top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మా వాణి ...

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర మరియు సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు.

ఈ సంచికతో madhuravani.com పత్రిక  మూడు నిండి నాలుగో ఏట అడుగుపెడుతోంది.  ముచ్చటైన ఈ మూడేళ్ళ పండగ కి మూడు ముఖ్య కారణాలు.  మొదటిది ప్రతీ సంచికకీ పెరుగుతున్న పాఠకుల ఆదరణ. రెండవది తమ రచనలను మాకు ఉత్సాహంగా అందిస్తున్న రచయితలు. ఈ రెండూ ప్రపంచవ్యాప్త స్పందన అయితే అమెరికా వాసులైన మా నిర్వాహక బృందం యొక్క ఆసక్తి, కృషి మూడో ముఖ్యమైన కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులకి  ఉత్తమ సాహిత్యాన్ని అందించాలి అనే ఆశయంతో మూడేళ్ళ క్రితం ఉత్సాహంగా మొదలుపెట్టిన మా బృందంలో ఒకరు అనివార్య కారణాల వలన విరామం కోరటంతో, గత సంవత్సరం నుండీ  సుప్రసిద్ధ రచయిత విన్నకోట రవి శంకర్ తమ సేవలు అందిస్తున్నారు.

మూడవ వార్షికోత్సవం సందర్భంగా మీ (మన) madhuravani.com మరింత పురోగమించడానికి పాఠకుల నుంచీ, రచయితల నుంచీ సూచనలు ఆహ్వానిస్తున్నాం. వాటిల్లో ఆచరణ యోగమైన సూచనలని అమలు పరచి మధురవాణిని మీ అందరూ ఆశిస్తున్న సాహిత్యాంశాలతో మరింత ఆకర్షణీయంగా రూపొందించడానికి ప్రయత్నిస్తాం.

ఇక తెలుగు నాట రాజకేయాలు ఎప్పటి లాగానే ఆసక్తి కరంగా ఉన్నాయి. ఇటీవల ఎన్నికలలో తెలంగాణా లో శ్రీ కె. చంద్రశేఖర రావు గారు భారీ విజయాన్ని సాధించడం తెలుగు సాహిత్యాభిమానులకి సంతోషకరమైన వార్త.  ఆయన స్వయానా "భాషా"భిమాని అవడమే కాకుండా రాష్ట్రంలో తెలుగు బోధనకి, వ్యాప్తికి ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకోవటమే ఆ ఆనందానికి కారణం.

ఇక మరో కొద్ది నెలలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారం లోకి  వస్తుంది. రాబోయే ప్రభుత్వం  ఏదయిననూ, భాషా పరంగా పరిపూర్ణత సంతరించుకుని రంగు రంగుల సీతా కోక చిలుక లాగా అన్ని చోట్లా ఆనందాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము.

ఏది ఏమైతేనేం....మా (మన) మధురవాణి ని అభిమానిస్తూ, ఆదరిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా మన:పూర్వక ధన్య వాదాలు. మరొక్క సారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

మధురవాణి నిర్వాహక బృందం

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి

mv_jan_2019_cover_WM.PNG
ratham color.PNG
bottom of page