top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

దసరా దీపావళి ఉత్తమ

రచనల పోటీ!

madhuravani.com  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దసరా, దీపావళి తొలి ఉత్తమ రచనల పోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలందరికీ సాదర ఆహ్వానం!

వివరాలకై... క్లిక్ చేయండి

Click here for details.... 

దసరా దీపావళి ఉత్తమ రచనల పోటీ!

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి

madhuravani.com

మా వాణి ...

ఒక మంచి పుస్తకం గొప్పదనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు... అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది" అన్నారు గాంధీజీ. Madhuravani.com పత్రిక పలు రకాల అంశాలతో ఓ మంచి పంచరంగుల పుస్తకంగా ఆ ఆలోచన కలిగిస్తుంది అని మాకు వస్తున్న ఉత్తరాల పరంపర ద్వారా తెలిసి కించిత్  గర్వంగానే ఉంది.

మధురవాణి నిర్వాహక బృందం

నా డైరీల్లో కొన్ని పేజీలు... ఓడలు బళ్ళు అయిన వేళ

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి gollapudi maruti rao

1970 జనవరి 16: 'చెల్లెలి కాపురం' ఆఫీసులో డి. ఎస్. ప్రకాశరావునీ, జయరాంనీ తిట్టిన సందర్భం. జర్దా కిళ్ళీ.

ఇది 46 సంవత్సరాల కింద మాట. ఏ విధంగా చూసినా ఈ వాక్యాలు డైరీలో రాసుకోవలసినంత ప్రత్యేకమయినవీ కావు, ముఖ్యమైనవీ కావు. ఎందుకు రాశాను? నా జీవితం లో అతి ముఖ్యమయిన మలుపుల్లో ఈ రెండు వాక్యాల ప్రమేయం ఉంది, ఆశ్చర్యం.

'చెల్లెలి కాపురం' సినీ నటులు బాలయ్యగారి మొదటి చిత్రం. ఆ చిత్రానికి దర్శకులు కె.విశ్వనాథ్. ఆయనతో నేను కలిసి పనిచేసిన రెండో చిత్రం. ఆయన మొదటి చిత్రం నాకు రెండో చిత్రం. దాని పేరు "ఆత్మ గౌరవం'...

మెడమీద వాటా అద్దెకివ్వబడును

కొండేపూడి నిర్మల

Nirmala Kondepudi

సుభద్రకివాళ మనసు మనసులో లేదు.

వొంటిమీద నగలన్నీ వొలిచి గంపలో వేసింది. రివ్వుమంటూ వళ్లంతా చల్లటి ఏ.సి గాలి తగిలింది. నగలు తీసేస్తే ఇంత గాలి తగులుతుందా? అని ఆశ్చర్య పోలేదు. అసలా సుఖాన్ని గుర్తించే పరిస్థితిలోనే ఆమె లేదు.   ఎడమ కాలితో కార్పెట్ మీద  ఒక తాపు తన్నింది. గంప తుళ్ళి రాక్షసుడి నాలుక బద్ద లాంటి  వడ్డాణం కిందపడింది. వెంటనే కళ్ళకద్దుకుని దాన్ని తీసి గంపలో వెయ్యలేదు.   వొలికిన పళ్లరసంలో తడిసిపోయిన వారపత్రికలోకి క్రూరంగా చూస్తూ...

అమెరికా వారోత్సవాల కథ

వంగూరి పి.పా. లో....

మొన్న ఆదివారం మా వారోత్సవంలో భలే చికాకు వేసింది. అదేమిటో కానీ, ప్రతీ వారం ఇలా ఏదో ఒక చిన్న చికాకు వస్తూనే ఉంటుంది, అయినా మా ఇంట్లో వారోత్సవాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. వారోత్సవం అంటే ప్రతీ వారం అడ్డమైన గడ్డీ, నానా చెత్తా కొనేసుకుని డబ్బులు తగలేసేసి ఆ తరవాత భోరుమనే మా షాపింగ్ సంబరాలు అన్నమాట. ఈ ఉత్సవ తతంగం ప్రతీ శనివారం పొద్దున్నే మొదలవుతుంది. వారాంతంలో కూడా ఏదో పెద్ద పని ఉన్నట్టు నా కంటే ఎప్పుడూ ముందే నిద్ర లేచి, రక రకాల చప్పుళ్ళు, కూతలు, సద్దుళ్ళు, కొండొకచో అరుపులతో ...

నిర్భావం సద్భవతి!  అవునంటారా?

