MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
“అసమాన అనసూయ” గారికి 100 వ పుట్టిన రోజు శుభాకాంక్షలతో... ..
-
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడలుగా, 1930 -50 దశకాలలో గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహా కవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో పాడి భావ గీతాలు. లలిత గీతాల ప్రక్రియకు ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని.
-
“జయ జయ ప్రియ భారత లాంటి అనేక దేశభక్తి గీతాలు, మొక్కజొన్న తోటలో & నోమీన మల్లాల లాంటి జానపద బాణీల స్వర కర్త.
-
మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదగేయాలకు సభాగాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన ఘనత ఆవిడదే !
-
భారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త.
-
విశ్వవిద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని.
-
దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు.
-
ప్రపంచవ్యాప్తంగా 11 జీవన సాఫల్య పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ వారి “కళా ప్రపూర్ణ” మొదలైన శతాధిక గుర్తింపులు.
-
అనేక దేశాలలో వేలాది కచేరీలు.
-
11 గ్రంధాల రచన.
.......వెరసి..”అసమాన అనసూయ” గారు... “కళా ప్రపూర్ణ” డా. అవసరాల (వింజమూరి) అనసూయ గారు
1978 లో అమెరికాలో రికార్డు చెయ్యబడిన మొట్ట మొదటి 78 rpm "మన పల్లె పదాలు". ప్రధాన గాయని & సంగీత దర్శకురాలు అనసూయా దేవి గారి సహ గాయని వింజమూరి సీత (చెల్లెలు), హ్యూస్టన్ వాసులైన వసంత లక్ష్మి పుచ్చా, హీరా & సూరి దువ్వూరి, వంగూరి చిట్టెన్ రాజు, బిలకంటి గంగాధర్ (గాత్ర సహకారం), అనిల్ కుమార్, డేవిడ్ కోర్ట్నీ, రవి తమిరిశ (వాద్య సహకారం), కుమార్తె రత్నపాప (వ్యాఖ్యాత).