MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
మేడ్ పాజిబుల్ బై
తాడికొండ కె. శివకుమార శర్మ
“ఆకుపచ్చ గడ్డి మార్గం!” నువ్వు మీ వీధి పేరుని తెలుగువాళ్లకి అర్థ మయ్యేలా ఆంగ్లం నించీ అనువాదం చేసి చెబుతావు మీ అపార్ట్‌మెంట్ చిరునామాని ఇస్తున్నప్పుడు. “ఆకుపచ్చ గడ్డికి మార్గం కూడా!” అంటారు మీ ఇంటికి వచ్చినవాళ్లు చుట్టూ చూసి నవ్వుతూ.
మెయిన్ రోడ్డు నించీ గ్రీన్ గ్రాస్ వే లోకి తిరగ్గానే రెండుపక్కలా పార్క్ చేసివున్న కార్లు తప్ప అక్కడ నరసంచారం కనిపించేది తక్కువేనని నీకెప్పుడో తెలుసు. అపార్ట్‌మెంట్ నుంచీ బయట పడి పార్క్ చేసి వున్న మీ కారు వద్దకు నడుస్తున్నప్పుడూ, తిరిగి వచ్చిన తరువాత కారు పార్క్ చేసి కిందకు అడుగు పెట్టకుండానే చుట్టూ కలయజూసినప్పుడూ అక్కడ ఇంటిని అద్దెకు తీసుకోవడం గూర్చి నీ భార్య ఫిర్యాదు చేస్తూనే వుంటుంది. ఒక ఏడాది అక్కడ గడిపిన తరువాత ఇంకొక ఏడాదికి లీజ్ పత్రం మీద మళ్లీ సంతకం పెట్టడానికి ఆమె అభ్యంతరం చూపనందువల్ల ఆ ఇంటికీ, ఆ వీధికీ తను అలవాటయిందనుకుని నువ్వు పొరబడతావు. ఆమెలో మొలకలేస్తున్న ‘రిసెంట్‌మెంట్’ పూత పూసి కాయలు కాయడందాకా రావడానికి అది నాంది పలుకుతుంది...
ఎక్కడమ్మా కోడలా?
పద్మజ చివుకుల
ఓ ఆహ్లాదకరమైన ఉదయం. బాల్కనీ లో కూర్చుని వేడి వేడి కాఫీ సేవిస్తూ చలి తెరల్ని చీల్చుకుంటూ పైకి వస్తున్న సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నాను.
"ఇదిగోండి, ఇవ్వాళ ఏకాదశి, మంచి రోజు, పని మొదలు పెట్టండి" లాప్ టాప్ తెచ్చి నా ముందు పెట్టింది శ్రీమతి. మా ఆవిడ అని అనలేదండోయ్, తన పేరే శ్రీమతి.
"శుభం, అవిఘ్నమస్తు" అనుకుంటూ మాట్రిమోనీ వెబ్ సైట్ ఓపెన్ చేశాను. దీని గురించి నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇప్పుడు కొలీగ్ కూడా అయిన సుధాకర్ చెప్పాడు.
పోయిన వారం "మా వాడికి ఏమన్నా మంచి సంబంధాలుంటే చెప్పరా. ఈ ఏడు పెళ్లి చేసేస్తాం" అడిగాను సుధాకర్ ని.
వాడిక్కూడా ఒకడే కొడుకు, కాకపోతే అయిన సంబంధమే వుంది కనుక వాడు వెతకక్కర్లేదు.
"నాకు చెప్పావు గా, ఇంకా వదిలేయ్" అన్నాడు. అనటమే కాదు మూడో రోజు నా సీట్ దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు. వాడిది వేరే డిపార్టుమెంటు.
అల్గారిథం
- అనిల్ ప్రసాద్ లింగం
"ఐయాం రియల్లీ సారీ బావా. నా వల్ల నువ్విలా ఇబ్బంది పడుతున్నావు." బేలగా మొహంపెట్టి చెప్పింది నైనిక.
