MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'అలనాటి' మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
"మల్లెపువ్వు" - ఆదివిష్ణు గారి మాటల్లో శ్రీ తిలక్.
తొలిప్రచురణ: విశాలాంధ్ర
సేకరణ: మెడికో శ్యామ్
10 జులై 1966 న విశాలాంధ్రలో ప్రచురించబడిన తిలక్ గారి జ్ఞాపకాలపై ఆదివిష్ణు గారి వ్యాసం "మల్లెపువు" అలనాటి మధురాలు పాఠకులకై ప్రత్యేకంగా...
చాలాకాలం క్రిందటి సంగతి.
తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడినట్లు మిత్రుడు రంగధామ్ ఉత్తరం రాసినపుడు నేనెంతో ఆనందించేను. అప్పుడు నాకు ఆ వూరు దగ్గర్లోవున్న తణుకు జ్ఞాపకం వచ్చింది.
బాలగంగాధర్ తిలక్ మూలంగానే తణుకు గుర్తుకురావడం.
ఆయన ఖరీదయిన మనిషి. మంచి ఖరీదయిన కథలూ, విలువయిన పొయెట్రీలు రాయగలరు. ఒక చిత్రమైన జబ్బుతో ఆయన బాధపడుతున్నట్టు నేనెప్పుడో విన్నాను.
అమృతవర్షిణి - కథ
తొలిప్రచురణ: నవ్య వారపత్రిక
రచయిత: ఓలేటి శ్రీనివాస భాను
ఈ కథ 2017 నవ్య వారపత్రిక వారు నిర్వహించిన ‘తురగా జానకి రాణి స్మారక కథల పోటీ’లో బహుమతి పొందింది. సంపాదకుల ప్రత్యేక ఎంపికగా ఈ కథని పునర్ముద్రిస్తున్నాము.
సైలెంట్ మోడ్ లో ఉన్న మొబైల్ రెండు సార్లు మోగింది.
ఇంట్లో పిల్లలకు వీణ పాఠాలు చెబుతున్న అమృతవర్షిణి చూసుకోలేదు. “ఆంటీ మొబైల్ మోగుతోంది.” అని ఓ స్టూడెంట్ చెప్పగానే అమృత వర్షిణి ఫోన్ అందుకొంది. “మేడం..నేను టెక్నో స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జంట్ గా రండి. మీ అబ్బాయి బిలహరి కి హై ఫీవర్. వామిటింగ్స్ చేసుకొంటున్నాడు” అన్నాడు అవతలి వ్యక్తి.
ట్యూషన్ పిల్లల్ని పంపించేసి ఆటో లో టెక్నో స్కూల్ కు వెళ్ళింది అమృత వర్షిణి . బిలహరి ని తీసుకొని తోవలోనే ఉన్న తమ ఫ్యామిలీ డాక్టర్ మూర్తి గారికి చూపించింది. ఆయన వెంటనే తన హాస్పిటల్లో బిలహరిని అడ్మిట్ చేసుకొన్నారు. సెలైన్ పెట్టారు. రెండు రోజులు హాస్పిటల్ లోనే ఉంచడం మేలన్నారు.
సమయానికి తన భర్త వాసు ఊళ్ళో లేడు. అదే రోజు ఉదయం ఫ్లైట్ లో బాస్ తో కలిసి దుబాయి వెళ్ళేడు. మూడు వారాల క్యాంప్. వాసుది తరచు క్యాంపులు వెళ్ళే ఉద్యోగం. అందువల్ల పిల్లల్ని చూసుకోవడం అమృతవర్షిణి కి అలవాటే. కానీ ఆ రోజు పరిస్థితి వేరు.