MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
ఒక్క దీపం …
ప్రసూన రవీంద్రన్
“హలో రూపా “ స్నేహితురాలి ఫోన్ నవ్వుతూ తీసిన కవిత, ఆమె చెప్పిన విషయం వినగానే అదిరిపడుతున్న గుండెలతో నిస్సత్తువగా గోడకి ఆనుకుపోయింది.
“నేను వెంటనే వస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండవే. “ మాటలు కూడదీసుకుంటూ చెప్పి పరుగు పరుగున బయటికి వచ్చింది.
ఇటువంటి సమస్యలు ఎక్కడున్నా వెంటనే స్పందించి ఆ వ్యక్తులకి సహాయపడటమే తన పని అయినా, ఇవాళ ఆ పరిస్థితిలో తన ప్రాణ స్నేహితురాలు రూప కొడుకు విరాజ్ ఉండటం మరింత ఆందోళనకి గురిచేస్తోంది కవితని.
ఆటో ముందుకు పోతుంటే ఆమె మనసు మరోసారి గతంలోకి జారుకుంది...
తారుమారు
భవానీ ఫణి
కల్పన కారు పార్క్ చేసి, తన దగ్గర ఎప్పుడూ ఉండే ‘కీ’ తో తలుపు తీసుకుని - వేగంగా లోపలికి నడిచింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలిద్దరూ సోఫాల్లో, మాధవ్ కుర్చీలో పడుకుని నిద్రపోతున్నారు. 'రాత్రంతా ఎంత కంగారు పడుంటారో, తను రాలేదని!' జాలిగా నిట్టూర్చింది. స్నానం వగైరాలు కానిద్దామని శబ్దం చెయ్యకుండా బెడ్ రూమ్ లోకి దారి తీసింది.
ఆమె తయారై వచ్చేసరికి కూడా ఎక్కడి వాళ్లక్కడే నిద్ర పోతున్నారు. మెల్లగా వెళ్లి మాధవ్ ని తట్టి లేపింది. అతను ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చున్నాడు.
"కల్పనా! యూ ఆర్ సేఫ్!" వణుకుతున్న కంఠంతో మెల్లగా అంటూ ఆమెను దగ్గరకి తీసుకున్నాడు. ఆ అలికిడికి స్రవంతి కూడా నిద్ర లేచింది. 'అమ్మా' అంటూ వచ్చి కౌగలించుకుంది.
భోలా షేర్
నండూరి సుందరీ నాగమణి
“ఏమిటి లతా, వర్క్ అయిపోయినా ఇంకా కూర్చున్నావు?” సాయంత్రం ఆరుగంటలకు ఆదరా బాదరా బాగ్ సర్దుకుంటూ అడిగింది ఇందూ.
“క్యాబ్ బుక్ చేశా ఇందూ... అది వచ్చేవరకూ వెయిట్ చేయాలి...” చెప్పింది లత.
“ఏమిటీ క్యాబా? చాలా అయిపోతుంది కదా ఫేర్ కి?” ఆశ్చర్యంగా చూసింది ఇందూ.
“లేదు ఇందూ…ఇప్పుడు క్యాబ్స్ లో షేర్ అనే ఆప్షన్ వచ్చింది. దాని వలన ఒకే క్యాబ్ ని నలుగురు వేరువేరు ప్రయాణీకులు పంచుకునే అవకాశం ఉంది. ఫేర్ మన ఆటో ఫేర్ కన్నా తక్కువే అవుతుంది…”
“అవునా? ఎలా?? చెప్పు చెప్పు!” లత ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది ఇందూ.
దొడ్డ మనసు
జయంతి ప్రకాశ శర్మ
పేరుకే కామేశ్వరమ్మ, కాని దొడ్డమ్మ గారంటేనే ఆ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది!
గంగా భగీరధీ సమానురాలైన కామేశ్వరమ్మ జానెడు జరీ అంచున్న తెల్ల చీరని అడ్డగచ్చగా కట్టుకుని, చూడ్డానికి చాలా హుందాగా ఎప్పుడూ చిరునవ్వు మొహంతోనే ఉండేవారు. ఆవిడకి ముఫ్ఫై సంవత్సరాలకే వైధవ్యం రావడంతో పుట్టింటి పంచన చేరింది. అంతకు ముందే చనిపోయిన తన చెల్లెలి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలని పెంచే బాధ్యత వారిమీద పడింది.
ఆ పిల్లలు ‘దొడ్డమ్మ’ అని పిలిచేవారు. అదే పిలుపు వీధిలో వాళ్లకి, ఊరులో కూడా అలవాటైపోయింది.
అలా అంతమంది తమ పంచన చేరినా, ఆ ముసలి దంపతులు అధైర్య పడిపోలేదు. ' ఏం చేస్తాం! అంతా వాడి లీల!' అని అనుకుని ...