MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-7]
గిరిజా శంకర్ చింతపల్లి
మరి మనం చిన్నప్పుడు చదువుకున్న Around the world in 80 days నాయకుడు, Phyllias Fogg గూడా ఇల్లాంటి కల్పనేగదా అని మీరడగవచ్చు. Fogg విషయం లో అతను, అతని పరివర్తనవల్లా, అలవాట్లు అతనికి హాని కలుగ చేయలేదు. అదీ psychiatry లో అసలు కిటుకు. ఎవరైనా సరే, వాళ్ళ, అలవాట్లవల్లగానీ, ఆలోచనలవల్లగానీ, ప్రవర్తనవల్లగానీ తనకూ, ఇతరులకూ హాని చేయనంతవరకూ వాళ్ళు జబ్బుతో బాధపడుతున్నట్లు కాదు. ఉదాహరణకి, మనం అన్నం తినేముందు చేతులు [ఇండియలోనైతే కాళ్ళుగూడా ] కడుక్కుంటాముగదా,
ఆ కడుక్కోవడం సాయంత్రం దాకా కడుక్కుంటే, అంటే లంచ్ కి వచ్చినవాడు డిన్నర్ దాకా అదే పనిలో వుంటే వాడికి వైద్యం అవసరం.
సైకియాట్రీ లో కీలక ఆదర్శం "అతి సర్వత్ర వర్జయేత్"
కాలానికి నిలిచిన కవిత్వం
విన్నకోట రవిశంకర్
కాలానికి నిలిచిన కవిత్వం అనేది తిలక్ కవిత్వానికి సరైన నిర్వచనం అని నేను అనుకుంటాను.
ఒక కవి కవిత్వాన్ని అతని తరం వాళ్ళే కాకుండా ఆ తరువాతి తరం వాళ్ళు ఇష్టంగా చదువు కోవటం గొప్ప గౌరవం. ఆ విధంగా కాలమే గీటురాయిగా పనిచేస్తుంది. మా తరమే కాదు ఇప్పటి యువతీ యువకులు కూడా తిలక్ కవిత్వాన్ని ఆస్వాదించటం చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఒక కవి కవిత్వం, జీవితం సార్థకమని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అయితే అటువంటి కాల ప్రమాణాన్ని అంగీకరించని వారు కూడా ఉండవచ్చు. ఉదాహరణకి కొడవటిగంటి కుటుంబరావు గారు "నా రచనలు కలకాలం నిలిచిపోవాలనే ఆశ నాకు ఏ కోశానా లేదు" అని అంటారు. కానీ కుటుంబరావు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఎంతోమంది ఉంటారు. తక్షణ సమస్యల గురించో, తాత్కాలికమైన పరిస్థితుల గురించో చెప్పిన ఒక గొప్ప కవి లేదా రచయిత రచనల్లో ఒక సార్వకాలీనత చోటు చేసుకుంటుంది. అది కొన్నిసార్లు ఆ రచయిత కూడా గుర్తించలేకపోవచ్చు. ఒకసారి ప్రచురణ జరిగాక ఆ రచన తన బ్రతుకు తను బతుకుతుందని అనేది ఇందుకే.
దేవుడికి ఉత్తరం - చిన్న కథలు - సహజ వాస్తవాలు
రాజేశ్వరీ దివాకర్ల
రెండో కథ మరీ విపరీతం.
సరస్వతమ్మ ను గురించిన కథ. హఠాత్తుగా ఆవిడకు సుశి మీద అభిప్రాయం మారింది. ముందు ఆమె సుశి కి గర్వం అనుకుంది. తన పిల్లలతో కలివిడి గా ఉంటే ఆత్మీయతను చూపింది. కాని సుశి తన భర్త తో చనువు గా మాట్లాడితే మాత్రం నచ్చ దు. సరస్వతికి ఆయనని లొంగదీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. "మీ తో జోక్యం పెట్టుకోనంత వరకే ఎంత మర్యాదైనా చేసేది" అంటూ మనసులోని మాటను చెప్పేస్తుంది.
ఈ కథ ఆడవారి మనసు లోతుల్ని తెలుపుతుంది. సాధారణమైన గృహిణి సరస్వతి. తన భర్త తనకే స్వంతం అనుకున్న సంకుచితత్వం లోనే బోళా తనాన్ని కలగలిపి ఆమె స్వభావాన్ని నిరూపించారు రచయిత్రి. నిముషానికో అభిప్రాయం మార్చుకుంటున్న భార్య మీద భర్త చిరాకుపడడం వారి సంసారం లోని సరిగమల గమకాలను నొక్కుతుంది.
రావిశాస్త్రి ఆరుసారాకథలు – భాష – సామాజికత
వేదాంతం బాలమురళీకృష్ణమాచార్యులు
‘మాయ’ అనే కథలో – ముత్యాలమ్మ సారా కేసులో నిందితురాలిగా న్యాయస్థానం ముందు నిలబడుతుంది.
న్యాయస్థానంలో ఆమె ప్రసంగంద్వారా సాక్షుల్ని పోలీసులు, డబ్బున్నవాళ్ళు ఎంతగా ప్రభావితం చేస్తున్నారో, డబ్బు అధికారం వంటి ప్రభావాలతో వారు ఏవిధంగా చెలామణి అవుతున్నారో యదార్థదృశ్యంగా చిత్రించినట్లు పాఠకులకి సుస్పష్టంగా అర్థమవుతుంది. న్యాయం కథలోనూ ఒక అమ్మాయి ఆక్రందన ద్వారా న్యాయాన్ని డబ్బు ప్రభావితం చేయగలదన్న వాస్తవాన్ని తెలియజెప్పారు.
ఈ కథల ద్వారా – డబ్బు, అధికారం వంటివి న్యాయస్థానాల్లో న్యాయాన్ని ప్రభావితం చేయకుండా ఉండే మెరుగైన సమాజం ఏర్పడాలని రచయిత ఆకాంక్షించారు.