top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆహ్వానిత మధురాలు

నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | దీప్తి పెండ్యాల

sahityam@madhuravani.com 

వీరాభిమాని

భువనచంద్ర

భువనచంద్ర, Buvanachandra

విజయవాడ రైల్వే స్టేషన్ హడావిడిగా వుంది. పదో నంబరుప్లాట్ ఫాం మరీ హడావిడిగా వుంది. స్తంభాల చుట్టూ నిర్మించిన అరుగులాంటి దిమ్మ మీద కూర్చుని చుట్టూ చూశాను. ఒకాయన ఓ పేపరు అందరికీ కనిపించేలా మడిచి పట్టుకు తిరుగుతున్నాడు. ఆ పేపర్లో ఓ ఫొటో కనిపిస్తోంది. జాగ్రత్తగా చూస్తే ఆ ఫొటో అతనిదే. నా పక్కన ఓ మధ్య వయస్కురాలుంది. ఆవిడ పక్కన ఓ బామ్మగారూ, హుషారైన మనవరాలూ, అవతలి పక్కన ఓ రిటైర్డ్ తహసీల్దారు. ఆయన ఇందాకే పరిచయమయ్యాడు. ఓ నడివయస్సామె కూడా పరిచయమైంది. ఆవిడ కూతురు వాటర్ బాటిల్ కోసం వెళ్ళింది. ఆవిడా చెన్నై వస్తోందిట. ఓ కుర్రాడు షోల్డర్ బాగుతో వచ్చి నా ముందు నిలబడ్డాడు... ఉస్సు.. ఉస్సంటూ.

సత్యం మందపాటి

శివాని!

డెలివరీ గదిలోకి వెడుతున్నప్పుడు, భర్త చేయి పట్టుకుని “అంతా సవ్యంగానే అవుతుందంటారా?” అని అడిగింది కొంచెం గాబరాగా భవాని. 
అదే ఇద్దరికీ మొదటి సంతానమేమో శివకి కూడా మనసు మనసులో లేదు. 
అయినా ధైర్యంగా అన్నాడు, “మనకి మొదటి సంతానమేగానీ, ఈ హాస్పిటల్లో ప్రతిరోజూ ఎంతోమంది పిల్లల్ని కంటున్నారు. ఈ డాక్టర్లకి అది రోజూ చేసేదే. భయపడాల్సినదేమీ లేదు” అని. 
భర్తవేపు గోముగా చూసింది భవాని, నర్సు ప్రసూతి గది తలుపు వేస్తుండగా.

అబద్ధాయ నమః

ద్వా. నా. శాస్త్రి

"సత్యమేవ జయతే"
"సత్యం వద"
"సూనృతవాక్యము మేలు"
"సత్య హరిశ్చంద్రుడు"
ఈ మాటలకి కాలం చెల్లింది. అసలు వీటి గురించి ఆలోచించటమే బొత్తిగా మానేశాం. ఎవడైనా కొంపదీసి నిజం మాట్లాడితే వాడ్ని పట్టుకొని "సత్తె కాలపు సత్తెయ్య" గా ఏడిపిస్తాం. "నిజం చెప్పాలంటే..." అంటూ కూడా​

విన్నకోట రవిశంకర్

ముకుంద రామారావు

జీవం

ప్రేమ

అనంత కాలంగా చూస్తున్న ప్రపంచాన్నే
ఒక శిశునేత్ర గవాక్షం నుంచి
ప్రతి ఉదయం కొత్తగా కనుగొనటం దాని వ్యాపకం.

నువ్వు పూవయితే నేను దాని మొక్కనవుతా
నువ్వు మంచుబిందువవుతే నేను దాన్ని మోసే పువ్వునవుతా

విజయలక్ష్మీ మురళీధర్

చిన్ని మాట

"గట్టిగా అనకు నాన్నకి వినిపిస్తుంది," గబగబా వంటింటి దగ్గరకి వచ్చి లోపల పనిలో ఉన్న భార్యతో అన్నాడు ప్రసాద్.
"నేనేదో గయ్యాళినయినట్లు నా నోరు మూస్తారేమిటండీ? నేను  ఏమన్నాననీ, మీ నాన్నగారు కూడా నిద్రలేస్తే అందరికీ ఒకేసారి కాఫీలు , పిల్లలకి బోర్నవీటాలూ కలిపేస్తే నాకు సులువవుతుందంటున్నా అంతేగా ?"
కోడలి గొంతుకి ఉలిక్కిపడి లేచి మంచం మీద నిటారుగా కూర్చున్నారు రావుగారు. "ప్లీజ్, నీకంత కష్టమయితే ముందే కలిపేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచచ్చు కదా," గొంతుని అణిచి పెడుతూ కొడుకు అవస్థలు పడుతూ ఉంటే జాలేసింది ఆయనకి.

