MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: సుధేష్ పిల్లుట్ల | చిలుకూరి సత్యదేవ్
ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం తొలి దశకం (1964-1974)
వంగూరి చిట్టెన్ రాజు
2016వ సంవత్సరం ఉత్తర అమెరికాలో తెలుగు కథ ఆవిర్భావం, తద్వారా తెలుగు సాహిత్య శుభారంభానికి 52వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆ తొలి తరం తెలుగు వారి సాహిత్య కృషిని క్లుప్తంగా సమీక్షించడమే ఈ వ్యాసం ముఖ్యోద్ధేశ్యం. అక్కడా, ఇక్కడా ఒక్కొక్క తెలుగు వారు మాత్రమే ఉండి, ఎక్కడా తెలుగు సంఘాలు లేని ఆ రోజుల్లో అటు కెనడా లోనూ, ఇటు అమెరికా సంయుక్త రాష్ట్రాలోనూ తెలుగు భాషకీ, సాహిత్యానికీ పెద్ద పీట వేసి విశేషమైన చారిత్రక సేవలు అందించిన ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలని స్మరించుకోవడం మన కర్తవ్యం. ఆ ఇద్దరు కారణ జన్ములూ దివంగతులే!
ఈ విమానాల సంసారం కాదనుకొండి!
ప్రొఫెసర్ వేమూరి వేంకటేశ్వర రావు
ఈ రోజుల్లో విమానపు ప్రయాణాలంటే విసుగేస్తోంది. కించిత్ భయం కూడా వేస్తోంది.
పూర్వం విమానపు ప్రయాణం చేసేమంటే అది సంఘంలో మన అంతస్థుకి ఒక గుర్తు, గుర్తింపు. ఇప్పుడో? ప్రతీ అబ్బడ్డమైనవాడూ, అంకుపాలెం వెళ్ళొచ్చినట్లు అమెరికా వెళ్ళీ వచ్చేస్తున్నాడు. పడవలో కాదు, విమానంలో. నిన్న మొన్నటి వరకు చెంబుచ్చుకుని బయలుకెళ్ళడానికి మించి ఇంటి గుమ్మం దాటని ప్రబుద్ధులంతా అకస్మాత్తుగా విమానం ఎక్కేయడంతో ``దోసెడు కొంపలో పసుల రేణము`` అని శ్రీనాథుడు అన్నట్లుగా తయారయేయి....
అమెరికా తెలుగు కథకు 52 ఏళ్ళు
డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
కథలు వ్యక్తుల జీవితానుభవాల్లోంచి పుట్టి, ఆ జీవితాలనే ప్రతిబింబిస్తుంటాయి. అమెరికాంధ్రుల జీవితాలలో తరచుగా తారసపడే పరిస్థితులను, సమస్యలను వాటి పరిష్కారాలను కథలుగా మలచి మనకు అందిస్తున్న అమెరికా తెలుగు కథా రచయితలు అభినందనీయులు. వేరు వేరు కాలాలలో అమెరికాలోని తెలుగువారి జీవనవిధానం ఎలా కొనసాగిందో తెలుసుకోవడం ఈ కథల ద్వారానే సాధ్యమవుతుంది. అమెరికాలోని తెలుగు కథా రచయితలు - రచయిత్రులు అక్కడి సమాజంలోని తమ వారి జీవితాలను శోధించి, ఆ అంశాలనే
పత్రికా రంగం – సాధకబాధకాలు
సత్యం మందపాటి
ఒక మండపం నిలవటానికి నాలుగు స్తంభాలు ఎలా కావాలో, అలాగే ఒక పత్రిక నడపాలన్నా, అది నాలుగు కాలాలపాటు నిలవాలన్నా నాలుగు స్తంభాలు కావాలి.
ఒకటి, పెట్టుబడి పెట్టే పెద్దమనిషి లేదా మనుష్యులు. ధన సహాయమే కాకుండా, ఖర్చులూ, ప్రకటనలూ, అమ్మకాలూ మొదలైనవన్నీ చూసుకుంటూ, పత్రికని నడపగలిగే శక్తి, ఆసక్తి వున్నవారన్నమాట! వీరి ధనమే పత్రికా ప్రచురణకి ఇంధనం. అంటే ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక, భారతి నడిపిన కాశీనాధుని నాగేశ్వరరావు, శివలెంక
అమ్మ భాష: మా అనుభవాలు
డా. అల్లాడి మోహన్, ఎం. డి
ముందుగా ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. పుదూరు ద్రావిడులమైన మాకు, తమిళం మరియు తెలుగు రెండూ కూడా మాతృ భాషలే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పుట్టి పెరిగిన నాకు అమ్మ భాష తెలుగు అంటే ఎంతో ఇష్టం! ప్రస్తుత కాలంలో, కనీసం ఐదు నిమిషాల సేపు, పరభాషా పదాలు వాడకుండా, కేవలం తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్న వారిని చూస్తుంటే మనసు కష్టంగా ఉంది.
మా తల్లిదండ్రులు కీ. శే. అల్లాడి ఐరావతి, రామన్ లు, మా చిన్నతనంలో మాకు తెలుగు భాషాభిమానం కలగాలని
బ్రౌన్: తెలుగు తల్లి ఫ్రౌన్: నిజం డౌన్ (రెండవ భాగము)
డా. నెల్లుట్ల నవీన చంద్ర
ఆంగ్లేయులకు ముందే తెలుగు దేశం పైన ఫ్రెంచి వాళ్ళు కన్ను వేసియున్నారన్నది చరిత్ర ప్రసిధ్ధం. ఆర్కాటు నవాబు మీర్ అహ్మద్ అలి ఖాను 1747 లో యానాము హక్కులను ఫ్రెంచి వాడైన సింఫ్రెకు హస్తగతం చేశాడు. వీరు వేయి తెలుగు వాడకాలను, వాక్యాలను తమభాషలోనికి అనువదించి ప్రచురించి తమ దూరదృష్టి చూపించుకోడమేకాక వేమన పద్యాలను కూడా అనువదించి, ప్రచురించారు. ప్రపంచ భాషలలో ప్రసిద్ధమైన మొదటి తెలుగు పుస్తకం ఇదే. చందుర్తి యుద్ధములో ఇంగ్లీషు వాళ్ళు ఫ్రెంచి వాళ్ళను ఓడించి ఉత్తర సర్కారులను తమ వశములోకి తీసుకున్నారు.