MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
దసరా దీపావళి ఉత్తమ
రచనల పోటీ విజేతలు.
మధురవాణి.కాం అంతర్జాల పత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దసరా-దీపావళి కథల పోటీకి వందల సంఖ్యలో రచనలని పంపిన రచయితలందరికీ పేరు పేరునా ధన్యవాదములు. తెలుగులో సృజనాత్మక రచనకు పట్టం కడుతున్న సాహిత్యాభిలాషులకి కొదువ లేదన్న సత్యాన్ని ఈ విశేష స్పందన నిరూపిస్తుంది. అన్ని రచనలనీ పరిశీలించి, ఉత్తమ కథలు, ఉత్తమ కవితలు, ఉత్తమ వ్యాసాలతో పాటు కొన్ని ఎన్నదగిన రచనలకి ప్రశంసా బహుమతులు ప్రకటిస్తున్నాము.
దసరా దీపావళి ఉత్తమ రచనల పోటీ!
MADHURAVANI TELUGU MAGAZINE మధురవాణి
మా వాణి ...
నమస్కారం! మధురవాణి.కాం రచనలపోటీకి విశేషంగా స్పందించి వందలాదిగా రచనలని పంపిన రచయితలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు!
తొలి ఉదయపు వేళల్లో బాల భానుని లేత నులివెచ్చని కిరణాలకు మల్లే ఆహ్లాదాన్ని కలిగించే రచనలని పంపిన వారు కొందరయితే...మెలమెల్లగా తీక్షణతని సంతరించుకుంటూ మధ్యాహ్నవేళకల్లా ఉద్ధృతమయ్యే ప్రచండభానుడి ప్రకాశంలోని తీవ్రతలా ఆలోచనలని రేకెత్తించే రచనలు పంపినవారు మరికొందరు! సాయంత్రానికల్లా కెంజాయరంగులోకి మారిన ఆదిత్యుడు అనంత ఆకాశానికి అద్దిన సాత్విక వర్ణాలన్నీ కలబోసుకున్న అన్ని రకాల రచనలనీ చూసాక... తెలుగు సాహిత్యం అక్షయం అనే సత్యం అనుభవంలోకి వచ్చింది...
అవును! తెలుగు సాహిత్యం- అక్షయం... అమేయం... అజేయం... అంతకన్నా అపురూపం!
మధురవాణి నిర్వాహక బృందం
నా డైరీల్లో కొన్ని పేజీలు.
హుండీ -ఆర్. దమయంతి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ
గుడి మెట్ల మీద నిశ్శబ్దంగా కూర్చుని, ఆలయ ప్రాంగణాన్ని పరికించి చూస్తున్నాడు నీలకంఠం.
రావి చెట్టు చుట్టూ - దీపాలు వెలిగించి వదిలేసిన ప్రమిదలు ఎడా పెడా పడున్నాయి. చెట్టుకల్లా ఆన్చి దీపాలు పెట్టొద్దంటే వినరు. వాళ్ళ మూఢ భక్తికి వృక్ష కాండం మాడి నల్ల బొగ్గౌతోంది. దాని పక్కనే కొత్తగా నాటిన మూడడుగుల ..
వంగూరి పి.పా.
సాహిత్యమూ- చందాలూ
అదేమిటో తెలియదు కానీ, నా జాతకంలో కొన్ని ఫోన్ కాల్స్ ఎప్పుడు రాకూడదో అప్పుడే వస్తాయి. అదిగో అలాంటిదే మొన్న నాకు బాగా దగ్గర అయిన సో ప్రా. స్నే నుంచి వచ్చిన ఫోన్. ఉన్న మాట చెప్పొద్దూ, నా విషయంలో మటుకు దగ్గర స్నేహితులకీ, దగ్గర బంధువులకీ ఒక గొప్ప స్వారూప్యత ఉంది. అనగా, నేను ఆనందంగా చేసుకుంటున్న పనులు అన్నీ శుద్ద వేస్ట్ అని వాళ్ళు ఫీల్ అయిపోతూ, అసలు పట్టించుకోరు...అనగా నేను తెలుగు సాహిత్యం గురించి ...
