top of page

సంపుటి 2  సంచిక 2

వ్యాస​ మధురాలు

నిర్వహణ:  శాయి రాచకొండ | చిలుకూరి సత్యదేవ్

vyasam@madhuravani.com 

మేదిని చేరెను మేని పసలు…

డాక్టర్ పీ.వీ. రమణ

dwana

1954-55 లో నేను ఆరో ఫారం పాసై, అంటే SSC అన్న మాట, ఇంటర్మీడియేటు లో రామకృష్ణ మిషను వారి వివేకానంద కాలేజీ లో చేరాను. SSC బోర్డు పరీక్షలలో నాకు 70% వచ్చినట్లు జ్ఞాపకం. ఒక  పుస్తకమే చేసి ఇచ్చేవారు. అందులో తక్కిన ఐదు ఫారాల మార్కులూ స్కూలు వాళ్ళు రికార్డు చేస్తే, ఆరో ఫారం మాత్రం బోర్డు వాళ్ళు 'ఇండియన్ ఇంకు' లో రాసి ఇచ్చేవాళ్ళు. వయసు, పుట్టిన తేది అన్నీ ఉండేవి. ప్రభుత్వం వారి డాక్యుమెంటు కాబట్టి సర్వత్రా అది చలామణీ అయ్యేది. జీవితాంతం శిధిలపడకుండా దాచుకునేందుకు వీలుగా ఖాకీ గుడ్డ అంటించిన దళసరి కాగితం బైండింగు, లోపల ఆకుపచ్చ దస్తావేజు కాగితాలతో చేసిన పేజీలూ, ఓహ్ అది తెచ్చుకున్న రోజు నాకేదో పెన్నిధి దొరికినట్లూ, నాకే ఒక అస్తిత్వం ఏర్పడినట్లూ, ఒక అనూహ్యమైన అతి సంతోషజనకమైన భావన! ఒక యువకుని జీవితంలో ఒక మనిషిగా గుర్తింపు! నా డిగ్రీ పట్టా కూడా అంత  పకడ్బందీగ లేదు!

తెలుగు సాహిత్యం - మనోవైజ్ఞానిక విమర్శ

డా. ఒభిన్ని శ్రీహరి

dwana

సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది. “హితేన సహితం సాహిత్యం” అన్నారు మన లాక్షణికులు.  సమాజ హితాన్ని కోరుకొనే సాహిత్యం మనిషి వక్తిత్వాన్ని ఆమూలాగ్రం పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. మనిషి మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకొని, పాత్రలను సజీవంగా తీర్చిదిద్దడంలో తెలుగు రచయితలు ఏ భాషా సాహిత్యంలోని రచయితలతోనూ తీసిపోరు. తెలుగు రచయితల్లో కొంతమంది ఫ్రాయిడ్ వంటి మనోవిశ్లేషణా సిద్ధాంతాలను చదవనప్పటికీ , మనిషి మనస్తత్వాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సమయంలో తెలుగు సాహిత్యంలో కవులందరూ వారి రచనల్లో అవసరాన్ని బట్టి పాత్రల  అంతరంగ పొరల్లోకి వెళ్ళి పరిశీలించారు. ఈ రకమైన అధ్యయనాన్ని మనోవైజ్ఞానిక విమర్శ అంటారు. మనోవైజ్ఞానిక శాస్త్రం మనిషి ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

బుజ్జిదూడ- వాళ్ళమ్మ

డా. వై. కామేశ్వరి

dwana

వ్యాస​ మధురాలు

నా చిన్నతనంలో ఒక సంక్రాంతికి కాబోలు మా తాతగారి ఇంటికి వెళ్లాం. ఊహ తెలిశాక మొదటిసారి పల్లెటూరు చూడటం. అన్నీ వింతలే! కోడిపందేలు చూశాం!  సంక్రాంతి ముగ్గులు చూశాం. గొబ్బిళ్ళ పేరంటాలు చూశాం!  చెట్లెక్కాం.  గోడలు దూకాం!

 అన్నింటికంటే విచిత్రం మా తాతగారి దొడ్లో గేదె తెల్లవారే సరికి చిన్నదూడని ఈనింది. మా పిల్లల ఆనందానికి హద్దేలేదు. దానిచుట్టూ తిరిగిన వాళ్ళం తిరిగినట్లున్నాం. దాని కళ్లు, కాళ్ళు, తోక అన్నీ ఆకర్షణే మాకు. ముందుకాళ్ళలో వెనకకాళ్లు దూరిపోయి, పడిలేచి, పడిలేచి చివరికి కాళ్ళను విడదీసుకొని అది లేచి నుంచునే సరికి సంతోషం పట్టలేకపోయాం. పెద్దవాళ్లు కోప్పడే వరకూ పశువుల పాకను వదల లేకపోయాం.

 అరిసెలు,  గోర్మీటీలు, జంతికలు ఇవన్నీ పొట్టు పొయ్యి దగ్గర కూచుని మా అమ్మమ్మ, అమ్మ చేస్తూ ఉంటే  వాళ్ళచుట్టూ తిరిగి  

bottom of page