top of page

కవితా వాణి

నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

రేణుక అయోల

రేణుక అయోల

పూర్తిపేరు  రేణుక అయ్యల సోమయాజుల. కలం పేరు రేణుక అయోల  భర్త అయ్యల సోమయాజుల అరుణ్ కుమార్.

వీరు ప్రచురించిన పుస్తకాలు-  పడవలో చిన్నిదీపం (కవితాసంపుటి), రెండు చందమామలు (కధల సంపుటి), లోపలి స్వరం (కవితా సంపుటి), మూడవ మనిషి (దీర్ఘ కావ్యం) .

కోసూరి ఉమాభారతి

కోసూరి ఉమాభారతి

కోసూరి ఉమాభారతిగారు నాట్యకళ ద్వారా స్వచ్చంద సమాజసేవకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు, అవార్డులు పొందారు. చలన చిత్రాల్లో నటించి,  నృత్య సంబంధిత చిత్రాలని నిర్మించి, దర్శకత్వం వహించారు.

శాస్త్రీయ నృత్య సంబంధిత వ్యాసాలతో పాటు,  పలు నృత్యరూపకాలు రచించి దేశవిదేశాల్లో ప్రదర్శించిన ఉమాభారతిగారు గత రెండేళ్లగా ప్రవాసాంద్రుల జీవన విధానాన్ని ప్రతిబింబించే వ్యాసాలు, కుటుంబవ్యవస్థలోని మానవ సత్సంబంధాలు ఇతివృత్తంగా పలు రచనలు చేసారు. ఆమె  చేసిన  నృత్యేతర రచనలు యాభైకి పైగా పలు పత్రికల్లో  ప్రచురించబడ్డాయి.

వంగూరి ఫౌండేషన్, USA వారి ఉగాది ఉత్తమ రచన పురస్కారం అందుకున్నారు. ‘విదేశీ కోడలు’ కథాసంపుటి, ‘ఎగిరే పావురమా!’ సాంఘిక నవల ప్రచురించబడ్డాయి. ‘రాజీ పడిన బంధం’ నవలగా ప్రచురించబడగా, గో-తెలుగు సాహిత్య వార పత్రికలో ‘వేదిక’, ఆంగ్లంలో ‘The Lady who talks too much’ ధారావాహికలుగా  ప్రచురించబడి చదువరుల ఆదరణ పొందిన ఇతర రచనలు.

పాలపర్తి ఇంద్రాణి

పాలపర్తి ఇంద్రాణి

ఈ మధ్యే హ్యూస్టన్ వాస్తవ్యులయిన ఇంద్రాణి గారివి రెండు కవితా సంకలనాలు "వానకి తడిసిన పువ్వొకటి", 2005 లోనూ "అడవి దారిలో గాలిపాట 2012 లోనూ వెలువడ్డాయి.

వానకి తడిసిన పువ్వొకటి రచనకి గానూ 2005 లో ఇస్మాయిల అవార్డు, 2016 లో వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీలో బహుమతిని అందుకున్నారు.

Indrani Palaparthi
దోరవేటి

వి. చెన్నయ్య (“దోరవేటి”)

ప్రథమశ్రేణి తెలుగు పండితులు, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, శామీర్ పేట, రంగారెడ్డి జిల్లా

చిత్రలేఖనం, నృత్యం, లలిత సంగీతం, వాద్య సంగీతం (తాళవాద్యాలు, మురళి) వంటి కళా ప్రక్రియల్లో ప్రవేశం ఉంది.

దాదాపు 200 కథలు, 1000 వ్యాసాలు, 5 కావ్యాలు, 8 నవలలు వ్రాసారు.

 “అభినవ దాశరథి”, “సాహితీ కళారత్న” వంటి బిరుదులు పొందారు

కీర్తి పురస్కారం, బి.న్.శాస్త్రి పురస్కారం, పద్యసాహితీ పురస్కారం, నోముల కథా పురస్కారం, సోమ సీతరాములు పురస్కారం పొందారు.

Doraveti Chennaiah
Kommula

కొమ్ముల వెంకట సూర్యనారాయణ

ప్రభుత్వ జిల్లావిద్యాశిక్షణసంస్థ, బొమ్మూరు, తూర్పుగోదావరిజిల్లాలోగణితఅధ్యాపకునిగా పని చేస్తున్నారు. తెలుగువెలుగు, బాలభారతం,హాస్యానందం, గోతెలుగు.కామ్ లలో అడపా తడపా వీరి రచనలు ప్రచురితమయ్యాయి. మనసును కదిలించే కధలన్నా, హాస్యకధలన్నా, కవితలన్నా యిష్టం.

Kommula Venkata Suryanarayana
bottom of page