MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'అలనాటి' మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
నేకెడ్ ఫకీర్
గత నెలలో పరమపదించిన ప్రముఖ రచయిత కె.సదాశివరావు గారికి నివాళిగా ఈ సంచిక అలనాటి మధురాలలో వారి "నేకెడ్ ఫకీర్" కథని పాఠకులకి అందిస్తున్నాము. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో అక్టోబర్ 1989 లో ప్రచురించబడింది.
ఆత్మా ఫాక్టర్ లాంటి సైన్స్ ఫిక్షన్ కథలతో, క్రాస్ రోడ్స్ వంటి కథల సంపుటితో, అత్యున్నత ప్రమాణాలతో అందించిన "పాలపుంత" వ్యాసాలతోనూ వైవిధ్యాన్ని ఇష్టపడే పాఠకులని అలరించిన రచయితగా సదాశివరావు గారు తెలుగు సాహితీప్రియుల మస్తకాలలో శాశ్వతంగా నిలిచిపోతారు.
"నేకెడ్ ఫకీర్" లాంటి బ్రిటిష్ రాజా కథలలో వారికే సొంతమైన సునిశిత పరిశీలనతో నాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులకి అద్దం పడుతూ , బ్రిటిష్ పాలకుల దృష్టికోణంలో ఆవిష్కరించిన వ్యక్తిత్వాలని మనం చూడవచ్చు. జనవరి 30న గాంధీగారి వర్ధంతి సందర్భంగా ఈ కథని సూచించిన వాసిరెడ్డి నవీన్ గారికి, అందించిన రమణమూర్తి గారికి ధన్యవాదాలు. ఈ కథ ప్రచురించేందుకు అనుమతినిచ్చిన సదాశివరావు గారి తనయుడు రంజిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
క్రింది కథ పీ.డీ.ఎఫ్. లో తదుపరి పేజీ కొరకు పేజీ నెంబరు ప్రక్కన గల " > " ని క్లిక్ చేయగలరు
తదుపరి పేజీ కొరకు, పేజీ ముందు భాగంలో నెంబరు ప్రక్కన గల > ని క్లిక్ చేయగలరు