top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా ​ మధురాలు

నిర్వహణ: మధు పెమ్మరాజు | దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

సర్వజ్ఞుడు

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్ | స్వేచ్ఛానువాదం: ఎలనాగ

మాక్స్ కెలాడాను ఇష్టపడక పోవటానికి నేను ముందే సిద్ధపడి వున్నాను. యుద్ధం అప్పుడే ముగియటంతో, ఓడలపై ప్రయాణించే మనుషుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఓడల్లో మంచి వసతి దొరకటం కష్టంగా వుండటం వల్ల, ట్రావెల్ ఏజెంట్లు ఏది యిస్తే దాన్నే తీసుకోవాల్సిన పరిస్థితి. విడిగా ఒక క్యాబిన్ దొరకదు కనుక, రెండు పడకలున్న ఓ క్యాబిన్ దొరికినందుకు సంతోషించాను.

స్మృతి పథంలో అమ్మ

శ్రీకాంత గుమ్ములూరి

కొత్తగా మాతృత్వాన్ని పొందిన ఆడపడుచు జీవన పథంలోకి అడుగు పెట్టింది. అతి భయంతో ,"ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణమా?" అని అడిగింది. మార్గదర్శి, " అవును. మార్గం కష్టతరమైనదే, సుదీర్ఘమైనదే. గమ్యానికి చేరక ముందే నువ్వు వృద్ధాప్యం లోకి అడుగుపెట్టచ్చు. మార్గం మొదటి భాగం కంటే చివరి భాగం సులభ సాధ్యంగా, ఆనందదాయకంగా వుంటుంది. కానీ అది నీ స్వయంకృషి మీద, సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది." అని చెప్పింది.

టౌన్ హాల్

మధు పెమ్మరాజు

Madhu Pemmaraju

కొన్ని నెలలుగా మా సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులు నల్లేరుపై నత్త నడకలా సాగుతున్నాయి. డెడ్ లైన్స్ గడియారపు ముల్లులా ఘడియ ఘడియకి మారుతుంటే, ప్రాజెక్టు ఖర్చు వదిలేసిన కుళాయి నీరులా పారుతోంది. మా ప్రోగ్రాం మేనేజర్ మూల కారణాలు వెతకడం మానేసి పూట పూటకి స్టేటస్ చెప్పమని, ఓవర్ టైం పని చెయ్యమని వత్తిడి చెయ్యడంతో స్టాఫ్ ఉత్సాహం గండి పడిన చెరువుగా మారింది. ఆ నేపథ్యంలో డేవ్ థామస్ ఫైరయ్యాడని బ్రాండీ చెప్పింది.​

మరపురాని గతం

మురళీ లంక

"భైరూట్ కి స్వాగతం! సమయం ఉదయం పదకొండు గంటల ముప్ఫై నిమిషాలు..." ఎయిర్ హోస్టెస్ చెప్పటంతో టోనీకి వెన్నులో నుంచి చలి పుట్టింది. ఎయిర్ పోర్ట్ నుంచి మర్జా దారి పొడుగునా గుండె భారం పెరుగుతూనే ఉంది. అన్నయ్య బలవంతం చెయ్యబట్టి వచ్చాడే కాని తనకి ఊరికి తిరిగి రావటం ఇష్టం లేదు.

"టోనీ! దిగు. మనం వచ్చేసాం" అన్నయ్య తట్టి పిలవటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.

రక్తపిపాసి

వెంపటి హేమ

మనిషి ఎప్పుడూ పరస్పర విరుద్ధాలైన ద్వంద్వ ప్రవృత్తుల మధ్యన పడి నలుగుతూనే జీవిస్తూ వుంటాడు. ఉన్నకర్మకు ఉపకర్మ తోడయ్యింది -  అన్నట్లుగా, వచ్చిపడ్డ కష్టాలకు తెచ్చిపెట్టుకున్న కష్టాలను కూడా జత కలుపుకుంటూంటాడు మానవుడు.

అలా తెచ్చిపెట్టుకున్న కష్టాల్లో భక్తీ, భయమూ కూడా ఉన్నాయనిపిస్తుంది.  దేవుణ్ణి నమ్మిన మనిషి 

కలహ భోజనం

విజయశ్రీ మహాకాళి

వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళేమీ కాదు, అలాగని పెద్ద వాళ్ళూ కాదు. రోజూ పోట్లాడుకుంటారు. మళ్ళీ గంటలో కలుసుకుంటారు. మరో గంటలో మామూలు దంపతులైపోతారు. మళ్ళీ కొద్దిసేపటికే ఒకరి మీద ఒకరు విసుర్లు, పాటలు, వెక్కిరింతలు!! ఇలా తెల్లారా పొద్దూకా!! అయినా వాళ్ళకి విసుగనేది లేదు. విడిపోయి కలుసుకుంటారు. కలుసుకున్న కొద్ది సేపటికే విడిపోయి గిల్లికజ్జాలాడుకుంటారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఎవరి గదుల్లో వాళ్ళు గడిపినా, కంచానికీ - మంచానికీ మనిషి అలికిడి​

పేరుకి తగ్గట్టుగానే ఈ శీర్షికలో కథ బావుండి, చదివించే గుణం ఉన్న కథలు తగిన సంఖ్యలో ప్రచురిస్తాం. మంచి సృజనాత్మకతని ప్రతిబింబించే “అముద్రిత” స్వీయ రచనలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కథా వస్తువు ఏదైనా కావచ్చును. కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో ఉన్న రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు. మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయ ఉంచి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కథలు ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించకండి. మీ రచన అందిన సుమారు నెల రోజులలో ఎంపిక వివరాలు తెలియపరుస్తాం.

 

ఈ శీర్షికలో పరిశీలనకి కథలు పంపించ వలసిన ఇమెయిల్ katha@madhuravani.com

bottom of page