MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల
ఊబర్ డ్రైవర్ (Uber Driver)
నిర్మలాదిత్య
బ్యాగ్గేజ్ టాగ్ మీద నా పేరు కనిపిస్తూనే ఉంది.
"ఆ, అవునండి", అన్నాను. ముఖంలో కలవరం కప్పిపెట్టడం కష్టంగానే ఉంది.
అధికారి భృకుటి ఓ రవ్వంత ముడి పడింది.
"చెక్ ఇన్ అయిన బ్యాగ్ లలో, మీ సూట్ కేస్ మా పరిశీలనకు బయటపడింది. ప్రతీ ఫ్లైట్ లో కొన్ని బ్యాగ్ లు పూర్తిగా చెక్ చేస్తాము. సామాన్యంగా ఏమీ అనుమానస్పదంగా దొరకదు. మళ్లీ బ్యాగ్ మూసేసి, ఫ్లైట్ లోడింగ్ కి పంపించేస్తాము. శ్రీని, మరో సారి అడుగుతున్నాను, ఏమైన నాకు చెప్పదలచుకొన్నారా?", అడిగాడు.
"అబ్బే లేదండి" బింకంగా అన్నాను.
మైమౌ(maïmoú)
భాస్కర్ సోమంచి
74-01-09 ∇ 16:58:45 లూనార్ ప్రామాణిక సమయం, కెప్లర్ బేస్ (భూమి సమయం మే 26, 2040 11: 45 UT)
వివేక్ తన క్యాంప్ సైట్ నుండి చంద్రునిపై కెప్లర్ బేస్ వద్ద కొన్ని గజాల దూరంలో ** సౌర గ్రహణాన్ని చూస్తూ ఉన్నాడు.
భూమి సూర్యుడిని పూర్తిగా ఆవరించింది. అతని స్వ గ్రహం భూమి నీలం, నలుపు కలగలసిన రంగు లో ఉంది. చుట్టూ కొద్దిగా సూర్యుని కరోనా కాంతితో మెరుస్తోంది. చంద్రుడి మీద గోధుమ రంగు కాంతి అలుముకుంది.
తన తల్లితో భూమిపై గ్రహణాలు చూడటం అతనికి జ్ఞాపకం వచ్చింది. గ్రహణం ఒక నమ్మ శక్యం కానీ అద్భుతం. చంద్రునిపై, భూమి మీద ఉన్న గ్రహణానికి వ్యతిరేక గ్రహణం చూడడం ఓ కల నిజమవ్వడమే. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తకి అతను జోహార్లు అర్పించకుండా ఉండ లేక పోయాడు.
దేవునిపై అతని నమ్మకం అతని తల్లి అతనికి నేర్పిందే. ఐన్స్టీన్ యొక్క ఆలోచనను అతను ఎక్కువగా నమ్మాడు, “దేవుడు విశ్వంతో పాచికలు ఆడడు”. ఆయన ఆలోచన ప్రకారం దేవుడంటే ఎవరో ఒకరు సిద్ధాంతాలను ఏర్పరిచారు. ఆ సూత్రాల ప్రకారం విశ్వాన్ని సంచరించడానికి వదిలివేసారు.
మరో పునాది
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఎ హెడ్ ఆఫ్ ద స్టోరీ.
ప్రఖ్యాత వీరోజీ స్టూడియో, ఫిల్మ్ నగర్-
"లైట్స్, కెమెరా....యాక్షన్" యంగ్ డైరెక్టర్ విక్రమ్ వర్మ అనగానే ఎనభై ఏళ్ల జి పి ఆర్ తండ్రి పాత్రలో ఆవేశపడుతూ, ఉద్రేకంతో ఊగిపోతూ, కొడుకు మీదకొస్తూ.. కొట్టడానికి చెయ్యెత్తి "నీకెన్ని సార్లు చెప్పాన్రా, ఆ అమ్మాయితో ఎఫయిర్ వద్దని..అయినా.." అంటూ గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మొదట అందరూ యాక్షన్ అనుకున్నారు, కొన్ని క్షణాల వ్యవధిలో అది నిజమన్న విషయం అర్థమైంది. అందరికన్నా ముందు నిజ జీవితంలోను, సినిమాలోను కొడుకునైన నాకు.
నేను వెంటనే పరిగెత్తుకెళ్లి నాన్న తలను ఒళ్ళో పెట్టుకుని గద్గద స్వరంతో "ప్లీజ్, అంబులెన్స్ ను అరెంజ్ చేయండి." గట్టిగా అరిచాను.
