MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
ఆహ్వానిత మధురాలు
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు | దీప్తి పెండ్యాల
నా డైరీల్లో కొన్ని పేజీలు... ఓడలు బళ్ళు అయిన వేళ
గొల్లపూడి మారుతీ రావు
1970 జనవరి 16: 'చెల్లెలి కాపురం' ఆఫీసులో డి. ఎస్. ప్రకాశరావునీ, జయరాంనీ తిట్టిన సందర్భం. జర్దా కిళ్ళీ.
ఇది 46 సంవత్సరాల కింద మాట. ఏ విధంగా చూసినా ఈ వాక్యాలు డైరీలో రాసుకోవలసినంత ప్రత్యేకమయినవీ కావు, ముఖ్యమైనవీ కావు. ఎందుకు రాశాను? నా జీవితం లో అతి ముఖ్యమయిన మలుపుల్లో ఈ రెండు వాక్యాల ప్రమేయం ఉంది, ఆశ్చర్యం.
'చెల్లెలి కాపురం' సినీ నటులు బాలయ్యగారి మొదటి చిత్రం. ఆ చిత్రానికి దర్శకులు కె.విశ్వనాథ్. ఆయనతో నేను కలిసి పనిచేసిన రెండో చిత్రం. ఆయన మొదటి చిత్రం నాకు రెండో చిత్రం. దాని పేరు "ఆత్మ గౌరవం'...
మెడమీద వాటా అద్దెకివ్వబడును
కొండేపూడి నిర్మల
సుభద్రకివాళ మనసు మనసులో లేదు.
వొంటిమీద నగలన్నీ వొలిచి గంపలో వేసింది. రివ్వుమంటూ వళ్లంతా చల్లటి ఏ.సి గాలి తగిలింది. నగలు తీసేస్తే ఇంత గాలి తగులుతుందా? అని ఆశ్చర్య పోలేదు. అసలా సుఖాన్ని గుర్తించే పరిస్థితిలోనే ఆమె లేదు. ఎడమ కాలితో కార్పెట్ మీద ఒక తాపు తన్నింది. గంప తుళ్ళి రాక్షసుడి నాలుక బద్ద లాంటి వడ్డాణం కిందపడింది. వెంటనే కళ్ళకద్దుకుని దాన్ని తీసి గంపలో వెయ్యలేదు. వొలికిన పళ్లరసంలో తడిసిపోయిన వారపత్రికలోకి క్రూరంగా చూస్తూ...
కాకినాడలో రాజాజీతో ముచ్చట్లు
నరిసెట్టి ఇన్నయ్య
రాజాజీతో నా తొలి పరిచయం ఒక మధురానుభూతి. ఇది 1959 జూన్ నాటి మాట. కాకినాడలో తొలిసారిగా ములుకుట్ల వెంకట శాస్త్రిగారి ఇంట్లో కలిసి చాలాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం నా అనుభవాలలో విశిష్టమైనది.
జీవితంలో ముఖ్యమంత్రి నుండి గవర్నర్ జనరల్ దాకా అన్ని పదవులూ జయప్రదంగా నిర్వహించి పేరు తెచ్చుకున్న రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) 80వ పడిలో ఆందోళన చెంది రాజకీయాలలోకి చురుకుగా పాల్గొనటం ఆశ్చర్యకరమైన విషయం. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతుల.
బూస్ట్ యువర్ బేబి ఐ.క్యూ
రామానుజరావు తుర్లపాటి
“నెక్స్ట్ “ పిలిచింది సుస్మిత వాచీ చూసుకుంటూ. తొమ్మిది గంటలయ్యింది. ఇప్పటికే భర్త రమేష్, రెండు సార్లు ఫోను చేశాడు. ఇవాళ చాలా కేసులు రావడంతో ఆలశ్యం అయ్యింది. ఇదే లాస్టు కేసు. తొందరగా చూసి పంపించేస్తే, ఇంటికి వెళ్ళిపోవచ్చు.
బయట స్టూల్ మీద కూర్చున్న నరసింహం తలుపు తెరిచి, సహజను లోపలికి పంపించాడు. సహజ లోపలికి వస్తూనే డాక్టర్ వంక చూసింది. సుస్మితకు సుమారు ముఫై అయిదేళ్ళు వుండవచ్చు. మంచి అందమైన...