూతిని- ఆశ్రయిస్తాడు. వాటిని అదే పనిగా అన్వేషిస్తూ వాటికోసం హత్యలు చేస్తాడు. లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు.
అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యజగత్తును ఆశ్రయించిన జీవుడు భంగపడి, జగత్తు కూడా నిమిత్తమాత్రమేనని గుర్తించి, తిరిగి అంతర్ముఖుడై అర్జునుడు కృష్ణుణ్ణి అశ్రయించినట్టు అంతరాత్మనుఆశ్రయిస్తాడు. ఆత్మవిశ్వాసాన్నిపెంచుకుంటాడు.
‘కర్త నేను కాదు ఈశ్వరుడు’ అని గుర్తిస్తే అహం పోతుంది. ‘జగత్తు నాది కాదు ఈశ్వరుడిది’ అని గుర్తిస్తే దాని మీద మమకారం, అధికారం ఉండవు. సహజంగా జీవించడం అప్పుడే మొదలవుతుంది. అప్పుడిక ఏ పని చేసినా అంతరాత్మ ప్రబోధం(ఆత్మజ్ఞానం) తో, ఆత్మవిశ్వాసంతో చేస్తాం. అహంకార, మమకారాలతో కాదు.
'నేను నిమిత్తమాత్రుణ్ణి' అని గుర్తిస్తే బాధ్యతలుంటాయి. బరువులుండవు.
అధ్యాత్మిక పురోగతి [అధ్యాత్మిక మధురాలు]
భాస్కర్ సోమంచి
"నీకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథ చెపుతాను.
ఒకసారి ఒక ఆసామికి తన స్థలంలో నీటికోసం బావి తవ్వవలసి వచ్చింది.
ఒక స్నేహితుడి సలహా మేరకు ఒక చోట పదిహేను అడుగులు తవ్వాడు. అయినా నీరు పడలేదు. నిరాశ చెందగా, ఇంకో స్నేహితుడు వచ్చి, ముందర చెప్పిన స్నేహితుడి సలహా వ్యర్థమని ఇంకొక చోటు చూపించి తవ్వమన్నాడు.
ఈసారి, ఆసామి ఇరవై అడుగులు తవ్వాడు. కానీ, నీరు పడలేదు. అప్పుడు, మూడో స్నేహితుడు వచ్చి, తనకి బాగా తెలుసనీ, మరొక చోటు చూపించి అక్కడ తవ్వ మన్నాడు. ఈ సారి ఆసామి ముప్పై అడుగులు తవ్వాడు. కానీ నీరు రాలేదు. అప్పుడు, నాల్గవ స్నేహితుడు వచ్చి ఎంతో అనునయంగా, నవ్వుతూ శాంతంగా --