ఎపిసోడ్ నంబర్ 876 ~రాజేష్ యాళ్ళ
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కథలపోటీ లో బహుమతి సాధించిన కథ
"కొంచెం కాఫీ ఇస్తావా సీతాలూ?!" అలసటగా సోఫాలో కూర్చుంటూ భార్యను అడిగాడు రామారావ్!కనుచివరలనుండే రామారావ్ వైపు కోపంగా చూసింది సీతాలు. 'రెప్ప కూడా ఆర్పకుండా నేను "ఈ యుగం ఇల్లాలు" సీరియల్ చూస్తోంటే మధ్యలో నీ గోలేంటీ' అన్నట్టుగా ఉందామె క్రీగంటి కోపం!మళ్ళీ రెట్టించకుండా ప్రకటనల విరామం వరకూ ఓపిగ్గా....
మేనిక్విన్ (Mannequin) ~మణి వడ్లమాని
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ
అది నగరం లో మహా రద్దీగా ఉండే ప్రాంతం. ఆ రోడ్డు మొత్తం పెద్ద పెద్ద బట్టల షాప్ లు హోటల్స్ ఉండటంతో రోజంతా హడావుడి గానే ఉంటుంది. వచ్చే పోయే బస్సులు, కార్లు, ఆటొలు, మోటారుసైకిళ్ళు తో మోతెత్తి పోతూంటూంది. క్రమంగా పొద్దు గడచి రాత్రి కావటం తో నెమ్మదినెమ్మదిగా నిశబ్ధం కొండచిలువలా ఆక్రమించుకుంటోంది...
గో'కులము నవ్విందీ...
-దీప్తి పెండ్యాల
సాహిత్యంలో పర్యావరణ స్పృహ... -డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
ఆధునిక ప్రపంచంలో అనేక రంగాల్లో మార్పులు కలిగినట్లుగా పర్యావరణంలో కూడా అనేక పరిణామాలు సంభవించాయి. ఆధునిక యుగం యాంత్రిక యుగం కావడంతో పర్యావరణం కలుషితమైంది. సృష్టిలోని అనంత ప్రాణకోటిలో బుద్ధిజీవి మానవుడు. మితిమీరిన స్వార్థంతో మానవుడు ప్రకృతిని వికృతిగా జేస్తూ...
చంద్రబాబు- మబ్బుల్లో మతాబు!
మరి పేలేనా?
CBN Progress Report
పాప కోసం ~భవానీ ఫణి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కథలపోటీ లో బహుమతి సాధించిన కథ
దూరంగా హెడ్ లైట్ల వెలుగు కనిపించడంతో రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుంది కల్పన. కానీ, వెనువెంటనే ఆమె మనసులోకి ఓ సందేహం ప్రవేశించింది. ఒకవేళ అదే నిజమైతే ఎంత ప్రమాదమోననుకుంటూ అటూ ఇటూ చూసేసరికి పక్కనే గుబురుగా ఉన్న పొదలు కనిపించాయి .
ప్రాచీన కావ్యాలు – వ్యాఖ్యానాలు – విశేషాలు. -జడా సుబ్బారావు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
తెలుగుసాహిత్యంలో వ్యాఖ్యాన సంప్రదాయానికి ఒక ప్రత్యేకత ఉంది. కేవలం కఠిన పదాలకు మాత్రమే అర్థాన్నివ్వడం కాకుండా వాటిలో ఉండే వ్యాకరణాంశాలు వివరించడం కూడా వ్యాఖ్యానంలో భాగంగానే ఉంది. కావ్యంలోని అందచందాలను, చమత్కారాలను తెలియజేస్తూ కవి హృదయాన్ని ఆవిష్కరించడంలో ...
నన్నయ కవిత్వంలో సామాజిక సందేశం ~హరిత భట్లపెనుమర్తి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
వ్యాస పోటీ లో బహుమతి సాధించిన వ్యాసం
ప్రాచీన సాహిత్యం మాటెత్తడమే అభివృద్ధికి నిరోధకంగా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం వాడైన నన్నయ రచనలో సామాజిక సందేశం వెతకబూనటం సాహసాస్పదమే! ...