పాత సినిమాలు కొంటాం
జే.పీ. శర్మ
"సరే, పాత సినిమాలేం చేసుకుంటావోయ్!" అంటూ అతని వైపు చూసాను.
"కాలం మారింది కదా సార్, ఆ పాత సినిమాలో డైనాగులు మార్చి, కొత్త డైనాగులతో ఆ కథని రీమిక్స్ సేసి, నాలుగు పెగ్గుల డబ్బులు సంపాదించుకుంటున్నాను సార్!" ఆఖరి దమ్ము లాగి, సిగరెట్టు పడేసి నా వైపు చూసాడు.
వాడి ఆలోచనేఁవిటో, నాకేం అర్ధం కాలేదు. చెయ్యి తలమీదకు వెళ్ళింది. అది చూసి "మీకర్ధం కానట్టుంది. ఓ పాలి ఇది సూసెరంటే అర్ధమయి పోతుంది! మీలాంటోల్ల కోసమేనండి, ఓ ట్రయిలర్ వొట్టుకొచ్చాను!" అంటూ ఆ లాప్టాప్ ఆన్ చేసాడు.
"నేడే చూడండి, మీ అభిమాన దియేటర్లో- " అంటూ మొదలైంది!
వెంటనే సీను -
నవరాత్రి - 1
గిరిజా హరి కరణం
“అరమైలన్నా నడవలేదు, అప్పుడే ఆయాసంగా వుందేవిటీ “అనుకుంటూ చెమటలు తుడుచుకుంటూ రోడ్ ప్రక్కగా నిలబడ్డారు శాస్త్రిగారు.
ఆయన ఆయాసపడుతూ మెల్లగా తడబడుతూ నడవటం వెనకాతలే సైకిలు మీదొస్తూ గమనించిన శంకర్, శాస్త్రి గారివద్దకొచ్చి ఆగి “పంతులుగారూ, యెండనపడి నడవలేరు నా సైకిలెక్కండి, వూళ్ళోకేగా” అడిగాడు శంకర్. “అవును నాయనా” అంటూ సైకిలెక్కారు శాస్త్రిగారు.
యెదురింటిముందు కొత్తవాళ్ళు బండి దిగటంచూసి యెదురింటి అమ్మాయి లక్ష్మి, వాళ్ళమ్మా బయటికొచ్చారు.
శాస్త్రిగారి గొంతువిని రామయ్యకూడా” నమస్కారమయ్యా యిన్నాళ్ళకు వూరు గుర్తొచ్చిందాయ్యా“ అంటూ దగ్గరకొచ్చాడు
జోడు పిట్ట ( తమిళ మూలం: ఆర్.చూడామణి )
అనువాదం: రంగన్ సుందరేశన్
ఇంటి వెనుక వైపు వసారా మెట్లలో విశ్రాంతికి నాన్నమ్మ మామూలుగా కూర్చొనే మెట్టులో తాతగారు కూర్చున్నారు. శ్రీమతిని తన చేతులతో లాగి పక్కనే కూర్చోమన్నారు. అతని చూపు మళ్ళీ ఆ మల్లెపూల మొక్కలమీద వాలింది. అతను ఏమీ మాటాడలేదు. అంచువరకూ నిండిన గిన్నెనుంచి బొట్లు రాలకుండా జాగ్రత్తగా ఆ గిన్నెని పట్టుకున్నట్టు శ్రీమతి అతని మౌనాన్ని కాపాడింది. తాతగారు తలెత్తి తన్ను చూసినప్పుడు చలనంకూడా భంగపరుస్తుందేమో అనే ఉద్దేశంతో కదలకుండా అలాగే ఉంది. అప్పడప్పుడు తాతగారి దేహం వొణకడం మాత్రం గ్రహించింది.
“నాన్నగారూ, భోజనానికివస్తారా?”
అప్పుడే రాత్రి వచ్చేసిందా? శ్రీమతి నాన్నగారు వెనకన నిలబడి పిలిచినప్పుడు ఆ ధ్వని ఒక రాతిబండలాగ ఆ మౌనాన్ని తాకింది. శ్రీమతి అదిరిపడి తాతగారిని చూసింది. కాని అతను “సరే, వస్తాను” అని మామూలుగానే జవాబు ఇచ్చారు. శ్రీమతి చేతిని వదిలేసి, “అమ్మాయీ, నువ్వూ వెళ్ళి విస్తరాకుముందు కూర్చో, నేను వస్తాను” అని అన్నారు.