top of page

సంపుటి 2  సంచిక 2

కథా మధురాలు

నిర్వహణ: మధు పెమ్మరాజు | దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

మలిసంధ్య పిలుస్తోంది

గంగాధర్ వీర్ల

పరిపూర్ణమైన సాయంత్రానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అది చెప్పడానికే అన్నట్టు పడమటి  దిక్కునుంచి విప్పారిన కళ్లతో శరీరాన్ని వేడిగా తాకుతున్న భానుడి కిరణా స్పర్ష. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఒళ్ళు విరుచుకుని పనికి సిద్ధమైనట్టుగా నాలుగు రోడ్ల కూడలిలో జన సందడి. 

పగటి పూట  పనిభారం నుంచి విముక్తి పొంది ఎప్పుడెప్పుడు ఇంటికి చేరదామా? అని రోడ్డుపైకొచ్చిన వారికి ఆసరాగా బస్సు రణగొణ ధ్వనులు జోరందుకున్నాయి.  

ఆధునిక జీవితానికి ప్రతిబింబంగా ఓ పక్కగా కాఫీషాప్‌. పగటిపూటకు వీడ్కోలు చెప్పడానికి. ముందస్తుగానే రంగు రంగు దీపాలతో కాంతులీనుతోంది. అప్పుడే నిద్ర లేచి, అందంగా ముస్తాబై కబుర్ల సాయంత్రానికి స్వాగతం పలికినట్టుగా యువతీయువకుల కోలాహలం.

జ్యోత్స్న

సత్యవతి దినవహి

Satyavathi Dinavahi

రాజీవ్  రమణిలది ప్రేమ వివాహం. ఇరువురి  జీవితంలో  చాలాకాలం తరువాత వెలుగులు వెదజల్లుతూ  కూతురు  జ్యోత్స్న,   మరో మూడు సంవత్సరాల తరువాత ఒక కొడుకు  వరుణ్ . రాజీవ్ దంపతులకు పిల్లలే  పంచ ప్రాణాలు. రాజీవ్ ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజరు. రమణి గణిత శాస్త్రంలో ఉపాధ్యాయిని. పిల్లలతో ఇంటా బయటా నిర్వహించుకోవడం కష్టంగా అనిపించి ఈ మధ్యనే  ఉద్యోగవిరమణ చేసింది. ప్రస్తుతం పూర్తి సమయం గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది .

హాలులో జ్యోత్స్న వరుణ్ ని ఆడిస్తుంటే చూసి ఆనందిస్తున్న రమణి  పిల్లలిద్దరికీ పాలు కలిపి తెద్దామని  వంటగదిలోకి వెళ్లింది. కొంతసేపటికే  జ్యోత్స్న పరిగెట్టుకుంటూ  వచ్చి “అమ్మా! తమ్ముడు పడిపోయాడు, ఏడుస్తున్నాడు.” అంది  చేస్తున్న పని వదిలేసి గబగబా వెళ్ళి చూసిన రమణికి వరుణ్ మోచేయి గీరుకుపోయి కొంచంగా రక్తం కారుతుండటం గమనించి వెంటనే గాయం శుభ్రం చేసి  మందు రాసింది .

ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది......???

శ్రీమతి పి.వి.శేషారత్నం

Satyavathi Dinavahi

వంటింట్లోంచి వసంత 'సూరజ్‌ రడీయేనా? త్వరగా తెములు. ఇవాళ మీటింగుంది.'అని కేకేసేసరికి 'బాప్‌రే టైమయిపోయింది...' అనుకుంటూ సూరజ్‌ వాష్‌రూంకి పరిగెత్తాడు. తర్వాత వాళ్లిద్దరూ హడావుడిగా తయారయి టిఫినయినా తినకుండా వెళ్లబోతూ అత్తగారిముఖం చూసి వసంత 'బాధపడకండత్తయ్యా ... బస్‌లో తింటాంలెండి.' అని టిఫిను డబ్బాలు చేత్తోనే పట్టుకుని సూరజ్‌ వెనకే కారెక్కింది.

