top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-8]

గిరిజా శంకర్ చింతపల్లి

జాన్ ఒక లాయర్.  న్యూయార్క్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

 

అపార్ట్మెంట్ లో ఉండలేక, సెంట్రల్ పార్క్ లో ఒక బెంచ్ మీద పడుకున్నాడు. "ఏమి చేస్తున్నావిక్కడ"?  అన్న ప్రశ్న వినగానే, తలెత్తి చూశాడు.  ఎదురుగా పోలీస్ మన్.

 

“నిద్రపోతున్నాను, ఆఫీసర్!" అని జాన్ సమాధానం ఇచ్చాడు. 


"ఇల్లూ వాకిలీ లేదూ? ఇక్కడ పడుకోకూడదు" 


"నేను ఇక్కడే మెయిన్ స్ట్రీట్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాను. నీళ్ళెక్కువ వాడుతున్నానని మా అపార్ట్మెంట్ మానేజర్ నన్ను వెళ్ళగొట్టాడు. వేరే ఇల్లు తీసుకోవాలి. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను" అని జాన్ ప్రాధేయపూర్వకంగా చూశాడు కాప్ వైపు.


తన ధర్మం నెరవేర్చానన్న తృప్తితో ఆ పోలీస్ వాడు పక్క పొద పరిశీలనకి వెళ్ళిపోయాడు. 

విశ్వనాథుని త్రిశూలం

డా. తత్త్వాది ప్రమోద కుమార్

శివుని త్రిశూలం లో మూడు మొనలు ఉన్నట్లే ఈ నాటకంలో మూడు ప్రధాన పాత్రలు.

 

వారు బసవేశ్వరుడు, బిజ్జల దేవుడు, జగదేవుడు. త్రిశూలం లోని మూడు మొనలు సత్త్వ, రజస్తమో గుణాలకు సంకేతాలు.

 

ఈ త్రిగుణాలకు నాటకంలోని బసవేశ్వరుడు, బిజ్జలుడు, జగదేవుడు ప్రతినిధులని పరిశోధకులు భావించారు*3*. బసవేశ్వరుడు సత్త్వ గుణానికి, బిజ్జలుడు రజోగుణానికి, జగదేవుడు తమోగుణానికి ప్రతినిధులని పరిశోధకులు తెలిపారు. తన ఇంట్లో విందు భోజనం చేయాలని జగదేవుడు బసవేశ్వరున్ని ఆహ్వానిస్తాడు. బసవడు షరతులు విధిస్తాడు. సమయం వచ్చినప్పుడు రాజు, కొడుకు, గురువు తో పాటు ఎవరినైనా  సంహరించాలనేది షరతు. ఈ షరతును జగదేవుడు  అనాలోచితంగా ఒప్పుకొని, రాజు బిజ్జలున్ని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. స్వల్ప ప్రయోజనాల కోసం రాజద్రోహానికి సిద్ధమైన జగదేవుడు తమోగుణ యుతుడు. రాజు బిజ్జలునికి రాజ్య విస్తరణా కాంక్ష విపరీతం. మతాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని రాజు ఆలోచన. కావున రాజు రజోగుణ రతుడు.

 

బసవేశ్వరుడు సత్త్వ గుణానికి ప్రతినిధిగా భావించుట పాక్షిక సత్యమే. బసవడు మంత్రి పదవిని పొంది మత వ్యాప్తికి సిద్ధమవుతాడు.

తెలుగు పరిశోధనలో నాటక ప్రక్రియలు

ఎస్. ఎమ్. ఎస్. రావు దాసరి 

భారతీయ సాహిత్యాధ్యయన సంప్రదాయంలో రూపక ప్రక్రియ ఒక విలక్షణాంశంగా ఉంటూ వచ్చినా తెలుగులో ఆదికావ్యం పుట్టక ముందే యావద్భారతంలో రూపక కళా విన్యాసం మహోన్నత శిఖరాల నందుకున్నా తెలుగులో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధం వరకూ రూపకాలు లేకపోవడం అతి విచిత్రమైన విషయం.

 

అయితే మార్గ పద్ధతిలో గాక దేశి పద్ధతిలో జానపదులూ పల్లీయులూ సృజించుకుని పెంపొందించుకున్న యక్షగానాది రూపక ప్రక్రియలు లేకపోలేదు. కానీ, దేశిరూపక ప్రక్రియలను గూర్చిన ప్రస్తావన ఈ సందర్భంలో అప్రస్తుతం.

 

నన్నయ తిక్కనాది ప్రాచీనాంధ్ర కవులకు సంస్కృత రూపకాలలో పరిచయమున్న మాట వాస్తవమే. కాని, సంస్కృతంలోని అన్ని ప్రక్రియలను తెనిగించిన నాటి కవులు రూపకాలను మాత్రం వదిలి పెట్టినారు. సంస్కృత నాటకాలలో వలె తెలుగులో పాత్రానుగుణ భాషాప్రయోగం సాధ్యం కాకపోవడం వల్లనైతేనేమి, వర్ణనా ప్రియులైన ప్రబంధకవుల ఉపేక్షవల్లనైతేనేమి, కవిపండిత పోషకులైన ప్రభువుల అనాసక్తి వల్లనైతేనేమి, నాటక లక్షణాలను తెల్పే గ్రంథాలు తెలుగులో లేనందువల్లనైతేనేమి, నాటక ప్రదర్శనకు కావలసిన రంగ పరికరాదులు లేనందువల్లనై తేనేమి, నటులకు సంఘంలో గౌరవాదరాలు లేనందువల్లనైతేమి తెలుగులో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధం వరకూ రూపకాలు వెలువడలేదు.

bottom of page