MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
'అలనాటి' మధురాలు
సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు | శ్రీనివాస్ పెండ్యాల
నన్ను గురించి కథ వ్రాయవూ?
స్వర్గీయ బుచ్చిబాబు
"నన్ను గురించి కథ వ్రాయవూ?" అని అడిగింది కుముదం.
ఈ ప్రశ్న నాకు కొంత ఆశ్చర్యం కలగజేసింది. ఎందుకంటే కొద్ది మార్పుతో ఇదే ప్రశ్న ఎనిమిది సంవత్సరాల క్రితం అడిగింది. నాకు బాగా జ్ఞాపకం. మా మేనమామగారింట్లో కుముదం తండ్రి కాపురం వుండేవాడు. అద్దె తీసుకురమ్మని అప్పుడప్పుడు నన్ను పంపేది మా అత్తయ్య. ఆ రోజు సాయంత్రం కర్రకు మేకు దిగేసి , ఇనుపచక్రం దొర్లించుకుంటూ దొడ్లో పరుగులెత్తింది కుముదం. నాకప్పుడు పన్నెండో ఏడు. ఆమె నాకంటే రెండు
తొలి ప్రచురణ: ఆంధ్రశిల్పి - 1946 ఆగస్టు
తన కవిత్వం గురించి తనే...
స్వర్గీయ శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983).
1981 లో సతీమణి సరోజ గారితో అమెరికా పర్యటన కి ఒక “సాహిత్య జ్ఞాపిక” గా హ్యూస్టన్ మహా నగరంలో ఆయన చేతి వ్రాతతో “సిప్రాలి’” ....(సిరి సిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కులు అనే మకుతాలతో 308 వచన కవితలు ---పుస్తక రూపంగా వెలువడింది. గత జూన్ నెలలో ఆయన 33 వ వర్ధంతి సందర్భంగా ఆ గ్రంధం నుంచి కొన్ని కవితలు “మధురవాణి” పాఠకుల కోసం సమర్పిస్తున్నాం...