-దీప్తి పెండ్యాల

ఆరోజు… కృతి వాళ్ళింట్లో ఓ డిన్నర్ పార్టీ కి వెళ్ళాలి. మామూలుగా అయితే, వాళ్ళింటికి వెళ్ళే ముందు చాలా ఉత్సాహంగా ఉంటుంది నాకూ, నా ఫ్రెండు శ్వేతకి. కానీ, ఆరోజు మాత్రం తెగ నీరసంగా ఉంది. మా వాళ్ళకు మాత్రం అర్థమవలేదు సమస్యేమిటో. కనుక వాళ్ల దోవన వాళ్ళు "నిర్భావం సద్భవతి" అనే సూత్రం...

మానవ జన్మ సార్ధకత మోక్ష పురుషార్ధములోనే ఉన్నది. వేదాంత పరంగా చూస్తే “అహమస్మి” అనే అనుభవపూర్వకమైన జ్ఞానమే మోక్షం.  ఈ గమ్యం చేరుకోడానికి సాధన మార్గములేవి? అని చూస్తే కర్మ యోగం, జ్ఞాన యోగం, సమాధి యోగం మరియు భక్తి యోగములని మనం విన్నాము. ఇక్కడ భక్తి అంటే సగుణ ఈశ్వర భక్తి అని అర్ధము. అన్ని నదులు సముద్రములో చేరినట్లు ...

భక్తి మార్గము – జ్ఞాన మార్గము      -సుధేష్ పిల్లుట్ల

బూస్ట్  యువర్  బేబి ఐ.క్యూ

రామానుజరావు తుర్లపాటి

Innaiah

“నెక్స్ట్ “ పిలిచింది  సుస్మిత  వాచీ చూసుకుంటూ. తొమ్మిది గంటలయ్యింది. ఇప్పటికే  భర్త రమేష్, రెండు సార్లు ఫోను చేశాడు. ఇవాళ చాలా కేసులు రావడంతో ఆలశ్యం అయ్యింది. ఇదే లాస్టు కేసు. తొందరగా చూసి పంపించేస్తే, ఇంటికి వెళ్ళిపోవచ్చు.

బయట స్టూల్  మీద కూర్చున్న  నరసింహం  తలుపు తెరిచి, సహజను లోపలికి పంపించాడు. సహజ లోపలికి వస్తూనే  డాక్టర్  వంక చూసింది.  సుస్మితకు  సుమారు ముఫై  అయిదేళ్ళు వుండవచ్చు. మంచి అందమైన...

ఏదో ఒక 

దైనిక ఘటన 

ఆలంబనగా 

​మనసులో ఒక మూల  

 

దైర్య వచనాల కింద 

Indrani Palaparthi

భయం

​        ~పాలపర్తి ఇంద్రాణి

ఇక్కట్లకి  అర్జీలు పెట్టినట్టే

అస్తవ్యస్తాలపై ఫిర్యాదులు చేసినట్టే

అర్దమవనీ ప్రపంచ తీరుతెన్నులపై

పరమాత్ముని కోసమో ప్రశ్నావళి 

*

లోకాన వింత పోకడలెందుకు?

‘పరమాత్మునికి ప్రశ్నావళి’....

       ~కోసూరి ఉమాభారతి

>>>>

"అగ్ని" అన్ టెస్టెడ్ మిస్సైల్

KCR 2 Year's Progress Report

శ్రీనివాస్ పెండ్యాల​

పుస్త​క పరిచయాలు                       శాయి రాచకొండ

అదే గాలి

అండమాన్ డైరీ

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి

చీకట్లో నీడలు

అందమా... నిను వర్ణింప తరమా

నన్ను గురించి కథ వ్రాయవూ?

 స్వర్గీయ బుచ్చిబాబు

KiBaSri

బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా....

"నన్ను గురించి కథ వ్రాయవూ?" అని అడిగింది కుముదం.

ఈ ప్రశ్న నాకు కొంత ఆశ్చర్యం కలగజేసింది. ఎందుకంటే కొద్ది మార్పుతో ఇదే ప్రశ్న ఎనిమిది సంవత్సరాల క్రితం అడిగింది. నాకు బాగా జ్ఞాపకం. మా మేనమామగారింట్లో కుముదం తండ్రి కాపురం వుండేవాడు. అద్దె తీసుకురమ్మని అప్పుడప్పుడు నన్ను పంపేది మా అత్తయ్య. ఆ రోజు సాయంత్రం కర్రకు మేకు దిగేసి , ఇనుపచక్రం దొర్లించుకుంటూ దొడ్లో పరుగులెత్తింది కుముదం. నాకప్పుడు పన్నెండో ఏడు. ఆమె నాకంటే రెండు

తొలి ప్రచురణ: ఆంధ్రశిల్పి - 1946 ఆగస్టు

రిటైర్డ్ హస్బెండ్

శ్యామలాదేవి దశిక

KiBaSri

ఏమిటీ… ఇవ్వాళ లంచ్ కి ఏం చేస్తున్నావు అంటారా?

