MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
దృశ్యాదృశ్యం
మణి వడ్లమాని
నిత్యకృత్యాలు జరిగిపోతున్నాయి. మధ్యాహ్నం గడిచి, సాయంత్రంలోకి నడిచి, రాత్రి లోకి వెళుతూ రోజు భయంగా నా వైపు చూసింది. నేను రేపనేది చూడనని దానికీ తెలిసిందేమో. తప్పదని తెలిసి కళ్ళు మూసుకుని భయపడసాగింది.
భయం, భయం, భయం!
సందడి లేకపోవడం, దిగులుతో పాటు, ఇల్లు వీధులు కూడా నిశ్శబ్దంగా ఉండటంతో తెలియని గుబులు. రేపు అన్నది ఇంక నా జీవితంలోఉండదు.
జీవించి ఉంటే, మళ్ళీ మళ్ళీ దాన్నే చూడాలి. అది వద్దు. చాలు ఈ జీవితం.
హమ్మయ్య! ఇంకెంత సేపు? మహా అయితే ఒక ఇరవయి నిముషాలు. ఆ తరువాత అంతా ప్రశాంతతే.
నాకు ఇష్టమయిన పాట “ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్”. ఆ గొంతులో విషాదం వింటూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవాలి. అదే నా ఆఖరి కోరిక.
సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే శాస్త్రి గారి కవితలో ఒక పదం మార్చుకుని 'మనసారా చావనీయరు” అనుకుంటూ లేచి వెళ్లి ఫోన్ తీసా...
ఎవరు? ఎందుకు?
నిర్మలాదిత్య
"ఎవరు?", అంది లక్ష్మి.
"టైం షేర్ , పోర్ట రికో ట్రిప్ అట", అన్నాడు రామం.
సాయంత్రం ఇంటి వెనుకనున్న లానై లో వేసిన అవుట్ డోర్ సోఫాసెట్లో కూర్చుని చెస్ ఆడుతున్నారు రామం, లక్ష్మి లు. వారాంతాల్లో సాయంత్రాలు ఏదో ఓ పార్టీ అని హడావిడిగా ఉన్నా, వీక్ డేస్ లో రామంకి లక్ష్మి, లక్ష్మికి రామం, ఓ విసుగు సలపని సాన్నిహిత్యమే.
రామం అప్పుడప్పుడు "మన జీవితం కూడ ఓ పసందైన సినిమాలాగే జరిగి పోయింది కదా", అని లక్ష్మీ తో సరదాగా చెప్తుండేవాడు. వారిద్దరే చూసిన ఆ సినిమాలో కొన్ని, కొన్ని దృశ్యాలు వారికి మాత్రమే, నవ్వు తెప్పిస్తే ఆశ్యర్యమేముంది.
రామం, లక్ష్మిల జ్ఞాపకాలు వారి కాలేజీ చేరిన రోజులకు వెళ్లి పోయాయి. ఇద్దరూ స్టూడెంట్ లే. ఆ రోజుల్లో ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్లు తక్కువే.
చెల్లుబడి ధర్మరాయా!
వెదురుమూడి రామారావు
రాత్రి పదిన్నర దాటుతోంది.
కంపెనీ గెస్ట్ హౌస్ లో, ఏసీ రూమ్ లో వున్నాను. మనసంతా తెలీని ఏదో అశాంతి.
దూరంగా 'కరోనా రేడియో' అనుకొంటాను ఓ.పి.నయ్యర్ చక్కటి పాట మంద్రంగా వినిపిస్తోన్నది. ఆ మంద్రమైన సంగీతం కూడా కరిగించలేనంతగా ఘనీభవించిన చీకాకు.
పొద్దున్నేకొండ మీదకి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. ౩౦౦ రూపాయల దర్శనం అడ్వాన్స్ టికెట్ కూడా తీసుకొన్నాను. పడుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నాను. ఇన్నేళ్లు దాటినా ఇంకా ఆ విషయం నన్ను అలా వెంటాడుతూనే వుంది.
అయిపోయింది కదా. ముగిసి కూడా చాలా కాలం అయ్యింది కదా? మాటిమాటికి ఆ విషయం నన్ను ఎందుకు వెంటాడుతూవుంది ? ఎందుకు అలా జరిగింది ?
