top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంక్రాంతి శుభాకాంక్షలు

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి

మా వాణి ...

మీ "మధురవాణి" త్రై-మాస పత్రిక ప్రథమ వార్షికోత్సవ సంచికను మీ ముంగిట నిలుపుతున్నందుకు ఆనందంతో నిండిన గర్వం ఉప్పొంగుతోంది! గత ఏడాది ఇదే తేదీన (జనవరి 23, 2016) ప్రప్రథమంగా ఈ పత్రికను విడుదల చెయ్యడం నిన్నో మొన్నో జరిగినట్టనిపిస్తున్నది. ఈ సంవత్సర కాలంలో పాఠకులందరి నుండీ అద్భుతమైన స్పందన, ప్రోత్సాహం వచ్చినాయి - అందుకు మీకందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు! అదే స్ఫూర్తి రాబోయే కాలంలో కూడా అవిచ్ఛిన్నంగా సాగుతుందని ఆశిస్తున్నాము! 

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ పండుగ సందర్భంగా అమెరికాలో స్థిరపడ్డ మా బోటి వారి సంక్రాంతి మనోభావాలకు ఈ "నాస్టాల్జియా" పద్యం అద్దం పడుతుంది.

సీ. గొబ్బెమ్మలను సేయ గోమయార్థంబేగు

         మంచు కోరంగ నా యనుగు చెల్లి  

మధురవాణి నిర్వాహక బృందం

నా డైరీల్లో కొన్ని పేజీలు...   ~గొల్లపూడి మారుతీ రావు

V N Aditya

ఫిబ్రవరి - ఏప్రిల్ 1971

గొల్లపూడి

ఆదిత్య సినీ మధురాల లో...

V N Aditya

నా డైరీల్లో కొన్ని పేజీలు.

కవిత్వంలో వంటకాలు

ద్వానా శాస్త్రి

dwana

ఇది నవంబరు 2016 లో సింగపూర్ లో జరిగిన అయిదవ ప్రప్రంచ సాహితి సదస్సులో శాస్త్రి గారు చదివిన వ్యాసం. 

“కవి, ద్రష్ట (seer), స్రష్ట (creator)”

“రవి గాంచనిచో కవి గాంచును”

“కవి కన్ను ప్రిజం లాంటిది. వేర్వేరు కోణాల్ని ప్రదర్శిస్తుంది”

ఇటువంటి ఉక్తులనీ కవి ప్రతిభావంతుడని, ఒకజ్ఞుడనీ నవనవోన్మేషమైన భావనా శక్తి గలవాడనీ వెల్లడిస్తాయి.  వంటకాలు లేదా ఆహార పదార్థాలను కవులు వర్ణించడం గమనిస్తే పైన చెప్పిన ఉక్తులు నిజమనిపిస్తాయి.  కవికి గల బహుముఖ పరిజ్ఞానంతో పాటు, కవుల అభిరుచులూవంటకాల ప్రాశస్త్యమూ తెలుస్తుంది.  ఒకనాటి వంటకాలూ, వాటి పేర్లు పరిశీలిస్తే భాష వైశిష్ట్యమూ అవగతమవుతుంది. 

పప్పన్నం భోజనంలో అతి ముఖ్యమైనది.  కందిపప్పు మరీముఖ్యమైనది.  కందిపప్పు పచ్చడి అంటే లొట్టలు వేసుకుంటూ తినవలసింది.  మరి ఈ పచ్చడి ఎలా తయారుచేయాలి?  ఏమేమి దినుసులు వెయ్యాలి? సరిగ్గా చేస్తే దాని మజాయే వేరు – అంటూ నాదెళ్ళ నృసింహ కవి ఒక ‘సీసా’లో మనకి అందించాడు. 

మా క్వీన్ విక్టోరియా గారి గృహ పరిపాలనలో ఆవిడ ఇచ్చే కొన్ని కొన్ని ఆదేశాలు నాకు అక్షరాలా శిరోధార్యాలే. ఉదాహరణకి నా శిరస్సు మీద రోజుకి ఒక మిల్లిమీటర్ చొప్పున పెరిగే జులపాల మీదే ఎప్పుడూ ఆవిడ దృష్టి సారించి నెలకొక సారి “బైరాగి వెధవ లాగా చెవుల కిందకి జుట్టు పెరిగిపోయింది. వెళ్లి క్షవరం చేయించుకుని రా” అని పదేళ్ళ కిందటి దాకానూ, “సగం పైగా తెల్ల వెంట్రుకలే,  సిగ్గేస్తోంది. వెళ్లి రంగు కూడా వేయించుకు రా” అని ఈ రోజుల్లోనూ అంటూ నెలకో సారి పది డాలర్లు చేతిలో...

