top of page

రచయితలకి ఆహ్వానం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకి, సాహిత్యాభిమానులకి మా విన్నపం

 

మీలో చాలా మందికి ఎంతో సృజనాత్మకత ఉండి ఈ పరుగుల జీవన ప్రవాహం లో మీ ప్రతిభను మరిచి ఉండవచ్చు! మరికొంత మందికి సమయాభావ సమస్య ఎక్కువ లేకపోయినా స్వీయ రచనా పాటవాన్ని అందరితోటీ పంచుకునే అవకాశాలు లేక తటపటాయిస్తూ ఉండవచ్చును. అందరికీ మాది ఒకటే విన్నపం. తిరిగి మీ కలాన్ని ఒక్కసారి తట్టండి! మీ హృది గదిలో పదిల పరిచిన జ్ఞాపకాల పుస్తకంలో మరుగు పడిన మీ భావుకత పేజీని తిరిగి కొత్తగా వ్రాయండి!

 

“మధురవాణి” లో ప్రచురణకి మీ సృజనాత్మకతని ప్రతిబింబించే “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్యపరమైన వస్తువు ఏదైనా కావచ్చును. కథ, కవిత, వ్యాసం, అనువాద రచన మొదలైన సాహిత్య ప్రక్రియ ఏదైనా కావచ్చును. మధురవాణి త్రైమాస అంతర్జాల పత్రిక మీ రచనలకు ఆహ్వానం పలుకుతుంది!

 

  • కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు.

  • మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయచేసి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కథలు, కవితలు, వ్యాసాలు, ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి.

  • ఒకే సారి కథ, కవిత, వ్యాస ప్రక్రియలలో ఒక్కొక్క దానికి రెండు రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. అంతకు మించి ఎక్కువ రచనలు పంపిస్తే ఆమోదించబడవు.

  • మీ రచన పంపించే ముందు ఒకటికి పది సార్లు చూసి, అచ్చుతప్పులు సరి చేసి పంపించండి.

  • మీ రచనతో పాటు అది మీ స్వీయ రచన అనీ, దేనికీ అనుకరణ కాదు అనీ హామీ పత్రం విధిగా జతపరచాలి. అనువాద రచనలు పంపించినప్పుడు మూల రచన, రచయిత వివరాలు విధిగా తెలియజెయ్యాలి.

  • మీ ఫోటో, ఐదు వాక్యాలకు మించకుండా మీ వ్యక్తిగత, సాహిత్య పరమైన విశేషాలు తప్పక జతపరచాలి.

  • ఇది వరలో ప్రచురించబడిన ప్రాచీన, సమకాలీన రచనల పునర్ముద్రణ, అముద్రిత రచనల ప్రచురణార్హత మొదలైన అన్ని విషయాలలోనూ “మధురవాణి” నిర్వాహకులదే అంతిమ నిర్ణయం.

  • మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం. రాబోయే ఏ సంచిక లో అయినా మీ రచన ప్రచురించబడవచ్చును.

 

మీ రచన పంపించవలసిన చిరునామాలు:
కథా మధురాలు -  katha@madhuravani.com
కవితా వాణి -  kavita@madhuravani.com
ఆధ్యాత్మిక వాణి & వ్యాస మధురాలు - vyasam@madhuravani.com

 

అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఇమెయిల్  sahityam@madhuravani.com
 

భవదీయులు

| శ్రీనివాస్ పెండ్యాల | దీప్తి పెండ్యాల |  వంగూరి చిట్టెన్ రాజు | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ |  విన్నకోట రవి శంకర్ |

 

****

 

bottom of page