MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల
"అ-మర" లోకం
నిర్మలాదిత్య
"నాతో వస్తే చావు ఖాయం. రానంటే నువ్వు ఓ అమరుడిలా ఎప్పటికి చావు లేకుండా బ్రతికి పోవచ్చు. మనకు అంతగా టైం లేదు. నీ నిర్ణయం వెంటనే చెప్పు.” అంది ఓ అపరిచిత.
"ఇలాంటి మెదడు ఉపయోగించనవసరం లేని 'నో బ్రైనెర్' ప్రశ్న వేసి జవాబు అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నేనెక్కడ ఉన్నాను? ఇవ్వాళ ఏమి రోజు?" అడిగాను నేను.
ఓ పది అడుగుల క్రింద సముద్రం నీలంగా కనిపిస్తున్నది. పైన నీలాకాశంలో, తెల్లటి పిల్ల మేఘాలు తిరుగుతున్నాయి. అపరిచిత, నేను ఓ నీటి బుడగ లాంటి వాహనం లో శరవేగంగా ప్రయాణిస్తున్నాము. నేను దేనినో ఆనుకుని కూర్చున్నట్టు ఉంది, కాని సోఫాలాంటిదేమీ కనపడటం లేదు. ఎటు వైపు వాలినా మెత్తగా, హాయిగా శరీరానికి ఏదో తగిలి అడ్డుకుంటున్నది. పూర్తిగా వాలిపోయి చూసాను, ఏదో అదృశ్య పడక మీద పడుకున్నట్టనిపించింది. లగ్జరీ రిక్రియేషన్ వెహికిల్ లో కూర్చుని గాలిలో వేగంగా ముందుకు వెళ్ళుతున్నట్లుంది. కానీ ఆర్.వి. కనపడటం లేదు. ఉన్నది ఓ బుడగలోనే.
అభికాంక్ష
మణి వడ్లమాని
పుస్తకం మధ్యలో భద్రంగా మడత పెట్టిన ఆ రెండు పేజీలు చదివాకా అనిపించింది. మనసులో దాగిన విషయాన్ని రాసుకున్న ఆ రెండు కళ్ళకి తెలియదేమో మరో జత కళ్ళు ఇలా చదివేస్తాయని.
తప్పని తెలుసు కానీ కుతూహలం శషభిషల హద్దులు చెరిపేసింది.
“రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః” శ్లోకం లీలగా మైథిలీ చెవిలో వినిపిస్తోంది.
అది ఆమెకి బాగా పరిచయం ఉన్న గొంతు.
నవరాత్రి - 2
గిరిజా హరి కరణం
రామప్ప అప్పుడే తీసుకొచ్చిన తమలపాకులు తీసుకుని గోటితో గిల్లి మధ్యలో నయాపైసంత రంధ్రం చేశారాయన, వాటికి ప్రమిదలోని ఆముదం రాసి, ఒక్కొక్క ఆకూ రెండు చివరలా పట్టుకుని దీపం నల్లని పొగ వద్ద పెట్టారు, కొంత సేపటికి తమలపాకు వేడెక్కి కొంచం కమిలింది. దాన్ని మెల్లిగా అరచేతిలోవేసుకుని, మెల్లగాఅపర్ణ బొడ్డుచుట్టూ అమర్చారాయన.
అలా ఓ ఆకు చల్లారగానే మరోటి వేస్తూ పొట్ట నిమురుతూ, ఆమె తలపై చేయి వుంచి తగిలీ తగలకుండా సున్నితంగా చెంపలూ, భుజాలూ, గుండె, పొట్ట నిమురుతూ కాళ్ళూ చేతులూ మెల్లగా వత్తుతూ పక్కకు తిప్పి వీపు మీద రాస్తూ మెల్లని స్వరంతో యేదో లయబద్దంగా పలుకుతున్నారు మల్లప్పశాస్త్రి.
కాసేపటికి పాప నెమ్మదై నిద్రపోయింది. "యీ రోజంతా నిద్రపోకుండా విసిగించేసింది నాయనగారూ, మీచేతిలో యే మహిముందోగానీ చిటికెలో నిద్రపోయింది" అంటూ పాపనెత్తుకోబోయింది లలిత.
హీరోకి ఒక హీరోయిన్ - తమిళ మూలం: జయకాంతన్
అనువాదం: రంగన్ సుందరేశన్
రోజూవారి ఉదయం కాఫీ గ్లాసుతో అతని మంచం పక్కన నిలబడి భర్తని లేపినప్పుడు, ఇంతసేపూ హాయిగా నిద్రపోతున్న అతన్ని చూస్తే ఆమెకు ఒక విధమైన అపురూపం.
ఇంటిపనులన్నీ పూర్తిచేసి కొళాయిముందు నిలబడి ఎటువంటి ముడతలు లేని అతని దుస్తులని ఇంకొకసారి ఉతికినప్పుడు వాటిమధ్య తడిసిపోయిన ఒక సిగరెట్టు పేకెట్టు కనిపిస్తే చాలు, తన ఎదుట కనిపించని భర్తని గుర్తుచేసుకొని మధురం నవ్వుతుంది, అప్పుడు కూడా ఆమెకి ఎంత ఆహ్లాదం?
ప్రతీరోజూ భర్త ఆఫీసుకు బయలుదేరినప్పుడు అతనికి ఒక రుమాలు అందించి ఇంతకుముందు ఇచ్చిన రుమాలు ఏమైందని అడిగినప్పుడు అతను జడ్డిగా నవ్వుతాడే, అది చూసి మధురంకి ఒక విధమైన ఆనందం!