వంగూరి పి.పా.

మూడో జులపాల కథ

ఒకానొక  ప్రభాత వేళ,  ధనుర్మాసానికి దరహాసాలద్దేందుకు మా కాంక్రీటు ముంగిట్లో ముగ్గు వేయాలనిపించింది. వారాంతంలో అయినా ఉదయాన్నే లేచే అలవాటేమో,  అయిదవగానే మరి నిద్రపట్టక ఓ ముత్యమంత చిన్న ముగ్గయినా వేసేద్దామని తలుపు తీసాను.

ఆహ్లాదకరమైన ఉదయాన్ని ఆస్వాదిస్తున్న ముంగిలి మామూలు కంటే ముచ్చటగా తోచింది

అనుకుంటాము కానీ...

-దీప్తి పెండ్యాల

అలా మొదలైంది

ప్రసూన రవీంద్రన్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కథ

Damayanti

“చిత్ర కొంచమైనా తలొంచుకుంటే బావుంటుంది కావేరీ. మరీ అంత చనువుగా అందరితోనూ మాట్లాడేస్తుంటే, తనేనా పెళ్ళికూతురు అని అనుమానం వస్తోంది.“ నిష్టూరంగా అంది కావేరి పెద్దక్క నర్మద.

“అవునక్కా. ఇప్పటి ఆడపిల్లలు కనీసం తాళి కట్టే సమయంలోనైనా సిగ్గు నటిస్తే చాలు.“ కావేరి నిస్సహాయురాల్లా ముఖం ముడుచుకుంటూ అంది.

***

“తాళి కట్టేటప్పుడైనా కాస్త తలొంచుకుని సిగ్గుపడవే“ మధుపర్కాలు కట్టేటప్పుడు జడ జాగ్రత్తగా పట్టుకుంటూ అంది చిత్ర స్నేహితురాలు శ్రీలత.

నవ్యాంధ్ర జననీ

~కిభశ్రీ

మిశ్రచాపుతాళం

పల్లవి: ఖరహరప్రియ

నవ్యాంధ్ర జననీ  ఓ దివ్య కుంభిని

అనుపల్లవి: ఖరహరప్రియ

ప్రగతి మార్గము నడచు ఆంధ్రుల పాలిట భాగ్యావని

 

చరణం-1: ఖరహరప్రియ

మిన్నుతాకే కనుమలే మణి మకుటమై

అలల తళుకుల నదులు ఆభరణమ్ములై

నీలి ఖాతము  కీర్తిచాటు పతాకమై

భరతమాతకు కొత్తబిడ్డగ వెలిసినావమ్మా ।। నవ్యాంధ్ర।।

అవ్యయం

~మల్లిపూడి రవిచంద్ర

కాలాన్ని కవిత్వీకరిస్తున్నాను

కాఠిన్యాన్ని కలంపై కాచి కరిగిస్తున్నాను

కాలపుక్రమశిక్షణలో అతుక్కుపోయిన నీరసాన్ని బయటకు వంపేసి  

పాదాలకు పాదరసాన్ని పూస్తున్నాను.

నా అనుభవాల భస్మాన్ని

మంచి చెడుల కూలంకష ప్రవాహంలో ఎప్పటికప్పుడు తర్పణ చేస్తున్నాను.

నిర్ణయం

తిరుమలశ్రీ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి  సాధించిన కథ

Damayanti

“నా ఇల్లు ధర్మసత్రం కాదు, దారిన పోయే దానయ్యలందర్నీ తీసుకొచ్చి మేపడానికి. ఆ ముసలాణ్ణి వెంటనే ఇంటినుండి పంపివేయకపోతే నువ్వే వెళ్ళిపోవలసి వస్తుంది.”
 అనిల్ చిందులు త్రొక్కుతుంటే నిర్ఘాంతపోయాను నేను. అతను ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడో అర్థంకాలేదు నాకు. ‘నా ఇల్లు!’ – నిజమేనా? ఆ ఇల్లు మా ఇద్దరిదీ కాదా? దాని మీద నాకేమీ హక్కు లేదా? ఆ సంసారంలో, అతని జీవితంలో నాకూ సమాన పాత్ర ఉందని అతను ఎప్పుడు గుర్తిస్తాడు!?    “పాపం, అండీ! ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఇంటినుండి తప్పిపోయి వచ్చిన ఓ డబ్బయ్యేళ్ళ వృద్ధుడు అనాథలా వీధుల్లో తిరుగాడుతుంటే…మానవతాదృక్పథంతో ఇంటికి తీసుకువచ్చాను. అది తప్పా?

