top of page

నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

కథా మధురాలు

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

తడి ఆరని  బంధం

మణి వడ్లమాని

ఉదయం తొమ్మిదిన్నర గంటలయింది.ప్రార్థన అయ్యి చాలాసేపు అయింది. క్లాసురూం లో పిల్లలంతా నిశబ్దంగా కూర్చొనిఉన్నారు. గేటు దగ్గర  స్కూల్ బంట్రోతు నించొని, బయట ఐస్ ఫ్రూట్ బండి అబ్బాయి తో మాట్లాడుతున్నాడు. తలవంచుకొని గబగబా అడుగులు వేస్తూ లోపలికి వెళుతున్న సీనుగాడిని చూసి, “ఏయి,ఆగు ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా?” అన్నాడు.

“తొమ్మిది అయింది”

“తొమ్మిది కాదు, తొమ్మిదిన్నర అయింది. ఇంత లేట్ గా వచ్చావు, అసలు నిన్ను స్కూల్ లోపలికి పంపకూడదు తెలుసా, రోజు సమయానికి వచ్చే  కుర్రాడివి, ఎప్పుడూ లేట్ రావని ఈవాళ ఒక్కరోజు లోపలికి  పంపుతున్నాను. రేపటి నుండి ఆలస్యంగా వస్తే బయటే నించోబెడతాను ఏంటి అర్ధమయిందా” అని గదమాయించాడు.

డెలివరీ

మానస చామర్తి

"వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా…" 

పెద్ద సౌండ్తో సెకండ్ ఫ్లోర్ కామన్ హాల్ మోగిపోతోంది. అప్పుడే మా వాళ్ళు  డేన్స్ ప్రాక్టీస్ మొదలెట్టేశారు.  డేస్కాలర్స్ అందరం క్లాసులు ఎగ్గొట్టి అక్కడికి వచ్చాం. కింద కాంటీన్‌లో మా లంచ్ బాక్స్ అక్కడి వాళ్ళకి ఇచ్చేసి,  అక్కడి ఆలూ మసాలా కూర, సాంబార్ తినేసి సుబ్బు రూం దగ్గర చేరాం. రూం అంతా రిన్ సబ్బు, సర్ఫు వాసన ఘాటుగా అల్లుకుపోయి ఉన్నాయి. సుబ్బు తలుపు బార్లా తీసి, బట్టలతో నిండిన బకెట్ ఒకటి తలుపు గాలికి పడిపోకుండా అడ్డు పెట్టింది.  తడి తువ్వాళ్ళూ, సరిగా మూయని పుస్తకాలూ, ఉండలు చుట్టిన దుప్పట్లూ, మేచింగ్ దొరక్క విసిరేసిన చున్నీలూ, అన్నిటింటినీ తోసుకుని, ఆ మంచం మీదే ఒక మూలగా సర్దుకుని కూర్చున్నాం.

ఓ మరపురాని ప్రయాణం

రాధికా కే బుక్కా

"అమ్మా, రెండు రోజులు సెలవలు వస్తున్నాయి, పుట్టపర్తి కి వెళ్దామా " అన్నాను నేను.

ఉద్యోగం లో చేరి ఆరు నెలలయింది. మాకు చిన్నప్పటి నించి అమ్మమ్మగారి ఇల్లు, నాయనమ్మ గారి ఇల్లు తెలియదు. మా అమ్మమ్మ గారు మా అమ్మ మూడో ఏడు లోనే ప్రసవసమయం లో గుర్రంవాతంవచ్చి చనిపోయారు. తండ్రి,  ఆడపిల్లని నేను పెంచలేను అని మా అమ్మని వారి అమ్మమ్మ వద్ద, పిన్నులు , పెద్దమ్మల వద్ద పెరగనిచ్చారు. మా అమ్మే ఎప్పుడూ తన పుట్టింట్లో తండ్రి, అన్నల వద్ద లేదు, ఇక మాకు అమ్మమ్మగారి ఇల్లు అసలే లేదు.  మా నాన్నగారు వాళ్ళింట్లో అందరికన్నా చిన్న. మా నాయనమ్మ గారు మా అమ్మా, నాన్నల పెళ్లి అయ్యాక వీరి వద్దే ఉండేవారు. నా చిన్నతనం లోనే ఆవిడా మరణించారు. నాన్న వైపు అన్నదమ్ములు ఉన్నా, అంతగా రాకపోకలు లేవు. అక్కాచెల్లెళ్లు వాళ్ళే వచ్చిపోతుండేవారు. దీంతో, మాకు వేరే ఊరు వెళ్ళటం సెలవలకి అనే సంగతే ఉండేది కాదు.

