MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
ఆహ్వానిత మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | దీప్తి పెండ్యాల
నా డైరీల్లో కొన్ని పేజీలు...
గొల్లపూడి మారుతీ రావు
1971 జనవరి 10: ఎన్. టీ. ఆర్ పుండరీకాక్షయ్యగారితో అన్నారట: మారుతీరావుగారు ఏక్షన్ సబ్జెక్ట్ అంతబాగా చెప్తారనుకోలేదు-అని. "మధ్యాహ్నం అవుట్ డోర్ షూటింగ్ దగ్గరికి రాకూడదా? తీరికగా మాట్లాడుకుందాం" -అన్నారు ఎన్.టీ.ఆర్.
అక్కినేనికీ, ఎన్.టీ. ఆర్ కీ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న రోజులు. కారణాలు అనవసరం. ఇద్దరూ రెండు మేరుశృంగాలు. క్రమశిక్షణకీ, అకుంఠితమైన కార్యదక్షతకీ పెట్టింది పేరు.
రాయపేటలో పాత ఉడ్ లాండ్స్ హోటల్లో కూర్చుని పూర్ణచంద్రరావుగారికి అక్కినేనితో తీయవలిసిన
రిటైర్మెంట్
శ్యామలాదేవి దశిక
ఇదిగో మిమ్మల్నే! ఎన్ని సార్లు పిలవాలి......చేసినవన్నీ చల్లారిపోతున్నాయంటే వినిపించుకోరేం!
ఏమన్నా అంటే “ ఇదిగో... వచ్చేస్తున్నా... వన్ మినిట్ ” అంటారు. కానీ .... ఆ కుర్చీ లోంచి మాత్రం కదలరు.
ఏమిటీ...నిన్నా మొన్నటి ఖర్చులు ఎందుకు ఎంటర్ చెయ్యలేదు అంటారా?
చెయ్యి తీరుబడి లేక చెయ్యలేదు. గుర్తుంది లేండి. ముందు మీరు భోజనానికి రండి.
కిందటి నెల కంటే ఈ నెల ఖర్చు బాగా పెరిగిందా... ముందు ఆ రిసీట్లు ఇవ్వమంటారా?
కొత్త కోణం
పొత్తూరి విజయ లక్ష్మి
ఈ మధ్య ఓ అసిస్టెంటు పెట్టుకున్నా. స్పాండిలైటిస్ కొత్తగా వచ్చింది. అది వరకులాగా చేత్తో కధలూ కాకరకాయలూ కవితలూ గట్రా రాయటం శ్రమ అయిపోతోంది . నడుము నెప్పి వుండనే వుంది. పోనీ చచ్చీ చెడీ రాసినా అవి ఎవరూ అంగీకరించటం లేదు. అందరూ ఫలానా ఫాంట్ లో టైపు చేసి సాఫ్ట్ కాపీ పంపించండి అంటున్నారు . నేను టైపు చేస్తే అప్పంభోట్ల పందిరిలాగా అన్నీ తప్పులే. ఇలా లాభం లేదని ఓ పిల్లని పెట్టుకున్నా. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి నేను చెప్తుంటే టైపు చేసి పెడుతుంది. ఆ అమ్మాయి పేరు సుధ.
దండేషు మాతా!
డా. మంథా భానుమతి
“సంధ్యా… సంధ్యా! ఇంకా అవలేదా…” గట్టిగా పిలుస్తూ, జేబులో దువ్వెనతో తల దువ్వుకుంటూ ఇంట్లోకి వచ్చాడు వివేక్. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి అద్దంలో మొహం చూసుకుని, చొక్కా కాలర్ సవరించుకున్నాడు.
“వస్తున్నా… ఒక్క నిముషం.” లోపల్నుంచి సమాధానమిచ్చింది సంధ్య.
“త్వరగా సంధ్యా! అందరూ వచ్చేశార్ట. ఇప్పటికే పది ఫోన్లొచ్చాయి.
“వచ్చేశా...” విరబోసుకున్న జుట్టు వెనక్కి విదిలిస్తూ వచ్చింది సంధ్య. అలా జుట్టు వెనక్కి విదిల్చినప్పుడు,
నూరేళ్ల సాధారణ సాపేక్షతా సిద్ధాంతం
అనిల్ ఎస్. రాయల్
అనాదిగా మానవుడు లోకాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొదట్లో దానికి సరైన దారేదో తెలీక తికమకపడ్డాడు. కళ్లకి కనబడేదే నిజమనుకున్నాడు. కనబడని శక్తుల్ని మహిమలుగా పొరబడ్డాడు, దేవుళ్లని సృష్టించాడు. అప్పట్లో అతని ప్రపంచం చిన్నది. కాలగమనంలో అతను ఎదిగాడు. లోకాన్ని లోతుగా చూడటానికో అద్భుత ప్రక్రియ కనుగొన్నాడు. అదే సైన్స్. దాని ఊతంతో అతని విశ్వం విస్తరించింది. మహిమల వెనకున్న మర్మం బోధపడింది...