MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
మృగతృష్ణ
ఓలేటి శశికళ
రాత్రినుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న జ్యేష్టమాసపు వాన, కళ్ళమీంచి నిద్రదుప్పట్లను లాగనీయడం లేదు.
చెట్టూచేమల మీద, ఇళ్ళకప్పుల మీదా వానధారలు రథిమిక్ గా చేస్తున్న సంగీతం వింటూ , ఆదివారపు అతివిలువయిననిద్రను ఆస్వాదిస్తున్న నాకు సెల్ ఫోనుఅరుపు లేవకతప్పని పిలుపయ్యింది.
దుప్పట్లోంచి మెల్లగా చెయ్యిసాచి, సవ్యాపసవ్య దిశలు తెలీక , చివరికి చెవికాన్చి " హలో" అన్నానో లేదో....... దడదడమని ఉరమని పిడుగుల్లాంటి మాటలు పడిపోతున్నాయి , దూసుకుపోతున్నాయి చెవుల్లోకి.
సుషుప్తి నుండి జాగృతికొచ్చిన బుర్ర ఆ శబ్దాలను మాటలుగా, మాటలను వ్యక్తిగా మార్చుకోడానికి కొన్ని క్షణాలు పట్టాయి. మెల్లగా గొంతుబొంగురు సవరించుకుని
" దేవక్కా!.... " అన్నా!
అమ్మ కడుపు చల్లగా...
శ్రీనిధి యెల్లల
దూరంగా ఎక్కడినుండో తెరలుతెరలుగా వస్తోంది ఏడుపు.
కాస్త జాగ్రత్తగా వింది ప్రణవి. అనుమానం లేదు అది పసిబిడ్డ ఏడుపే.
“ఏమైంది ఆ పాపకి? ఎవరు ఆ పాపా? నా పాపే నా? పాపా పాపా!” అంటూ చీకట్లో ఆ ఏడుపు ఎటు వినిపిస్తే అటు పరిగెడుతోంది ప్రణవి. "
ఎక్కడ పాప, నా పాప ఏది. అయ్యో !కనపడదేం ! పాపా ! పాపా!." అంతుతెలీని దారిలో, ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న నిధి కోసం వెర్రిగా వెతుకుతున్నట్లు పరిగెడుతోంది. అలసిపోతోంది, పరిగెట్టలేక పోతోంది. కానీ తనకోసమే వేచి చూస్తున్నట్లుగా వినిపిస్తోన్న పాప గొంతు నిలవనీయడం లేదు.
మబ్బు వెనక...
ఆర్.దమయంతి
ఇంకొన్ని క్షణాల్లో - సినిమా మొదలైపోతుంది అనడానికి సంకేతంగా అప్పటి దాకా వెలుగుతున్న గుడ్డిదీపాలు చప్పున ఆరిపోయాయి.
హఠాత్తుగా హాలంతా కటిక నిశ్శబ్దమైపోయింది.
ప్రేక్షకుల అంచనాకి తగినట్టుగా వారి ఉత్కంఠ స్థాయి లో - తెరమీద బానర్ పేరు పడింది. ఆ వెనకే చెవులు దద్దరిల్లే వాయిద్యాల హోరు తో దృశ్యం మొదలైంది. వందల కొద్దీ గుర్రాలు శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. చెవుల్లో డెక్కల శబ్దాలకి గుండె దడ దడ లాడేలా మోగిపోతున్నాయి. సరిగ్గా అప్పుడే కథా నాయకుడు వీర సాహసంతో - గుర్రం మీంచి గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి విలన్ రధం లోకి చొచ్చుకుపోయాడు.
గ్రాఫిక్స్ మాయలు చేస్తుంటే కళ్ళప్పగించేసి చూస్తున్నారు.
అంత ఉత్కంఠం లోనూ ఆమె కళ్ళు స్క్రీన్ మీద కంటె, ఎంట్రన్స్ డోర్ నే చూస్తున్నాయి.
ఏడీ ఇతను? పాప్ కార్న్ తీసుకొస్తానని వెళ్ళినవాడు ఇంకా రాడేమిటీ? ' అనుకుంటూ, కళ్ళు చిట్లించి చూసింది.
కొలబద్ద
నిర్మలాదిత్య
“ప్రతీ క్షణం విలువైనది. సమయం వృధా చేయలేను. సంవత్సరానికి ఓ అర్ధ మిల్లియన్ డాలర్లు అంటే క్షణానికి ఎంత ఉండచ్చు?”, తన ప్రశ్నకు జవాబు తెలుసుకొనే పరిస్థిలో లేడు సుకుమార్.
అదో జవాబుకు ఎదురుచూడని రిటోరికల్ ప్రశ్ననే.
సుకుమార్ విసుగుకు కారణం , ఫోన్ సరిగా పని చేయకపోవడమే. కాన్ఫరెన్సు కాల్ లో తన మాటలు స్పష్టంగా వినపడలేదని కొన్ని సార్లు ఫోన్ కట్ చేసి మళ్ళీ కలిపితే, కొన్ని సార్లు ఫోన్ కాల్స్ దానంతటికి అవే డ్రాప్ అయ్యిపోతున్నాయి. అలా అవుతుందని, అనుకుంటూనే, ఓ అసహాయతతో ఇష్టం లేకుండా ఇంత దూరం వచ్చాడు సుకుమార్.
అన్ని విషయాలలో ఖచ్చితంగా ఉండే సుకుమార్, వనజ విషయంలో అలా ఉండలేకపోతున్నాడు. అందుకే ఆదివారం సాయంత్రం దూప్ ఆరతి కి బాబా గుడికి పోదామంటే, కాదనలేకపోయాడు.
పురాణం - పాట్ లక్ డిన్నరు
శ్యామలాదేవి దశిక
ఏమిటీ....పద్మగారు నాకోసం ఫోన్ చేసారా?
“పాట్ లక్ డిన్నర్” కి మనం ఆవపెట్టిన అరిటికాయ కూర పట్టుకొస్తున్నామని, ఈ అగ్నిహోత్రానికి విరుగుడుగా ఆవిడని ఆనపకాయ పెరుగు పచ్చడి చెయ్యమని సలహా ఇచ్చారా?
ఇస్తారు...ఇస్తారు మీ సొమ్మేం పోయింది! “పురాణం” పేరు పెట్టుకుని మీ మగాళ్ళందరూ వారానికో రోజు ఎంచక్కా పండగ చేసేసుకుంటున్నారు! రిటైర్మెంట్ పుచ్చుకుని ఇంట్లో గోళ్ళు గిల్లుకింటూ కూర్చున్న మీ అందరికీ మంచి కాలక్షేపం దొరికింది. “ప్రవచనం” పేరుతో అందరూ ఒకచోట చేరి ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ కలగలిపి మాట్లాడుకోటానికి బాగా అలవాటు పడ్డారు!
“గోవర్ధనం గారింట్లో ప్రతి వారం శ్రీనివాసశాస్త్రి గారు “పురాణం” పేరుతో ఏవో మంచి విషయాలు చెప్తున్నారుట! మనమూ వెళ్దామోయ్” అని మీరంటే నా చెవులను నేనే నమ్మలేకపోయాను! రిటైర్ అయిన తర్వాత బుర్రలోనుంచి ఆఫీసు తాలూకు బూజు వదిలి, ఇన్నాళ్టికి మీరు కాస్త దోవలో పడుతున్నారని ఆనందపడ్డాను.