ఆకస్మిక తనిఖీ

డేగల అనితాసూరి

"ఏమయ్యా వెంకట్రావ్? ఉదయం పదింటికే ఆఫీసుకొచ్చి వాల్తావ్ కదా, కనీసం చాయ్ త్రాగటానికి క్యాంటీన్ వరకైనా వస్తావా? లేక బల్లిలా సీటుకే అంటుకు పోతావా?" అంటూ పలకరించాడు ప్రక్కసీటు గురునాధం.

అప్పటికి సమయం సాయంత్రం నాలుగవుతోంది. వెంకట్రావ్ రోజూ ఠంఛన్ గా ఐదింటికే అలారం పనిచేయకపోయినా అదేమీ పట్టించుకోకుండా నిద్రలేచి వండివార్చి ధర్మపత్ని చేతికిచ్చిన క్యారేజీ బ్యాగుతో ఏడున్నరకే ఇంట్లోంచి బయటపడి రెండు బస్సులు, ఒక షేరింగ్ ఆటో మారి పదింటికల్లా ఆఫీసులోని తన సీట్లోకొచ్చి పడ్తాడు.

చాలామంది అరగంట, పది నిమిషాల దూరంలో ఇళ్ళున్న వాళ్ళుకూడా వెంకట్రావ్ కంటే ముందుగా క్రమం తప్పకుండా రాలేక పోతుంటారు. అసలే హెవీ సీటేమో ఎప్పుడో ఒకసారి ఇలా ఏ గురునాధం, గురుమూర్తో వచ్చి కదిలిస్తే తప్ప ...

థేంక్యూ మామ్ (అనువాదం)

క్రిష్ణవేణి

భారీకాయం గల ఆ స్త్రీ చేసంచీలో- సుత్తీ, మేకులూ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. సంచీ పట్టీ పొడుగ్గా ఉండి, ఆమె భుజంమీద వేళ్ళాడుతోంది. రాత్రి ఇంచుమించు పదకొండు గంటలయింది. ఆమె వొంటరిగా నడుస్తున్నప్పుడు, ఒక కుర్రాడు ఆమె వెనుక పరిగెత్తి, ఆమె సంచీని లాక్కోడానికి ప్రయత్నించాడు. కుర్రాడు వెనుకనుంచి లాగిన మొదటిసారే, చేసంచీ పట్టీ తెగింది. కానీ, అతని బరువూ, చేసంచీ బరువూ కలిసి, కుర్రాడి బాలన్స్ కోల్పోయేలా చేశాయి. తను ఆశించినట్టుగా వెంటనే పారిపోలేకపోయి, అబ్బాయి పక్కబాటమీద వెల్లకిలా కింద పడ్డాడు. అతని కాళ్ళు పైకి లేచాయి. ఆ లావాటి స్త్రీ వెనక్కి తిరిగి, గురిచూసి నీలం జీన్స్ వేసుకుని ఉన్న అతని పిరుదుల మధ్య తన్ని, ఆ తరువాత కిందకి వంగి, కుర్రాడి చొక్కా ముందు భాగం పట్టుకుని పైకెత్తి, అతని పళ్ళు కదిలేలా అతన్ని కుదిలించింది.

bottom of page