"ఛా.. అదేం పర్లేదు. నువ్వేం బాధపడకు" ఆమె వద్దకు నడిచొచ్చి అనునయంగా భుజం మీద చెయ్యి వేసి సముదాయించాడు క్షితిజ్.
"గాడిద ఎగ్గేం కాదూ?. నువ్విలా వేషాలు వేస్తావనే నీకు వార్నింగ్ ఇస్తున్నా." భుజంమీది చెయ్యిని విదిలించి కొట్టి దూరం జరిగి చెప్పింది.
"వరసైన దాన్ని ఒంటరిగా దొరికానని పనికిమాలిన ఆలోచనలేం పెట్టుకోమాకు. నా కొడుకున్నాడు పక్కన వీడుకి కిస్సు, హగ్గు అంటే ఏంటో తెలుసు. నువ్వేం చేసినా వాడి బాబుకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. ఆయన వెంటనే విమానం ఎక్కి వచ్చేస్తాడు - ఏమనుకుంటున్నావో. జాగ్రత్త !" సీరియస్ గానే చెప్పింది నైనిక.
ఈ వేరియేషన్కి అవాక్కయిన క్షితిజ్, వెనకడుగేసి తన బెడ్డు మీద కూర్చొని, "ఇప్పుడు నేనేం చేసానే బాబూ? అన్ని మాటలూ నీయేనా? అయినా మీ ఆయనంటే నాకేం భయమా, రమ్మను చూస్తా. ఎలా వస్తాడో, ఈ కరోనా దెబ్బకి విమానాలు కూడా ఆపేసారు" అన్నాడు.
"అబ్బా.. అంత మొనగాడివా? అయినా అమెరికా నుంచి మా ఆయననెందుకు, అక్కా, బావ పిచ్చి వేషాలు వేస్తున్నాడని మీ ఆవిడకు చెప్తాను, ఆవిడే చూసుకుంటది."
పోపుల పెట్టె ( హాస్య కథ )
-వాణీశ్రీనివాస్
"రజనీ! నీకీ విషయం తెలుసా?
మన కాంతామణిని హైదరాబాద్ లో త్యాగరాయ గానసభలో, గజమాలతో సత్కరిస్తారుట.
గజారోహణం, కిరీటధారణం చేస్తారుట.
ఎంతదృష్టం అంత గౌరవానికి నోచుకోవాలంటే పెట్టి పుట్టాలి మరి.
"అవునా గజనీ… సారీ, గజలక్ష్మీ! నీకెలా తెలుసు"
"మన వాట్సాప్ మిత్ర బృందం చెవులు కొరుక్కుంటున్నారు."
నాటకం
జానకీ చామర్తి.
రామం చేతులు కట్టుకుని పిట్టగోడని ఆనుకునుంచుని కళ్ళార్పకుండా చూస్తున్నాడు చందమామని.
ఇవాళ పౌర్ణమి ఏమిటి చెప్మా?... అనుకున్నాడు. వాతావరణంలో ఆగి ఆగి కొబ్బరి ఆకుల మీద నుంచి వస్తున్నచల్లగాలి, అలలు రేపినట్టు, రామంలో ఏవేవో ఆలోచనలు రేకెత్తిస్తోంది. కనబడే చందమామ గుండ్రంగా కొద్దిపాటి వంపులు తిరిగి పాతబడిన వెండి కంచంలా మెరుస్తున్నాడు అనుకున్నాడు రామం.
నిండు చందమామని చూసినప్పుల్లా వెండికంచం గుర్తొస్తుంటుంది రామానికి. దానికి కారణమూ, కథా కూడా ఉంది. రామం బాల్యంలో ఎదుర్కొన్నసంఘటనే అది.
చిన్న రామం కి ఊహ వచ్చాక తెలుస్తున్న విషయాలు, ఇంటి పరిస్ధితులు ఆలోచన రేకెత్తించేవిగానే ఉండేవి. ఇంకోలా చెప్పాలంటే అతను మెల్ల మెల్లగా వాటిగురించి ఆలోచించడం ఆరంభించాడు అనవచ్చు.