సనాతనం నిత్య నూతనం

ఎస్. నారాయణస్వామి

మనవాళ్ళకి ‘ఏన్షియంట్’ అనే మాట అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. మన తోటి భారతీయుల్ని, అందునా హిందూ మతస్తులని ఎవరినైనా కదిలించి చూడండి కావాలంటే - అబ్బో మా దేశం పాతది, మా మతం, మా సంస్కృతి ఇంకా చాలా పాతవి. ఏ.. ఏఏ .. న్షియంట్ అని నొక్కి వక్కాణిస్తారు. దానికి తోడు వేదపురాణాల్లోనే మన జీవన విధానాన్ని సనాతన ధర్మం అని పిలిచారాయెను. సనాతనం అనగానే మన ఛాతీలు ఉప్పొంగుతాయి. ఎవరికీ అర్ధం కాని సంస్కృత స్తోత్రాలూ, నాచుపట్టిన రాతి కట్టడాల దేవాలయాలూ, వాటి గోడల మీద అద్భుతమైన శిల్పాలూ - ఇవన్నీ యమర్జెంటుగా మన కళ్ళ ముందు మెరుస్తాయి. ఇంతలో ​

వేమూరి వేంకటేశ్వరరావు

కాల్పనిక  వాస్తవం

వేమూరి వేంకటేశ్వరరావు, Vemuri Venkateswar Rao

“అయితే పరకాయ ప్రవేశం సాధ్యమేనంటారా?”
“ఆది శంకరులు పరకాయ ప్రవేశం చేసేరని అంటారు. కాని, అంతకు ముందు కాని, ఆ తరువాత కాని ఎవ్వరూ పరకాయ ప్రవేశం చేసిన దాఖలాలు లేవు. కాని....” అంటూ  వాక్యాన్ని అర్థాంతరంగా ఆపి వక్త సభలో ఉన్న శ్రోతల వైపు చూసేడు.

చూసి…“కానీ ... పాక్షిక పరకాయ ప్రవేశం వంటి ప్రక్రియ సాధ్యమేనని చెప్పటానికి చెదురు మదురుగా ఆధారాలు కనబడుతున్నాయి! “నేను చెప్పటం కాదు. నా అనుభవంలో జరిగిన ఒక వృత్తాంతాన్ని సినిమాలా తీసేను. ఆ సినిమా ఇప్పుడు చూపిస్తాను. తరువాత జరిగిన సంఘటనలని విశ్లేషిద్దాం.

ప్రయాణాల 'రహస్యం'

దాసరి అమరేంద్ర

''మీరు ఎందుకింత విరివిగా ప్రయాణాలు చేస్తున్నారు?'' హఠాత్తుగా అడిగారు రామలక్ష్మి గారు. ఊహించని ప్రశ్న. తత్తరపడ్డాను.
ఆ ప్రశ్న వెనకాల చాలా నేపథ్యముంది.
వివినమూర్తీ రామలక్ష్మిలతో నా పరిచయం పదిహేనేళ్లనాటిది. 
ప్రయణాలతో నా పరిచయం వయస్సు దాదాపు ఏభై ఏళ్లు.
రామలక్ష్మిగారికి నా ప్రయాణాల పిపాస బాగా తెలుసు. కారుల్లోనూ, రైళ్లమీద, కాలి నడకనా, స్కూటర్ల మీదా
 

జరుక్ శాస్త్రి కథా విపంచి

డాక్టర్. కె.బి.లక్ష్మి

''కళ్ళు మూసుకు తెల్లమిట్టనుపొడుము పట్లేమ్ పట్టనేర్తువుభూమి మీదుండే విశేషాల్తెలుసుకోవద్దా?

బిచ్చమెత్తిం దాక నీ ఆల్బిడ్డలకు గతిలేని వాడివినీవు కూడా లేనివాళ్ళకుదూరమౌతావా?

ఈశ్వరా నీ గ్గుండెలుంటేవచ్చి నాతో ఎదర నుంచునిచేయీ చేయీ కలిపి కొంచెంమాటలాడ్తావా?''...

 

అంటూ ఆస్తిక్య దృక్పధంతో సాక్షాత్తూ ఈశ్వరుణ్ణి 'సవాల్ ' చేస్తూ బీదల పక్షాన నిలబడి స్వీయ కవితలల్లిన జలాలుద్దీన్ రూమీ జరుక్ శతజయంతి సంవత్సరమిది

bottom of page