MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-3]
గిరిజా శంకర్ చింతపల్లి
రాత్రి 8 గంటలయింది. అది మిచిగన్ లో ఏప్రిల్ నెల. తొందరగా చీకటి పడుతుంది 5 గంటలకల్లా.
నేను నైట్ కాల్ చేస్తున్నాను ఎలోయీస్ సైకియాట్రిక్ హాస్పిటల్లో. నేను ట్రెయినింగ్ మొదలెట్టి వారం. మొట్టమొదటిసారిగా నైట్ కాల్. నేనూ, ఒక నర్స్, ఒక అటెండెంట్. నేను కొత్తగా వచ్చానని వాళ్ళిద్దరూ ఆ హాస్పిటల్ చరిత్ర చెబుతున్నారు. ఆ హాస్పిటల్ పక్కనే ఒక శ్మశానం ఉన్నది. పాతరోజుల్లో ఆ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళని అక్కడే పాతి పెట్టేవారట. వాళ్ళల్లో కొంతమంది దయ్యాలుగా అక్కడి పేషంట్లకే కాకుండా అక్కడి స్టాఫ్ కి గూడా కనిపిస్తారని వాళ్ళు చెప్పారు. హాస్పటల్ వూరికి దూరంగా [శ్మశానికి దగ్గరగా] ఉన్నది. ఇలా మాటలాడుకుంటుండగా, క్లర్క్ వచ్చి ఒక పేషంట్ వచ్చాడని చెప్పాడు. నర్స్ వెళ్ళి వైటల్ సైన్స్ అవ్వీ తీసుకుని నా ఆఫీస్ కి పంపించింది.
మంచి సూట్ వేసుకుని, క్లీన్ గా షేవ్ చెసుకుని చేతిలో బ్రీఫ్ కేస్ తో బిజినెస్ మాన్ లాగా ఉన్నాడు. వయసు 30 అని అతని చార్ట్ చెబుతోంది. అడిగాను, ఏంకావాలి? ఏవిధంగా సహాయం చెయ్యగలను?"
"నన్ను హాస్పిటల్లో ఎడ్మిట్ చేసుకోవాలి" అన్నాడు. అతని పేరు జాన్ మార్టిన్.
అక్టోబర్ 10, 11 , 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో కొన్ని ఎంపిక చేసిన ప్రసంగాల సమాహారం.
అవధాన కళ
అయ్యకోనేరు అంతరంగం
ఉత్పాదక భాషగా తెలుగు
కవిత్వంలో ఆధునికత
కవిత్వం - వ్యక్తిత్వం
కవిత్వం - వైయక్తికత, సామాజికత
సాహిత్యంలో హాస్యపరిణామం
తెలుగు సాహిత్యంలో స్త్రీపాత్ర స్వాభావిక మరియు సామాజిక పరిణామక్రమం.
బ్రిటన్ లో నవలా రచన - కథాకమామీషు
ఒక వారసత్వం - మెడికో శ్యామ్ - అంతర్మథనం
ద్వారం దుర్గాప్రసాదరావు
మెడికో శ్యామ్ నాన్నగారు కీర్తిశేషులు శ్రీ చిర్రావూరి సర్వేశ్వర శర్మగారు.
సి.ఎస్, సీరియస్, ఢిల్లీ శర్మలాంటి ఎన్నో కలం పేర్లు. మా ఎరికలో అంత చదువరీ, అటువంటి చదువరీ ఇంకోరు లేరు మా ప్రాంతాలలో. అన్ని పుస్తకాలు కొన్న వారూ, చదువుకున్న వారూ ఈ చుట్టుపట్ల లేరు. మల్లాది వారి గురించి విన్నాం. ఆరుద్ర పుస్తక భాండారం భాగ్యనగరంలో వాన వరదల్లో, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తడిసిపోవడం కన్నాం. శ్రీశ్రీ గారు మంచం కిందా, పరుపు కిందా ఎవరైనా వస్తే గబుక్కని దాచేసే అపురూప గ్రంథాల జాగ్రత్త గురించి విన్నాం. వేలూరి శివరామ శాస్త్రిగారి కావ్యాలూ జడివానల్లో చివికి పోవడం, వారి అపురూప గ్రంథాలయాన్ని అగ్నిదేవుడు ఆరగించడం - ఆ రోజుల్లోనే శ్రీ సి.ఎస్. శర్మగారు న్యూఢిల్లీ నుంచి విజయనగరం తరలి వస్తుంటే వందలాది పుస్తకాలూ, పత్రికలలో పడిన తన కథలు, కవితలు, వ్రాత ప్రతులు ఉన్న ట్రంకు పెట్టెలు దారిలో మాయమైపోవడం ఆయనకు తీరని దు:ఖం, మనకి తీరని నష్టం కలిగించేయి ఈ కథనాలన్నీ. ఐనా చివరిదాకా అసంఖ్యాకంగా కొంటూ చదువుకుంటూనే గడిపేరు శర్మగారు.
ఇంట్లో ఉన్న ఆ పుస్తకాలన్నీ శ్యామ్ చదివేడనీ, ముఖ్యమైనవన్నీ జీర్ణించుకున్నాడనీ నా నమ్మకం.
చాటువు
డాక్టర్ వై. కృష్ణ కుమారి
తెలుగు సాహిత్యంలోని ప్రత్యేకత విభిన్నమైన ప్రక్రియలే.
అందులో మెరుపుల్లాగా మెరిసే చాటువులొక ప్రత్యేక స్థానాన్ని కల్గి ఉన్నాయి. చాటువు అనే పదం చటస్స అనే శబ్దం నుంచి వచ్చింది. మనసుని మురిపించే వాక్యమని ఒక అర్థం కాగా ముఖస్తుతి, మిథ్యాప్రియ వాక్యం అని నైఘంటికార్థం గా కనిపిస్తున్నది. చక్కటి చమత్కృతి తో, వినగానే ఉల్లాసం కల్గించే ఈ చాటువులు మౌఖిక ప్రచా రం ద్వారానే జనులలో నేటికీ మిగిలిఉన్నాయి.
చరిత్ర కందినంత వరకు నన్నయ మహా భారతంలో మొదటిసారిగా గ్రంధస్థమైన కొన్ని చాటువులను అప్పటికే బాగా ప్రాచుర్యం పొందినవిగా గుర్తించవచ్చు.