top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అధ్యాత్మిక వాణి

నిర్వహణ: సుధేష్ పిల్లుట్ల | చిలుకూరి సత్యదేవ్

vyasam@madhuravani.com 

సుధేష్ పిల్లుట్ల

పశ్యమే యోగమైశ్వరం

అద్వైత తత్త్వాన్ని అరటి పండులాగా వొలిచి చూపించిన  సిరివెన్నెలగారి పాట "జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది!"


“నిజానికి ఏకాకినైన నేను ఎల్లకాలము ఒంటరినై, నాతో నేనే అనుగమిస్తూ, నిరంతరం సృష్టిని కలలుగా కంటూ, ఈ జగత్తును ఒక ఇంద్రజాలంలా సృష్టించి, నా సృష్టిలో నేనే ఆకాశమై, ఆ ఆకాశంలో జ్ఞానం లాంటి కంటినై, అన్నింటినీ చూస్తూ నా ఆనందానికి నేనే కారణంగా, నాతో నేనే రమిస్తూ, భావాద్వైతంలో ఉన్నప్పటికీ ఆచరణలో జగమంతా వసుధైక కుటుంబంలా చూస్తూ మసలుకుంటాను” అనే ఉపనిషత్ సారాంశాన్ని సిరివెన్నెల గారు నర్మగర్భంగా తెలిపారు.
"అయం బంధురయం నేతి గణనా లఘు చేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం" అని చెప్పే ఉపనిషద్ దృక్పథం కూడా ఇదే.

ప్రొ॥ డా॥కె.వి.ఎస్. జ్ఞానేశ్వర రావు

భగవత్ తత్త్వము​

మానవుడు-ప్రపంచం-ఈశ్వరుడు. ఈ మూడింటి మధ్య సంబంధం ఏమిటి? జీవులన్నింటిలో విశిష్టుడైన మానవుని ఆవిర్భావం ఎలా జరిగింది?

ఈ ప్రశ్నకి ఆధ్యాత్మిక గ్రంథాలు ఒక రకంగా, విజ్ఞానశాస్త్రం మరోరకంగా ఊహించి చెపుతాయి. పంచభూతాత్మకమైన (పృథివ్యావస్తేజోవాయురాకాశాలు) దశేంద్రియాలద్వారా (శబ్దస్పర్శరూపరసగంధములనే పంచ జ్ఞానేంద్రియాలు, కరచరణవాక్ పాయూపస్థలనే పంచ కర్మేంద్రియాలు) అంతఃకరణం (మనోబుద్ధి చిత్తాహంకారములు) చుట్టూ ఆవరించిన లోకం గురించి మానవునకు అనుభూతి, తద్వారా అవగాహన కలుగుతాయి. మరొక్క ఇంద్రియం వుంటే మరింత అవగాహన  కలిగే అవకాశం వుంది. విజ్ఞానశాస్త్రం ప్రకారం కంటికి కనిపించని వెలుగు(విద్యుదయస్కాంత వర్ణపటం), చెవికి వినిపించనిశబ్దాల (పరశ్రవ్య ధ్వనులు, అతిధ్వనులు) ఉనికినికూడా నిరూపించారు కదా? ఒకప్పుడు మంత్రంతో సాధించేది ఇప్పుడు యంత్రం ద్వారా 

bottom of page