MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
2016 మధురవాణి ఉగాది సంచికలో ఈసారి పరిచయం చేసే పుస్తకాలు వంగూరి ఫౌండేషన్ వారు 2016 లో ప్రచురించిన మూడూ ఆణిముత్యాలు. వారి యాభై తొమ్మిదో ప్రచురణ వెంపటి హేమ గారి రాసిన 'కలికి కథలు’ అయితే, షష్ఠి పూర్తి 'అసమాన అనసూయ - నాగురించి నేను' తో వింజమూరి అనసూయాదేవి గారి ఆత్మకథతో ఎంతో సంతృప్తిగా చేసుకున్నారు. అరవై ఒకటో ప్రచురణ శ్యామలా దశిక గారు రాసిన 'అమెరికా ఇల్లాలి ముచ్చట్లు-2'. మూడూ వైవిధ్యం వున్న మూడు రకాల పుస్తకాలు. అమెరికా రచయితలను, రచయిత్రులను ప్రోత్సహిస్తూ కేవలం సాహిత్యాభివృద్ధి మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి పుస్తకాల్ని ప్రతి సంవత్సరం విడవకుండా ప్రచురిస్తున్న వంగూరి ఫౌండేషన్ వారి కృషిని తప్పక అభినందించవలసిందే.
మహాదేవివర్మ గీతాలు
అసమాన అనసూయ (నా గురించి నేనే)
శాయి రాచకొండ
అసమాన అనసూయ (నా గురించి నేనే) - అనసూయ గారి ఆత్మ కథ ఇది. కేవలం ఆత్మకథ క్రింద పరిగణిస్తే పుస్తకానికున్న విలువను పూర్తిగా తగ్గించేసినట్లే. ఇది కేవలం ఒక అహంభావి జీవిత చరిత్ర కాదు (పుస్తకం పేరుని మాత్రం చూసి అనుకుంటే). ఏదో సాధారణమైన మనిషి గొప్పలు చెప్పుకోడానికి రాసిన కథ కాదిది. ఇది, - ఆకాశమంత ఎత్తులో నూరేళ్ళ జీవితాన్ని నిండుగా అనుభవించిన ఒక మనిషి జీవితంలో చూసిన ఎవరెస్టు శిఖరాలూ, సాగరపు లోతులూ....
విజయనగరం వెళ్ళినప్పుడు చాగంటి తులసి గారిని కలిసే అవకాశం కలిగించాడు శ్యాం. ఆవిడ నాకు ఇచ్చిన పుస్తకాల్లో ఒకటి 'మహా కవయిత్రి మహాదేవివర్మ గీతాలు'. ఇవి మహాదేవివర్మ గారు హిందీ లో రాసిన కవితలకి తులసి గారు చేసిన అనువాదాలు. తులసి గారు అటు తెలుగు నించి హిందీకి, హిందీ నించి తెలుగులోనికి కూడా ఎన్నో తర్జుమా చేసారు. ఒక భాషలో వ్యక్త పరచిన భావాలు నలుగురూ పంచుకోగలిగి, వివిధ భాషల ప్రజల మధ్య అవగాహన పెంచగలిగే అవకాశం ఈ అనువాద గ్రంధాలు మాత్రమే ఇవ్వగలవు. అలాంటి సదుద్దేశంతో ఆవిడ అలుపులేకుండా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.
కలికి కథలు
శాయి రాచకొండ
కలికి కథలు వెంపటి హేమ గారు రాసిన యాభై పైచిలుకు కథల సమగ్ర సంపుటి. అచ్చంగా ఆరువందల యాభై పేజీల గ్రంధం. తెన్నేటి సుధాదేవి గారు ముందు మాట రాస్తూ, 'అనేకానేక జీవితాల స్థితిగతులు, మనం రోజూ చుట్టూ చూస్తున్న సంఘటనలు, ఆలోచనలు రేకెత్తించే వివిధ రకాల మనస్తత్వాలు - ఇన్నింటిని కలబోసి, చక్కని భాషలో, అందమైన శిల్పంలా ఒక్కో కథను తీర్చి దిద్దారు వెంపటి హేమ గారు' అని అంటారు. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజం.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు
శాయి రాచకొండ
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు శ్యామలాదేవి దశిక గారు రాసిన రెండవ సంకలనమిది. మొదటి సంపుటి 2010 లో వంగూరివారి నలభై ఒకటవ ప్రచురణగా వచ్చింది. గత నాలుగయిదు సంవత్సరాలలో సుజనరంజని, ఈమాట, తెలుగుజ్యోతి, కౌముది మొదలగు పత్రికలలో మొదటగా అచ్చు వేయబడిన కథలు - అవే కథల్లాంటి ముచ్చట్లు ఈ సంపుటిలో చేరుకున్నాయి. అమెరికాలో సగటు ప్రవాసాంధ్రుల జీవితాల్లో దొర్లే అవకతవకల్ని సున్నితంగా,
సంక్షిప్త పరిచయాలు
‘సంక్షిప్త పరిచయాలు’ శీర్షికలో గత రెండు మూడు నెలలలో వెలువరించిన పుస్తకాలని మాకు అందిన సమాచారం ప్రకారం పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాము. రచయితలు/ రచయిత్రులు పుస్తకపు ముఖచిత్రంతో పాటు టూకీగా మరిన్ని వివరాలు తెలిపితే, ఈ శీర్షికలో ఆయా పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేయగలము.
తలరాతలు
శాయి రాచకొండ
ఇది 16 కథలున్న ఒక సంపుటం. ముసురు, బామ్మగారి బస్సుప్రయాణం, పుత్రుడు పున్నామనరకం, ఆకలి, అమ్మానాన్న ప్రేమ, అంతిమఘట్టం, తీరం చేరిన కెరటాలు, చింత చచ్చినా పులుపు చావలేదు, తలరాతలు, నువ్వు నవ్వితే వాకిట్లో వెన్నెల వాన కురిసినట్లుండేది, జ్ఞాపకాలు, సహజీవనం, హాచ్ హాచ్ హాచ్, వృద్ధాప్యపు చివరి మజిలీ, తాతయ్య నేర్పిన తెలుగు పద్యం, అబ్బాయి+అమ్మాయి = పరివర్తన - ఇవీ కథలు...
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మీరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడం, పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేసే సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక రాబోయే సంచిక (జులై, 2016) నుండి ప్రారంభం అవుతుంది. అందులో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు ఏప్రిల్, మే, జూన్ (2016) మాత్రమే ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు జూన్ 30, 2016 లోపుగా పంపించవచ్చును.
పంపించవలసిన చిరునామా
‘పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.