'వసంత మంచి పిల్ల...పగలూరాత్రీ ఆఫీసుపని చేస్తూనే ఉన్నా మళ్లీ వంటింట్లో ఉన్న కాసేపట్లోనే సరదాగా కబుర్లు చెబుతూ 'ఇంకా 'సూరజ్‌కి ఇష్టమైన వంటకాలన్నీ నాకు నేర్పించండత్తయ్యా! నేనేం చేసినా 'మా అమ్మ చేసినట్టు లేదు' అంటూ మిమ్మల్ని రోజూ తలుస్తూనే ఉంటాడు.'అంటూ చకచకా చెప్పినవి చెప్పినట్టు చురుగ్గా చేసేస్తుంది.

నో రిటైర్మెంట్ ప్లీజ్...

జయంతి ప్రకాశ శర్మ

Satyavathi Dinavahi

"చదువుకున్నావుగా..ఎదైనా ఉద్యోగం చేస్తే మంచిది తల్లీ! అంటూ మా నాన్న ఎప్పుడూ అనేవారు.” ఉదయాన్నే వంటింట్లోంచి మాటలు గట్టిగా వినబడుతుంటే, రాఘవయ్య పేపర్లో బుర్ర పెట్టి, చెవులు ఆ మాటలమీదకు వదిలేసాడు.

“మా అమ్మమాత్రం ఊరుకునేది కాదు. ‘మీరు అలా దాని వెనకపడతారనే.. ఆ ఎలిమెంటరీ చదువు చాలని మొత్తుకున్నాను. ఆ చదువైన తరవాత ఉద్యోగం అంటారు. తనకంటే పెద్ద ఉద్యోగం చేస్తున్న మొగుడు కావాలంటారు!  తర్వాత  ఇద్దరు  సంపాదనలో పడిపోతారు.   ఇక  జీవితం పులిస్వారి అయిపోతుంది!  అసలు కష్టాలు అప్పుడే మొదలవుతాయి!!  పిల్లలు పుట్టిన తర్వాత ఆలన, పాలనా సమస్య అయిపోతుంది. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ఉండవలసిన బంధం 

తెరమరుగు

వి. వాణి మోహన్

vani mohan

తెరలో --

ప్రభు వెంట నీడ లాగ ఉండే నేను జోరా. అసలు పేరు జోగారావు. జంటగా మసిలే మేము వేరు, వేరు దారుల వెంట భవిషత్తు వెదుక్కుంటూ వెళ్ళాము. ప్రభు సినిమాలు. నేను యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. స్నేహలత ని పోషించుకున్నాం. రోజుల తరబడి ప్రభు షూటింగులు అంటూ తిరుగుతున్నా, నేను మాత్రం అమ్మదగ్గరే ఉండి పోయాను. ప్రభు సినిమా భవిషత్తు కోసం అమ్మపడే తాపత్రయం చూస్తే నాకు విస్మయంగా, ఆరాధనగా వుండేది. నా మనసులో మసకబారిన నా అమ్మ చోటు ఈ అమ్మతో నిండిపోయింది, ఎప్పుడు?? నాకు తెలియదు.

  Z

మధు చిత్తర్వు

vani mohan

తెర తొలగించి కిటికిలోంచి చూస్తే దూరంగా కొండల మీద నుంచి లోయలోకి వ్యాపించిన చెట్ల మీదా, పొదల మీదా అస్పష్టంగా పరదా కప్పినట్లు బూడిదరంగులో వెన్నెల. తెల్లటి మేలిముసుగులా పొగమంచు పొర.

కనుచూపు మేర ఏమీ కదలిక లేదు. చీకటీ వెన్నెలా - మంచుతో తడిసిన చెట్లని ఆకుపచ్చని బూడిదరంగులోకి మార్చేశాయి. నల్లమబ్బు తునకలు నిండిన ఆకాశంలో పడమటి మూల అర్ధ చంద్రుడు పేలవంగా వెలుగుతున్నాడు.

"ఠక్" "ఠక్" "ష్ ష్... హ! హ!" అడుగుల చప్పుడు. ఎండుటాకుల నిండిన రాళ్ళమీద... ఏదో జంతువు ఊపిరిలాగా...!

ఇప్పుడు పూర్తిగా మెలకువ వచ్చి మెదడు చైతన్యవంతమైంది.

bottom of page