MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
బహుమతి పొందిన కథలు
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ (U.S.A) & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ
Founder- Director - Kosuri Uma Bharathi
1982లో స్థాపించబడి అనతికాలంలోనే అమెరికాలోని భారతీయ కళారంగంలో మేటి కూచిపూడి నృత్య కళాశాలగా గుర్తింపు పొందింది ‘అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ’. 37 సంవత్సరాలుగా సామాజిక ప్రయోజనాలకి, అమెరికాలోని హిందూ ఆలయ నిర్మాణ నిధులకి స్వచ్చందంగా నృత్యప్రదర్శనలు,నృత్యశిక్షణ శిబిరాలు నిర్వహించింది ఈ కళానిలయం. లఘుచిత్రాలు, నృత్య వీడియోలు, భారతీయ కళల ప్రయోజనాలని ప్రతిబింబించే టెలీ-ఫిలిం కూడా నిర్మించి ప్రవాసాంధ్ర యువతలో కళలపట్ల అవగాహన, ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది అకాడెమీ.
సమాజం పట్ల ఉన్న స్పృహ, అనుబంధంతో 2018లో ‘శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ స్థాపించి, తద్వారా సామాజికసేవతో పాటు మూగజీవుల సంక్షేమానికి పాటు పడాలని, విద్యారంగంలోనూ సహకారాలు అందించాలని ముందుకు సాగుతుంది.
సాహిత్య-సాంస్కృతిక రంగాల్లోనూ ,సత్కార్యాలు, సత్సాంగత్యాలతో కన్నఊరిని పలకరించాలన్న తలంపుతో అర్చన ఫైన్-ఆర్ట్స్ ఆకాడెమీ 38వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన కధలు/పద్యకధల పోటీ లో గెలుపొందిన క్రింది విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం హైదరాబాదులో అకాడెమీ నిర్వహించబోతున్న'సాహిత్య సాంస్కృతిక సమ్మోహనం 2019’ కార్యక్రమంలో జరుగనుంది
విజేతల కథలని/పద్యకథలని క్రింద ప్రచురిస్తున్నాము. చదివి అభిప్రాయాలు తెలుపగలరు.
గెలుపొందిన పద్యకథలు
మొదటి బహుమతి
నాకూ నారాయణుడికీ మధ్య - శారద పోలంరాజు
రెండవ బహుమతి
ఆలోచనే మార్గము - గోపీనాధ్ పిన్నలి
దొంగ పారిపోయాడు - సీతాదేవి గుర్రం
విజేతలకు అభినందనలు!