top of page

'అలనాటి' మధురాలు

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

స్వర్గీయ చాగంటి సోమయాజులు (చాసో)  (1915-1994)​

చాసో గారి 101 జయంతి సంవత్సరం సందర్భంగా... 

ధర్మక్షేత్రము

నారాయణుడే నరునకు 
సారధి అయినాడు !

పుడమిని పాడిస్తూ
తారలనాడిస్తూ
నారాయణ చక్రము
నదిలో నాదము లాగను

చాసో కవితల చారిమం

చాసో కవితలు -  గ్రంధ సమీక్ష

శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 

Cha So, చాసో

మా అవ్వతో వేగలేం…  తిరునాళ్ళలో తప్పిపోయింది

స్వర్గీయ దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి​

మా అవ్వ నెరగరూ మీరూ, అవ్వని? హయ్యొ! సుబ్బమ్మవ్వని? మా వూళ్ళో ఆవిణ్ణి యెరుగనివాళ్ళు లేరే! అసలు వూరంతా అవ్వనే పిలుస్తారావిణ్ణి. కొద్దిమంది "సుబ్బమ్మవ్వగారూ" అని కూడా అంటారు. ఆవిడికి కోపం వొచ్చినప్పుడు, "ఆఁ ఆఁ, ఆఁ! ఎవర్రా అవ్వ! నువ్వు నాకేమవుతావురా? చస్తే దెయ్యమవుతావుగాని!" అని గద్దిస్తుంది; అప్పుడు చటుక్కున సర్దుకుని "సుబ్బమ్మగారు" అంటారు. వొక్కొక్కప్పుడు, 'సుబ్బమ్మగారూ' అని పిలిస్తే, 'హారి గాడిదా! వేలెడంతలేవు, బొడ్డుకోసి పేరెడతావురా నాకు!' అని దులిపేస్తుంది వెంటనే దిద్దుకుని "అవ్వగారూ!" అంటారు.

వాహిని 

స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు

బొమ్మలు: బాపు

నిద్ర లేచాడు మూర్తి. ఆవలించాడు.

వాచీ చూసుకున్నాడు. “పదకొండుంబావే!” అనుకున్నాడు.

కొంచెం తలనొప్పి ఇంకా మిగిలి ఉన్నట్లనిపించింది. కళ్ళు వాచి ఉన్నాయి.“వెధవది-విస్కీ త్రాగకుండా ఉండాల్సింది” అనుకున్నాడు. రాత్రి రెండున్నర దాకా తన గదిలో జరిగిన కాండ తల్చుకున్నాడు. ఆలీ, బాబు, మైక్, చాంగ్, శర్మ, డాక్టర్ మిత్రా-తనూ .....రెండున్నర దాకా చిప్స్ తింటూ, జీడిపప్పు మింగుతూ, మధ్య మధ్య సాండ్ విచ్ లు –అందులో గ్రామఫోన్ మీద పాటలు! రవి శంకర్ ‘ఈవెనింగ్ మెలోడీ’ నుంచి.

bottom of page