MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-1]
గిరిజా శంకర్ చింతపల్లి
దయ్యాలున్నాయా?
అకస్మాత్తుగా క్లాస్ అంతా నిశ్శబ్దంగా, నిర్ఘాంతపడి కళ్ళప్పగించి చూస్తున్నారు ప్రొఫెసర్ రాబర్ట్స్ ని.
ఆయన పాఠం చెబుతూ, ఒక్కసారి వాక్యం మధ్యలో ఆపేసి, ఒక వియత్నామీస్ స్టూడెంట్ వేపు అదేపనిగా చూస్తూ, పోడియం దిగి నడిచి వచ్చాడు. తిన్నగా ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఛెళ్ళు మని చంప మీద కొట్టాడు. క్లాస్ లో ఉన్న 40 మంది స్టూడెంట్ లు నిర్ఘాంతపోయారు ఈ హఠాత్పరిణామానికి.
రెండు నిమిషాలలాగే సూటిగా ఆ స్టూడెంట్ వేపే చూసి, తలదించుకొని క్లాస్ వదిలి వెళ్ళిపోయాడు, రాబర్ట్స్. క్లాసంతా పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఈ సీను చూసి, మాటలు రాక చేష్టలుడిగి అలాగే స్తబ్ధులై కళ్ళప్పగించారు. ఆ సాయంత్రానికి యూనివర్సిటీ అంతా తెలిసింది వార్త, ప్రొఫెసర్ రాబర్ట్స్ రాజీనామా చేశాడని.
ప్రాచీన భారతీయ వాఙ్మయానికి చారిత్రక స్పృహ తక్కువా?
కర్లపాలెం హనుమంతరావు
మన ప్రాచీన భారతీయ వాఙ్మయానికి చారిత్రక స్పృహ తక్కువని పాశ్చాత్య విమర్శకుల పంథాలోనే ఆధునిక సాహిత్య పరిశోధకులూ విమర్శిస్తున్నారు. ఆ అభియోగంలో నిజమెంత?
గ్రీకులు తమ కావ్యాల(ఎపిక్స్)లో సాహిత్యంతో సరిసమానంగా చరిత్రకూ ప్రాధాన్యత కల్పించారు. చరిత్ర అంటే పాశ్చాత్యుల దృష్టిలో రాజులు, రాణులు, వారి వంశ చరిత్రలు, వ్యక్తిగత వివరాలు, రాజ్యాల కోసం చేసిన యుద్ధాలు, వాటి జయాపజయాలు, సమకాలీన రాజకీయ, సామాజికాది పరిస్థితులు ఉన్నవి ఉన్నట్లుగా తారీఖులు, దస్తావేజులతో సహా ఉట్టంకించడం! ఆ కోణంలో చూస్తే నేటి విమర్శకుల నిందలో కొంత నిజం లేకపోలేదు.
మన ప్రాచీనుల చారిత్రక దృష్టి పాశ్చాత్యుల దృక్కోణంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. మన వాఙ్మయకారులకు సృజన ప్రదాన లక్ష్యం ధర్మం, సత్యం, నీతి, శీలం వంటి ఉదాత్త మానవీయ విలువలను ప్రతిబింబించడం! ప్రాచీన వివేచనపరులు కావ్యనిర్మాణ సమయంలో అందుకే కావాలనే అపభ్రంశ చారిత్రకాంశాలను పక్కనపెట్టేవారు. కుళ్లు, కుతంత్రాలు, కుత్సితం, దిగజారుడుతనం వంటి ప్రతికూల అంశాలకు అధిక స్పందన లభిస్తుంది ఏ కాలంలో అయినా సమాజంలో. సమాజం మీద దుష్ప్రభావం చూపించే చరిత్రను యథాతథంగా చిత్రీకరించేటందుకు మనకు భారతీయ విశిష్ట విలువల ప్రాధాన్యత ప్రధానమైన అడ్డంకిగా ఉండేది గతంలో.
ఆధ్యాత్మికతలో ‘భక్తి’ వైశిష్ఠ్యం
డా. వేదాంతం కృష్ణమాచార్యులు
మానవుడు ధర్మార్థకామమోక్షములనే చతుర్విధ పురుషార్థాలను లక్ష్యంగా చేసుకొని జీవనయాత్రను కొనసాగించడమనేది ఋషి పరంపరాగతముగా వస్తున్న సనాతన ధార్మిక అంశము. భారతీయ సాంప్రదాయంలో ‘ధర్మం’ అను పురుషార్థానికి అధిక ప్రాధాన్యమిస్తూ, అర్థకామాలను కూడా ధర్మసమ్మితాలుగా ఆచరించాలని, అనుసరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
నాలుగవ పురుషార్థమైన ‘మోక్షాన్ని’ సాధిస్తే మనిషికి జన్మసార్థకత లభించి ‘మోక్షప్రాప్తి’ అనునది ఫలంగా కలుగుతుందని మహర్షుల ప్రబోధము.
అయితే మోక్షమను పురుషార్థాన్ని సాధించాలంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ‘ఆత్మజ్ఞానం’ పొందాలి. ఆత్మజ్ఞానమన్నా, ఆధ్యాత్మిక జ్ఞానమన్నా, బ్రహ్మజ్ఞానమన్నా ఒక్కటే. ఆత్మకొరకు చేసే, ఆత్మతత్వం కొరకు చేసే విచారము ‘అధ్యాత్మము’ అని చెప్పబడుతుంది. అంటే ఆత్మయొక్క అమృత తత్వమును, ఆనంద స్వరూపమును తెలుసుకొనుటయే ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ జ్ఞానాన్ని పొందడానికి తోడ్పడే ఆధ్యాత్మిక మార్గాలు నాలుగు రకములుగా ఉన్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించారు
కరోనా కట్టడిలో కాడెద్దులు
డాక్టర్ చాగంటి కృష్ణకుమారి
నేనో తొంభై ఏళ్ళ తొక్కుని. నాకే తొంభై ఏళ్ళుంటే ఇంకా నా మొగుడు బతికుంటాడా? ఎప్పుడో వెళ్లిపోయాడు పైలోకాలకి.
నాకున్నారు ఇద్దరు కొడుకులు. వాళ్ళికా నా దగ్గరుంటారా? ఎప్పుడో వెళ్ళిపోయారు పరాయి దేశాలకి.
నేనొంటరిని. రెండు కాడెద్దులతో బతుకుబండి నడిపిస్తున్నా. ఓ ఎద్దు నాకు పాచిపనులు చేసిపెట్టే ముసలిది. రెండోది నాకు వండిపెట్టే పడుచుది.
రెండెడ్లకి మేలైన దానా దండిగా పెడుతున్నానంటే అది స్వార్ధమే! ప్రేమగా చూసుకుంటున్నానంటే - అదీ స్వార్ధమే!
ఈ గడ్డు కాలపు కరోనా భీతిలో నాకున్న ఆధారాలు ఆ రెండే! అందువల్ల వాటిపట్ల నా ప్రేమ పదింతలైంది.
నా ముసలిదాని కొడుక్కి కరోనా కట్టడిలో కొలువు వూడిందట. పడుచుదాని మొగుడికి కూలీ నాలీ బందయ్యిందట.