top of page

'సినీ' మధురాలు

మాధవపెద్ది సురేష్ గారి సంగీత స్వర్ణోత్సవం సందర్భంగా...                          ఎన్నో, ఎన్నెన్నో మధురానుభూతులు

49 ఏళ్ల నా సంగీత ప్రయాణం లో ఎన్నో, ఎన్నెన్నో మధురానుభూతులు! 1967లో శ్రీ రామ నవమి నాడు ప్రారంభమైన నా స్వర జీవితం చాలా మలుపులు తిరిగింది. అన్నయ్య రమేష్ భావనా కళా సమితి (విజయ వాడ) లో పాటలు పాడే వాడు 1965 నుండీ. అప్పుడు సర్రాజు పాండు రంగా రావు గారు ఎకార్డియన్ వాయించే వారు. ఆయనకీ మద్రాసులో స్థిరపడదామని ఉండేది. మద్రాసు, విజయవాడ మధ్య మాటిమాటికీ తిరగడం చాలా ఇబ్బందిగా ఉండేది ఆయనకి. అన్నయ్య ఒక రోజు నాతో ‘నువ్వు హార్మోనియం వాయించడం నేర్చుకో, మా కచేరీ లలో వాయిద్దువు గాని’ అని చెప్పిన చల్లని వేళ నా జీవితంలో గొప్ప ముహూర్తం !!.....

“అసమాన అనసూయ” గారికి

100 వ పుట్టిన రోజు శుభాకాంక్షలతో...

 

అనసూయ గారి పాటల పల్లకీ...

జీవిత విశేషాలు...

అసమాన అనసూయ పుస్త​క పరిచయం

అసమాన అనసూయం...

సినీ గేయ రచయిత- ‘విశ్వ' తో ముఖాముఖి

150 పైచిలుకు సినీ గీతాలు రచించిన ఆ కలం మాత్రమే కాదు, ఎందరో ఉద్ధండులకి గాత్రదానం చేసిన గంభీర గళమూ - ప్రఖ్యాత సినీ గీత రచయిత విశ్వ గారి సొంతం.సినీ గీత రచయితగానే కాకుండా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలురకాల ప్రతిభతో తెలుగు సినీరంగంలో పేరొందిన విశ్వ గారితో ముఖాముఖి... దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షల సహితంగా మధురవాణి అంతర్జాల పత్రిక పాఠకులకి ప్రత్యేకం!...

bottom of page