నారన సూరన ఉదయనోదయము – సవిమర్శక పరిశీలన.

పావని

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాసపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన వ్యాసం

Tirumalasree

ఉదయనోదయము అనే ప్రబంధాన్ని తెలుగులో నారన సూరన అనే కవి రచించాడు. ఇది 5 అశ్వాసాల ప్రబంధం. దీనికి మూలాన్ని కవి తన కావ్యంలో ఎక్కడా చెప్పలేదు. కాని ఈ కథకు మూలకథ కథాసరిత్సాగరంలోని ద్వితీయ లంబకంలో ఉంది. ఈ ఉదయనోదయంను కవి భాస్కర మంత్రికి అంకితం చేశాడు. దీనిని సూచిస్తూ కథా ప్రారంభంలో ఈ విధంగా ఉంది.

కం.     నీ జనకుడుదయనోదయ

  మోజం గావించె సురుచిరుకోక్తుల నది సం

  యోజింపుము నా పేరిట

   భూజననుత నారధీర పుణ్యవిచారా. ( ఉ.నో. 1._21.ప.)

అని “ ఉదయనోదయం “ ను అంకితమిమ్మని ముడియము భాస్కరుడు కోరగా అంకితమిచ్చానని కవి పేర్కొన్నాడు. అలాగే వనమలివిలాసంను రచించి కొండూరి అక్కదండనాథునికి అంకితం ఇచ్చాడు. ఇది ఉదయనోదయంకు ముందు సూరన చేసిన రచన. కవి తన ఇంటిపేరు, ఊరిపేరు, కావ్యం ఎప్పుడు రాశాడో పేర్కొనలేదు. .

గెలుపెవరిది?                    -శ్రీనివాస్ పెండ్యాల

రాజావారు ఇంట్లోకి ఎలుకలు దూరాయని ఇల్లు తగులబెట్టిన తాలూకు పొగలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి.డిమానిటైజేషన్ పుణ్యమా అని బిచ్చగాడి నుండి రాహుల్ బజాజ్ దాకా అందరూ ఈ సునామీలో తడిసి ముద్దయి -" మేము నల్లబాబులము కాము, పాలకంటే తెల్లటి తెలుపు రంగుకి ప్రతినిధులము" అని నిరూపించారు. ఎంతటి తెలుపంటే?  బట్టల సబ్బు ప్రకటనలా- తళతళలాడే తెలుపు! సూపర్ రిన్ లా మరింత తెల్లని తెలుపు!  XXX లా- సంస్కారవంతమైన తెలుపు

పుస్త​క పరిచయాలు              శాయి రాచకొండ

సరదాగా మరికొంతసేపు

                   -గబ్బిట కృష్ణమోహన్

కథ-2015

                  -కథా సాహితివారి ప్రచురణ

 వేదిక

                  -ఉమా కోసూరి

కవిసామ్రాట్ ముద్దులపట్టి  కిన్నెర!

వెంపటి హేమ

Damayanti

అనగా అనగా ఒక కోన ఉంది. ఆ కోనలో ఒక కొండ ఉంది.  కొండంటే మరీ పెద్ద కొండేమీ  కాదు, అది ఒక కొండగుట్ట (హిల్లక్), అంతే. ఒక వాగు ఆ గుట్టని చుట్టి, కోనలో దిగువకంతా ప్రవహించి, అడవుల వెంట సాగివచ్చి, చివరకు జీవనది  గోదావరిలో లయమైపోయింది. ప్రత్యక్షంగా కనిపించే విషయమిది. ఆ వాగు పేరు “కిన్నెరసాని”! ఆ కొండగుట్టని “పతిగుట్ట” – అంటారు. ఆ రెండు పేర్లకూ ముడివేస్తూ, ఆ ప్రదేశంలోని జానపదులు మనకు చెప్పే కథ ఒకటి ఉంది...

ఖమ్మం జిల్లాలోనే పుట్టి, అడవులగుండా ప్రవహించి భద్రాచలం సమీపంలో గోదావరి నదిలో కలిసిన ఒక సెలయేరు కిన్నెరసాని. కొ౦డగుట్టను చుట్టి ప్రవహించిన ఆ సెలయేటిని కనులారగా చూసి, దాని చుట్టుపక్కల అలమి ఉన్న ప్రకృతి సొగసుల్ని ఆస్వాదించి, ప్రవహించే కిన్నెర నడకల్లోని నేవళీకానికి ముగ్ధులైన శ్రీ విశ్వనాధ హృదయం స్పందించింది. అక్కడి జానపదులు చెప్పుకునే పుక్కిటికథ దానికి జీవమిచ్చింది .

bottom of page