MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
అహిద
అనిల్ ప్రసాద్ లింగం
1996 సెప్టెంబర్ 22.
సమయం సాయంత్రం అయిదు కావస్తుంది. ప్రధాని కార్యాలయంలోని అత్యవసర సమావేశ మందిరంలో మీటింగ్ ప్రారంభమయ్యింది.
"వీ హావ్ ఏ సిట్యుయేషన్ సార్ !" ఉపోద్ఘాతం లేకుండా ప్రారంభించాడు IB చీఫ్. "ఏజంట్ M అనే ఒక మాజీ శతృ దేశ గూఢచారి గతవారం ఉన్నంట్టుండి కరాచీలోని తన నివాసం నుండి మాయమయ్యాడు. అసలు ఇటువంటి ఏజంట్ల అస్థిత్వాన్నే ఏ దేశమూ ఒప్పుకోదు అటువంటిది ఆ దేశం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను కనపడటంలేదనే విషయాన్ని మనకు తెలిసేలా చేస్తుంది. అతను దుబాయ్ గుండా మన దేశంలోకి ప్రవేశించాడనే అనుమానాన్ని ప్రచారం చేస్తుంది. ఈ విషయం నా దృష్టికొచ్చాక విచారించమని ఈ కేసుని ఆఫీసర్ విక్టర్ కి అప్పగించాను"
"ఒకవేళ అతను....." ఆర్దోక్తిగా ఆగాడు ప్రధాని.
రిజర్వేషన్లు
ఆర్. శర్మ దంతుర్తి
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో మేష్టారు నాన్నని పిలిచి నా గురించి చెప్పారు, “కుర్రాడు బాగా చదువుకుంటున్నాడు, తాడికొండ హైస్కూల్లో జేర్పించండి పదో తరగతికి.”
“కుర్రాడి చదువు సరే, అక్కడ తిండి బాగోకపోతే?” నాన్న అడిగేడు, నేను వింటూండగానే.
“హాస్టల్లో బాగుంటుందండి. తిండికేమీ ఢోకాలేదు. నేను వెళ్ళినప్పుడు చూసాను. మీరో సారి వెళ్ళి చూడండి పోనీ.”
“సరే, చూసి వచ్చాక చెప్తానండి,” నాన్న లేచాడు.
ఆ తర్వాత ఎవర్నో కనుక్కుని తాడికొండ వెళ్ళొచ్చాక, నాన్నకి నచ్చినట్టే ఉంది, నా చేత అప్లికేషన్ పెట్టించేడు. అందులో ఫార్వార్డ్ కేస్ట్, ఎస్ సి, ఎస్ టి అనీ మరోటనీ ఉన్నాయి కానీ, నాకైతే ఏమీ తెలియలేదు వాటి గురించి. సంతకం పెట్టమన్న ఓ చోట పెన్నుతో గెలికేసి నా చదువులో నేను పడ్డాను.
గోదావరోడు...మా గోవిందరాజులు
ప్రసాద్ ఓరుగంటి
అనగనగా ఒక చిన్న ఊరు. గోదారికి దగ్గర గా ఉండే ప్రాంతం. ఒకప్పుడు పాడి పంటలకు పెట్టింది పేరు. అప్పుడప్పుడు వచ్చే తుఫానులకు పంటలు బాగా పాడవడం, చాలా మంది ప్రాణాలు కూడా పోవడం తో, ఈ తుఫాన్ల మహమ్మారికి , కొంతమంది పక్క టౌన్ కో, హైదరాబాద్ కో మెల్లగా మకాం మార్చేశారు. ఎక్కడికీ వెళ్లలేని వాళ్ళు అక్కడే ఉండి కాల క్షేపం చేస్తున్నారు ఉంటె ఉంటాం లేదా గోదారమ్మ తీసికెళ్ళిపోతుంది అనుకుంటూ...
**
అతని పేరు గోవిందరాజులు. వయసు దగ్గర గా ఇరవైఐదు నుంచి ముప్పై మధ్యన ఉంటాయి. కానీ పరోపకారి. ఆ ఊళ్ళో ఇతనిని రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఆ ఊరిని పాలించకపోయినా, పాలు పితకడం నుంచి,గోడ మీద పిడకలు, జనాలకు పచారు సామానులు తెచ్చేవరకు ఈయనదే పూచి. అందరికీ బంధువు లాంటోండు, ఎవరికి పనిచేస్తే, వాళ్ళు ఇతనికి భోజనం పెడుతూ, అప్పుడప్పుడు తిడుతూ ఉండే వారు. చూద్దాం! అసలీ రారాజు అనే గోవిందరాజు.. ఎవరూ... ఏమా కథ?
ఆప్యాయతకి అర్థం
శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
ఇండియా నుంచి అన్నయ్య ఇప్పటివరకూ పదిసార్లైనా ఫోన్ చేసి ఉంటాడు. ఐదు నిమిషాల క్రితం కూడా మాట్లాడాడు.
"వచ్చే నెలాఖరు లోనే అమ్మ సంవత్సరీకం. ఈసారైనా నువ్వు వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది.ఈ విషయం బావగారికి,పిల్లలకి కూడా నేను చెప్పానని చెప్పు. కనీసం ఇరవై రోజుల ముందుగా అయినా రావడానికి ప్రయత్నించండి." ఎంతో ఆప్యాయత గా మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టాడు.
అన్నయ్య ఎప్పుడూలేంది ఎంత ప్రేమగా పిలిచాడు..?? అంతలా అడుగుతుంటే రానని ఎలా చెప్పగలను ? అమ్మలేని ఇల్లు పుట్టిల్లే కాదని మనసు ఎంత రొద చేస్తున్నా ...సర్దిచెప్పుకున్నాను.
భయం
రాధిక నోరి
"క్షమించాలి, మీరు ఏమీ అనుకోకపోతే మీ సీటు నాతో మార్చుకోవటానికి మీకేమన్నా అభ్యంతరమా?" తన చేతిలోవున్న బేగ్ ని సీటుపై వున్న అరలో సద్దుతున్న అతను తియ్యగా వినిపించిన అ గొంతు విని ఆ మాటలు వినిపించిన వైపుకి చూసాడు. తన పక్క సీటులోని అమ్మాయి ఎంతో సంకోచంగా అతనివైపు చూస్తూ అడుగుతోంది.
" అబ్బే, ఏం లేదు, తప్పకుండా, రండి" అంటూ ఆ అబ్బాయి అటు వైపు సీటులో కూర్చున్నాడు. కిటికీ దగ్గర ఇంత మంచి సీటు వద్దని అంటోంది, ఈ అమ్మాయి కేమన్నా పిచ్చా అనుకున్నాడు మనసులో.
" కిటికీ దగ్గర సీటు వద్దని అంటున్నారు. ఏదన్నా ప్రోబ్లమా?" అని అడిగాడు ఇంక వుండలేక.