top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

వ్యాస​ మధురాలు

అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 9
 

అనుమానం  పెనుభూతం

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

"నన్ను మోసం చేస్తున్నావు. ఎవరితో తిరుగుతున్నావు?" ఇలా కొంచెం గట్టిగా భార్యని తూలనాడుతూ, కోపంగా భర్త.

 

"ఏడుస్తూ" అతని వెనకనే అతని భార్య. అతని వయసు 80 సంవత్సరాలు. ఆమె వయసు రెండు మూడేళ్ళూ తక్కువేమో. వీళ్ళది కంప్యూటర్ లో మాట్లాడుకుంటూ ప్రేమించుకొని రెండు మూడేళ్ళకింద పెళ్ళి చేసుకున్న యువజంట కాదే!

ఇంతకీ ఏమిటీ వీళ్ళ తంతు?

గాల్వస్టన్ [Galveston] మెడికల్ సెంటర్ లో నేను రెసిడెన్సీ చేస్తున్న రోజులు. ఈ దంపతులు నాకు కొత్తగా తటస్థపడిన సైకీయాట్రీ ఆసక్తి. వాళ్ళ కథా కమామిషూ ఏమిటంటే -

ఇద్దరూ నల్లవారు [ఇప్పటి పరిభాషలో Afro- Americans] అన్నమాట. వయసు ముందే చెప్పాను. వాళ్ళిద్దరూ 55 యేళ్ళుగా భార్యాభర్తలు. ఇద్దరూ రిటైరు అయ్యి, ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళయి వారి మానాన వాళ్ళు బతుకుతున్నారు.

 

పిల్లలు ఆహ్వానించినా,పరాయి- ఒకరిమీద  ఆధారపడకుండా, ఉన్నదాంతోనే గుంభనంగా  జీవిస్తున్నారు. అనుకూల దాంపత్యం, అతను ఆర్మీలో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ విడిపోలేదు. డ్రగ్స్ ,ఆల్కహాల్ బాధలు లేవు. గాల్వస్టన్  పక్కన ఆల్లెన్ అనే చిన్న వూళ్ళో ప్రశాంతంగానే ఉంటున్నారు. 

రెండు మూడు నెలలనించీ, అతనికి ఆమె దినచర్యలో మార్పు కనిపించింది. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అందరూ లాండ్రీ రూం కి వెళ్ళి లాండ్రీ చేసుకోవాలి. ఒక్కొక్క అపార్ట్మెంట్ కీ వేరే విడి యూనిట్స్ లేవు. సంవత్సరాలుగా అతని భార్యే అతని బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడమూను. ఈ మధ్య అతను గమనించాడు, చాలాసేపు అక్కడే లాండ్రీ రూం లో గడుపుతున్నదని. 


అంతే కాకుండా ఇంతకు ముందులాగా కాకుండా, ఇప్పుడు కిందకి వెళ్ళడానికి బాగా ముస్తాబయ్యి మంచి మంచి బట్టలు వేసుకుని వెళ్ళుతున్నది. వంటికి గూడా మైపూతలు కొత్త కొత్తవి రాసుకొని వెళ్తున్నది. గ్రోసరీ స్టోరు కి వెళ్ళినప్పుడు ఇంతకు ముందులాగా ఒక గంటలో రావటం లేదు. ఇవన్నీ "తనమీది నిరాదరణవల్ల, మరెవరిపైనో వలపు వల్ల"అని అతని మనసులో నిర్ధారణ చేసుకున్నాడు. ఒక పక్క విడాకులు తీసుకుందామని అనుకొంటూ, ఇంకోపక్క, ఒంటరి జీవితం భరించటం ఎలా? అన్న సందిగ్ధత. ఇవన్నీ అతని మెదడులో బాధలు రేపి, భార్యమీద అనుమానం, రాబోయే భవిష్యత్తు తలుచుకొని భయపడుతూ నిస్సంతోషిగా తయారయ్యాడు. ఈ పరిస్థితుల్లో భార్య అంటే కోపం, అనుమానం, దానాదీనా ఆకలి తగ్గిపోవడం, నిద్ర పట్టకపోవడం, బరువు తగ్గడం ఇత్యాది రోగలక్షణాలతో బాధ పడుతున్నాడు.

 

ఆమె స్నేహితులతో సంప్రదించింది, కుటుంబాన్ని సలహా అడిగింది. అందరి సలహాల మేరకు ఆమె భర్తని సైకియాట్రిస్ట్ కి చూపించాలని నిర్ణయించింది. దాంతో ఆయన కోపం అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. "నన్ను పిచ్చివాడంటావా"? అని ఎగబడ్డాడు.

అదీ తెర వెనుక భాగోతం. డాక్టరుగా నేను అపరాధ పరిశోధకుడిలాగా, ఫామిలీతో సంప్రదింపులు, observation, పోలీసు రిపోర్ట్ లు ఏమీ లేకుండా ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. మాట్లాడుతున్నంత సేపూ ఆయన కోపంగానే వున్నాడు, ఆమె విచారంగా ఏడుస్తున్నది.

ముందస్తుగా, ఆయనకి Alzheimers disease లేదని నిర్ణయించాను. మామూలుగా పెద్దవాళ్ళలో ఇటువంటి లక్షణాలు ఉంటే తనిఖీ చేయాల్సిన జబ్బులకి lab tests పురమాయించి, ఆరోజుల్లో మార్కెట్ లో ఉన్న antidepressant medicine- elavil రాసిచ్చాను. మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చాను.

15 రోజులతరవాత చూస్తే, ఆ రోజు తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ వచ్చిన దంపతులేనా అని ఆశ్చర్యం కలిగించేలా ఇద్దరూ నవ్వుకుంటూ, కొత్తగా పెళ్ళయిన దంపతుల్లాగా, చిలకా గోరింకల్లాగా, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ వచ్చారు.

ఏమిటీ మహత్తు?

ఆయనకి డిప్రెషన్ వల్ల ఆ అనుమానాలూ, బాధలూనూ. తను వేసుకున్న మందు ఆ డిప్రెషన్ తగ్గించి ఆయన మనసులో ఉన్న అనుమాన పెనుభూతం పరారీ అయ్యింది. ఆ దరిమిలా, నిద్ర బాగా పట్టింది. ఆకలి గూడా మెరుగయింది. ఆశాకిరణం పొడచూపింది.

వృద్ధవయసులో వచ్చే డిప్రెషన్ ఇలా గూడా వస్తుంది. అంటే జీవిత భాగస్వామి మీద అనుమానం, ఇక దాని మీద చిలవలు పలవలుగా కొత్త కొత్త కథలూ కమామిషులూ బుర్రని తినేస్తాయి. ఇటువంటి symptoms, brain tumor లోనూ,  thyroid diseases లోనూ, కాన్సర్ వ్యాధుల్లోనూ గూడా వస్తాయి. ఇదమిత్థమని
తెలిసేదాకా, నేనిచ్చిన మందు పని చేసింది. దరిమిలా ఆ టెస్టులన్నీ నెగటివ్ వచ్చాయనుకోండి.


ఆ తరవాత కథ మామూలే  They happily lived thereafter.

Spousal jealousy ఇల్లాగ డిప్రెషన్ symptom గా రావచ్చు

*****

bottom of page