MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | చిలుకూరి సత్యదేవ్
ప్రాచీన కావ్యాలు – వ్యాఖ్యానాలు – విశేషాలు.
జడా సుబ్బారావు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
తెలుగుసాహిత్యంలో వ్యాఖ్యాన సంప్రదాయానికి ఒక ప్రత్యేకత ఉంది. కేవలం కఠిన పదాలకు మాత్రమే అర్థాన్నివ్వడం కాకుండా వాటిలో ఉండే వ్యాకరణాంశాలు వివరించడం కూడా వ్యాఖ్యానంలో భాగంగానే ఉంది. కావ్యంలోని అందచందాలను, చమత్కారాలను తెలియజేస్తూ కవి హృదయాన్ని ఆవిష్కరించడంలో కావ్య వ్యాఖ్యానాలు ప్రముఖ పాత్ర వహించాయి. కవిని పునరుజ్జీవింపజేసి కావ్య పరమార్థాన్ని పాఠకులకు విశదపరచాలనే క్రమంలో వెలసిన ఈ వ్యాఖ్యానాలను సాహిత్యాభివృద్ధిలో కీలకపాత్ర వహించే
తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ – ఆవశ్యకత
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
ఆధునిక ప్రపంచంలో అనేక రంగాల్లో మార్పులు కలిగినట్లుగా పర్యావరణంలో కూడా అనేక పరిణామాలు సంభవించాయి. ఆధునిక యుగం యాంత్రిక యుగం కావడంతో పర్యావరణం కలుషితమైంది. సృష్టిలోని అనంత ప్రాణకోటిలో బుద్ధిజీవి మానవుడు. మితిమీరిన స్వార్థంతో మానవుడు ప్రకృతిని వికృతిగా జేస్తూ, సృష్టిలోని సమతుల్యతను వినాశనం చేస్తున్నాడు. ప్రకృతి శక్తులను, సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించుకుంటూ, వాటిని మార్పులు చేర్పులకు లోను చేస్తూ పర్యావరణ కాలుష్యానికి కారకుడవుతున్నాడు. నేటి సామాజిక సమస్యలలో ఇది ముఖ్యమైనది.
నన్నయ కవిత్వంలో సామాజిక సందేశం
హరిత భట్లపెనుమర్తి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాస పోటీ లో బహుమతి సాధించిన వ్యాసం
ప్రాచీన సాహిత్యం మాటెత్తడమే అభివృద్ధికి నిరోధకంగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వాడైన నన్నయ రచనలో సామాజిక సందేశం వెతకబూనటం సాహసాస్పదమే! అయితే రచన విలువ అదే కాలంలో పురుడు పోసుకుందన్నదాన్ని బట్టి కాక, అదేం ప్రబోధించిందన్న విషయాన్ని బట్టి ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుచేత, ప్రాచీనమయినదేదీ నేటికి పనికి రాదని, ఆధునికమంతా శిరోధార్యమనీ భావించటానికి లేదు.
సాహిత్య డిటెక్టివ్ కధ
మెడికో శ్యాం
నేను నా గురించి ఏం రాసినా, ఏం చెప్పినా ఇప్పటి నా గురించి కాకుండా ఎప్పుడో ఎక్కడో వుండిన నా గురించి చెప్పాలి, కధకుడిగా, కవిగా, రచయితగా… అప్పుడు నా పేరు 'మెడికో శ్యాం'. అలా అని నేను పెట్టుకోలేదు. స్టూడెంట్ ఆఫ్ ఈస్థెటిక్స్, ఓ మెడికో శ్యాం అని రాసాను. మరి ఆ పత్రికవాళ్ళు 'మెడికో శ్యాం' గా వేసారు. ఎందుకంటే అది ' మెడికొ ప్రేమగీతం '. ఇంకా నేను సి.శ్యాం, షై, బద్రీనాథ్ అనే పేర్లతోనూ రాసాను.