ఓ పోలీస్ డైరీలో ఓ రోజు
వెంపటి హేమ
నున్నటి మెటల్ రోడ్డుపై పడిన ఎండకి అతని కళ్ళు మిరిమిట్లవుతూండడంతో అన్నీ మసక మసకగా కనిపిస్తున్నాయి. కొంచెం దూరంలో ఉన్న పక్కరోడ్డు మలుపు తిరిగి ఎవరో తనవైపుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి. కానీ మిరిమిట్లవుతున్న తన కళ్ళు భ్రమ పడుతున్నాయేమో - అనుకున్నాడు. ఆ వ్యక్తి మరికొంచెం దగ్గరకు వచ్చాక తెలిసింది, ఆమె ఒక తలపండిన వృద్ధురాలనీ, ఆమె ముఖాన మాస్కు లేదనీను. వెంటనే అతనికి తన డ్యూటీ గుర్తొచ్చింది. ఆమెకు ఎదురుగా నడిచాడు.
తన దారికి అడ్డుగా నిలబడ్డ పోలీసుని వింతగా చూసింది ఆ మామ్మ.
"మాస్కేది మామ్మా?" నిలదీసి అడిగాడు ఆమెను పోలీసు వీరాస్వామి.
ఆశ్చర్యపోయిన మామ్మ, "మాస్కంటే ఏమిటి బాబూ " అని బదులు అడిగింది.
"మాస్కంటే తెలియదా! ఇదిగో ఇది" అంటూ, తన జేబులోనుండి ఒక మాస్కుని తీసి ఆమె ముఖానికి తగిలించాడు వీరాస్వామి.
కెవ్వు మంది మామ్మ! "అయ్యో నీ మొహమీడ్చ! ...
"లవ్" చేయండి సారూ ( తమిళ మూలం: జయకాంతన్ )
అనువాదం: రంగన్ సుందరేశన్
ఏమండోయ్, మిమ్మల్నేఇలా రండి హోటల్ పక్కన రాగానే ఏదో ఆలోచనలో పడినట్టు ఇలాగా అలాగా చూస్తారేం? అవన్నీ నాకు తెలుసు మీరు తప్పకుండా లోపలికి రావాలి, మీకూ మరేం పని లేదుగా? ఆదివారం అని బాగా డ్రస్సు చేసుకొని బయలుదేరేరన్నమాట! ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారని నాకు తెలుసులెండి! నన్ను అడగండి, చెప్తాను.
ఒరేయ్, ఎందుకురా ఎప్పుడూ ఆ రేడియో పక్కనే నిలబడతావ్? ఎందుకలా చూస్తావ్? ముందు ఆ టేబుల్ క్లీన్ చెయ్! అయిందా, ఇక అటు వెళ్ళు!
రండి సార్, ఆ రూములోకి వెళ్ళి కూర్చోండి ఏమిటి కావాలి? ఏమీ వద్దా? ఏం, ఎందుకు? సరే, కాఫీ మాత్రం ఒరే, నారాయణా, సార్ కి కాఫీ తీసుకురా, పంచదార తక్కువగా, స్ట్రాంగుగా ఉండాలి ఎందుకు రేడియో గర్రుబుర్రుమని అరుస్తోంది? దాన్ని ముందు ముయ్!
ఏమండీ, ఇదేం మ్యూజిక్, చెప్పండి? ఏమైనా మన కర్ణాటక సంగీతంకి ఈ డబ్బా కూత సాటి అవుతుందా? నేను చెప్పేది నిజం, కర్ణాటక సంగీతం గొప్ప మన ఊరులో ఉన్న మందమతులకి తెలీదు, అమెరికాలో దానికి మంచి పేరట వీడెక్కడ, కాఫీకి వెళ్ళాడు, ఇంకా రాడేం? సరే, మీకేం తొందర లేదని నాకు తెలుసు, ఐతే అందుకోసం వాడు ఆలస్యం చెయ్యవచ్చా? రేపు మీరే త్వరగా కాఫీ తాగాలని వచ్చారనుకోండి - అబ్బే, తొందర అంటే ఇక్కడకి ఎందుకు వస్తారు? అసలు వచ్చారనుకోండి, అప్పుడూ ఇలాగే చేస్తాడు! సత్యానికి కట్టుబడి మన పని మనం చెయ్యాలని ఎవరు ఈ కాలంలో ఉన్నారు చెప్పండి ఏమో, ఎవరికి తెలుసు?