MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
దసరా - దీపావళి సందర్భంగా... రచనల పోటీ
దసరా -దీపావళి సందర్భంగా.. Madhuravani.com నిర్వహించే మొట్టమొదటి ఉత్తమ రచనల పోటీ
రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: సెప్టెంబర్ 1, 2016
Last Date to receive entries is: September 1, 2016
Please send entries by e-mail attachments only in Unicode Fonts.
Contact sahityam@madhuravani.com for any further details.
ఇటీవలి సంక్రాంతి సంచికతో (జనవరి, 2016) శుభారంభం చేసి మలి సంచిక అయిన ఉగాది (2016) పత్రికతో అచిరకాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన స్థాయిలో తెలుగు పాఠకుల అభిమానాన్ని పొందిన అంతర్జాల త్రైమాసిక సాహిత్య ప్రధానమైన పత్రిక- madhuravani.com. ఆ స్పందనని అంది పుచ్చుకుని అనుభవజ్ఞులు, ఔత్సాహిక, నూతన అంతర్గత రచయితల సృజనాత్మకతని మరింత ప్రస్ఫుటంగా గుర్తిండానికీ, తెలుగు సంస్కృతికి వెన్నెముక అయిన నూతన సాహిత్య సృష్టికి మా వంతు దోహదం చెయ్యడానికీ ఉత్తమ రచనల పోటీ తలపెడుతున్నాము.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.
కథా మధురాలు
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $50
పది సమాన బహుమతులు: ఒక్కొక్కటీ: $25
పంపవలిసిన చిరునామా
కవితా వాణి
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $50
పది సమాన బహుమతులు: ఒక్కొక్కటీ: $25
పంపవలిసిన చిరునామా
వ్యాస మధురాలు
తెలుగు భాషా, సాహిత్య పరిశోధనా వ్యాసాలు
(కళాశాల, విశ్వ విద్యాలయ ఆచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకి మాత్రమే)
మూడు సమాన బహుమతులు ఒక్కొక్కటీ: $50
పంపవలిసిన చిరునామా
[or]
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
-
ఒక రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ కేవలం రెండు ఎంట్రీలు మాత్రమే పంపించవచ్చును.
-
రచనలు కేవలం యూనికోడ్ (వర్డ్) లో మాత్రమే ఆమోదించబడతాయి. PDF, JPEG, వ్రాత ప్రతులు మొదలైన ఇతర పద్దతులలో పంపించిన రచనలు పరిశీలించబడవు.
-
ఇ-మెయిల్ లో సబ్జెక్ట్ లైన్ గా, కథయితే... "కథల పోటీకై- <మీ కథ పేరు>" , కవితయితే..."కవితల పోటీకై- <మీ కవిత పేరు>"
వ్యాసమయితే..."వ్యాసం పోటీకై - < మీ వ్యాసం పేరు>" విధిగా ఉంచగలరు.
-
-
తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
-
తమ రచనతో పాటు ఈ క్రింది అంశాలు స్పష్టీకరిస్తున్న హామీ పత్రం విధిగా జతపరచాలి. లేని పక్షంలో ఆ రచన పోటీకి పరిశీలించబడదు.
-
రచయిత చిరునామా, పది వాక్యాలలోపుగా స్వీయ పరిచయం, పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఫోన్ నెంబర్.
-
ఈ రచన స్వంత బ్లాగ్ లతో సహా ఎక్కడా ప్రచురించబడని అముద్రిత స్వీయ రచన అనీ, ఇంకెక్కడా ప్రచురణకి కానీ, పోటీకి కానీ పరిశీలనలో లేదు అనీ ధృవీకరణ.
-
భాషా, సాహిత్య పరిశోధనా వ్యాస మధురాల విభాగాల లో పాల్గొనే వారు తమ విశ్వవిద్యాలయ వివరాలను జత పరచాలి.
-
బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు madhuravani.com లో మాత్రమే, సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడే సర్వ హక్కులూ మావే. మధురవాణి.కాం లో ఎంపిక అయిన రచనల ప్రచురణ అనంతరం సర్వ హక్కులూ వారికే చెందుతాయి. ప్రచురణకి ఎంపిక కాని రచనల మీద సర్వ హక్కులూ రచయితలవే.
-
విజేతల వివరాలు అక్టోబర్ (2016) లో విడుదల అయ్యే దసరా- దీపావళి మధురవాణి సంచికలో కానీ, అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి.
-
విజేతలయిన రచనలు, ప్రచురణకి ఎంపిక అయిన ఇతర రచనలూ ఏ madhuravani.com సంచిక లో అయినా ప్రచురించబడవచ్సును.
విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ప్రచురణ, ఇతర విషయాలలో మధురవాణి నిర్వాహకులదే తుది నిర్ణయం.
అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఇ-మెయిల్ sahityam@madhuravani.com.
భవదీయులు
చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుదేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల | వంగూరి చిట్టెన్ రాజు
****