MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-10]
గిరిజా శంకర్ చింతపల్లి
ఇద్దరూ నల్లవారు [ఇప్పటి పరిభాషలో Afro- Americans] అన్నమాట.
వయసు ముందే చెప్పాను. వాళ్ళిద్దరూ 55 యేళ్ళుగా భార్యాభర్తలు. ఇద్దరూ రిటైరు అయ్యి, ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళయి వారి మానాన వాళ్ళు బతుకుతున్నారు. పిల్లలు ఆహ్వానించినా, పరాయి- ఒకరిమీద ఆధారపడకుండా, ఉన్న దాంతోనే గుంభనంగా జీవిస్తున్నారు. అనుకూల దాంపత్యం, అతను ఆర్మీలో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ విడిపోలేదు. డ్రగ్స్ ,ఆల్కహాల్ బాధలు లేవు.
గాల్వస్టన్ పక్కన ఆల్లెన్ అనే చిన్న వూళ్ళో ప్రశాంతంగానే ఉంటున్నారు. రెండు మూడు నెలలనించీ, అతనికి ఆమె దినచర్యలో మార్పు కనిపించింది. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అందరూ లాండ్రీ రూం కి వెళ్ళి లాండ్రీ చేసుకోవాలి. ఒక్కొక్క అపార్ట్మెంట్ కీ వేరే individual యూనిట్స్ లేవు. సంవత్సరాలుగా అతని భార్యే అతని బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడమూను. ఈ మధ్య తను గమనించాడు, చాలాసేపు అక్కడే లాండ్రీ రూం లో గడుపుతున్నదని.
కవిత్వంలో తాత్వికత
విన్నకోట రవిశంకర్
కవిత్వంలో తాత్వికత అనే విషయం గురించి చర్చించటానికి ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి.
కవి అనేవాడు తాత్వికుడు కావలసిన అవసరం లేదు. కవికి చెమర్చే కన్ను, చలించే హృదయం ముఖ్యం. “నానృషిః కురుతే కావ్యం” అన్నారు గానీ అక్కడ కవిని ఒక ద్రష్టగా - అంటే ఒక అనుభవంలో గాని , ఒక సంఘటనలో గాని, ఒక ప్రకృతి దృశ్యంలో గాని ఇతరులు చూడలేని దాన్ని చూసి, ఆవిష్కరించగలిగేవాడిగా భావించి చెప్పినది.
తాత్వికత అంటే ఒక స్థిరమైన తాత్విక సిద్ధాంతం గురించి రాసినది కూడా కాదు. గాంధీయిజం, మార్క్సిజం, మావోయిజం, అంబేద్కరిజం వంటి రకరకాల సిద్ధాంతాల ప్రభావంతో రాసిన కవిత్వం చాలా ఉండవచ్చు. ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది దానిని గురించి కాదు. ఇది ఒక అన్వేషణకి, లోచూపుకి సంబంధించినది. నిత్య జీవితంలో మనకెదురయ్యే సమస్యలు, సవాళ్లు వంటి వాటి గురించి కాకుండా, ఈ సృష్టి గురించి, విశాల విశ్వంలో మానవుడి పాత్ర గురించి మనిషి అంతః ప్రపంచంలో జరిగే మథనం గురించి ఒక తపనతో, వేదనతో రాసే కవిత్వం ఇక్కడి అంశం.