ఏదో ఒకటి చేస్తాలేండి… బ్రేక్ ఫాస్ట్ చేసి గంటన్నా కాలేదు, అప్పుడే లంచ్ ఏంటీ అంటూ ప్రశ్నలు.

మీరు రిటైర్  అయిన తర్వాత నాకు పనీ...మీకు హడావిడి ఎక్కువైంది. అస్తమానం కాలుగాలిన పిల్లిలా పైకీ కిందకీ తిరగడం..... లేదంటే నా చుట్టూ తిరగడం.

సాయంకాలం వంటేమిటీ… పప్పుపులుసు లోకి కారం అప్పడాలా… మెడ్రాస్ అప్పడాలా?

కథలు ఎందుకు చదవాలి?

మెడికో శ్యాం

medico Shyam Chilavuri

ఈ శీర్షికని రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు.

ఒకటి : కథలు ఎవరైనా ఎందుకు చదవాలి?

రెండు: ప్రత్య్రేకించి కథకులు ఎందుకు చదవాలి??

అసలు ఏ పనైనా ఎందుకు చేయాలి?  ఉధాహరణకి భోంచెయ్యడం, తిండి తినడం. తినడంకోసం బతుకుతామా?  బతకడం కోసం తింటామా?  అంటే అందరూ బతకడం కోసం తింటామనే చెబుతారు. నిజానికి తినడం కోసం బతుకుతున్నవాళ్లే ...

గారడీ

జయంతి ప్రకాశ శర్మ​

Jayanthi Sarma

మస్తాన్ వలీ అంటే ఆ ఊరులో ఎవరికీ తెలియదు, మస్తాను అంటే కూడా ఎవరికీ తెలియదేమో గాని  గారడీగాడు  అంటే మాత్రం ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది.  ఆ ఊరి తురకల కోనేరుని ఆనుకుని ఓ పెద్దరావిచెట్టు, ఆ పక్కనే మట్టితో మూడు వైపులా నాలుగడుగుల ఎత్తున్న గోడలు,  నాలుగో వైపు తలుపులుగా వాడుకునే కర్రల తడిక పైన నాలుగు తాటికమ్మలు, వాటిని కప్పుతూ, చిల్లులతో జీర్ణావస్థలో ఉన్న టార్పలిన్ మస్తాను ఇల్లు...

కాకినాడలో రాజాజీతో ముచ్చట్లు

నరిసెట్టి ఇన్నయ్య ​

Innaiah

రాజాజీతో నా తొలి పరిచయం ఒక మధురానుభూతి. ఇది 1959 జూన్ నాటి మాట. కాకినాడలో తొలిసారిగా ములుకుట్ల వెంకట శాస్త్రిగారి ఇంట్లో కలిసి చాలాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం నా అనుభవాలలో విశిష్టమైనది.

జీవితంలో ముఖ్యమంత్రి నుండి గవర్నర్ జనరల్ దాకా అన్ని పదవులూ జయప్రదంగా నిర్వహించి పేరు తెచ్చుకున్న రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) 80వ పడిలో ఆందోళన చెంది రాజకీయాలలోకి చురుకుగా పాల్గొనటం ఆశ్చర్యకరమైన విషయం. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతుల.

వలస వేదన - నా కవిత్వం

ముకుంద రామారావు

Mukunda Rama Rao

కవిత్వంలో జీవితమూ ఉంది, జీవితంలో కవిత్వమూ ఉంది. నా వరకూ నాకు, రెండూ విడదీయలేనివి. వలస కూడా నాకు అటువంటిదే. నా కవిత్వంలోనే కాదు, బహుశా నా రక్తంలోనే, వలస ఉంది. నా పూర్వీకులు భూమిని నమ్ముకున్న వారు. అది ఏ భూమి, ఎక్కడి భూమి అన్న దానితో సంబంధమే లేదు. ఎక్కడైనా వారికి అదే ఆకాశం, అదే భూమి, అదే గాలి, అదే నీరు. లేదంటే వాళ్లు, చదువు లేకుండా, మరో భాష రాకుండా, ఏ ప్రాంతమో చూడకుండా, ఎలాంటివారో తెలియకుండా, దేశాల్ని సముద్రాల్ని దాటిపోగలిగే సాహసం ఎలా చేయగలిగారు. కేవలం బతుకుతెరువు...

bottom of page